క్యాప్చర్ ఎస్‌యువిని మళ్లీ పరీక్షించిన రెనో: విడుదల వివరాలు

Written By:

రెనో త్వరలో విడుదల చేయనున్న క్యాప్చర్ ఎస్‌యువిని ఇప్పటికే పలుమార్లు రహస్యంగా దేశీయ రహదారుల మీద పరీక్షించింది. అయితే ఇప్పుడు మరో సారి తాజాగ పరీక్షించిన క్యాప్చర్ ఫోటోలు ఇంటర్నెట్లో తళుక్కుమన్నాయి. కొత్తగా విడుదలైన క్యాప్చర్ ఫోటోలను గమనిస్తే రెనో దీనిని ఎంత వేగంగా అభివృద్ది చేస్తోందో స్పష్టం అవుతుంది.

రెనో ఇండియా ఈ క్యాప్చర్ ఎస్‌యువిని దేశీయంగా ఉన్న చెన్నైలోని రెనో-నిస్సాన్ ప్లాంటులో ఉత్పత్తి చేయనుంది. 2017 లో ఆలస్యంగా విడుదలయ్యే అవాశం ఉన్నట్లు తెలసింది.

దీని డిజైన్ అంశాలను గుర్తించడానికి వీల్లేకుండా రెనో జాగ్రత్తపడుతూ వచ్చింది. ఇది మార్కెట్లోకి విడుదలైతే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మారుతి సుజుకి వితారా బ్రిజా, మరియు హోండా బిఆర్-వి వంటి వాటికి గట్టి పోటీనివ్వనుంది.

దేశీయంగా విడుదలకు నోచుకునే క్యాప్చర్ ఎస్‌యువి సాంకేతికంగా 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ ఆప్షన్‌లతో విడుదల కానుంది. ఈ ఎస్‌యువి సుమారుగా 89బిహెచ్‌పి పవర్ మరియు 220ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలిగే అవకాశం ఉంది.

ట్రాన్స్‌మిషన్ పరంగా రెండు ఇంజన్ వేరియంట్లు కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానంతో వచ్చే అవకాశం ఉంది. రెనో అభివృద్ది చేసి డస్టర్ ఎమ్ఒ వేదిక మీదనే ఈ ఎస్‌యువిని నిర్మిస్తోంది.

అయితే యూరో ఆధారిత మోడల్ అయితే క్లియో హ్యాచ్‌బ్యాక్ ప్రేరణతో నిర్మించబడింది. దేశీయంగా విడుదల కానున్న డస్టర్ ఆధారిత క్యాప్చర్ ఎస్‌యువి యురోపియన్ మోడల్ క్యాప్చర్ కన్నా కొలతల్లో కాస్త పెద్దదిగా ఉంటుంది.

రెనో క్యాప్చర్ కొలతల పరంగా పొడవు 4,333ఎమ్ఎమ్, వెడల్పు 1,813ఎమ్ఎమ్, ఎత్తు 1,613ఎమ్ఎమ్ మరియు వీల్ బేస్ 2,674ఎమ్ఎమ్‌గా ఉంది.

రెనో ఇండియా లైనప్ లోకి క్యాప్చర్ విడుదలయితే డస్టర్ పై స్థానంలో నిలవనుంది. ఇది వరకే వచ్చిన ఆధారం లేని కథనం ప్రకారం రెనో తమ ప్ల్యూయెన్స్ మరియు కొలియోస్ ఎస్‌యువి లను మార్కెట్ నుండి తొలగించనున్నట్లు తెలిసింది.

 

మారుతి సుజుకి స్విఫ్ట్ కొనాలనుకుంటున్నారా...? అయితే కొద్ది రోజులు వేచి ఉండండి. త్వరలో 2017 స్విప్ట్ మార్కెట్లోకి విడుదల కానుంది. నూతన డిజైన్ శైలిలో విడుదల కానున్న స్విఫ్ట్ ఎలా ఉందో ఇక్కడ ఉన్న ఫోటోల మీద క్లిక్ చేయండి....
 

Read more on: #రెనో #renault
English summary
Renault Kaptur Spotted Testing Again On Indian Roads; Launch Imminent
Please Wait while comments are loading...

Latest Photos