ఫార్చ్యూనర్ మరియు ఎండీవర్‌లకు శాశ్వతంగా చెక్ పెట్టనున్న చెక్ రిపబ్లిక్ కార్ల కంపెనీ

Written By:

స్కోడా ఈ మధ్యనే ఇండియన్ మార్కెట్లోకి ఆక్టావియా ఆర్ఎస్ సెడాన్ కారును లాంచ్ చేసింది. చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా ఇప్పుడు ప్రీమియమ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి తమ తొలి ఎస్‌యూవీని విడుదల చేయడానికి సిద్దమవుతోంది.

కొడియాక్ ఎస్‌యూవీ విడుదల తేదీ ఖరారు చేసిన స్కోడా

తాజాగా అందిన సమాచారం మేరకు, విపణిలో ఉన్న టయోటా ఫార్చ్యూనర్ మరియు ఫోర్డ్ ఎండీవర్ ప్రీమియమ్ ఎస్‌యూవీలకు చెప్ పెట్టేందుకు కొడియాక్ ఎస్‌యూవీని ఆక్టోబర్ 4, 2017 న మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలిసింది.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
కొడియాక్ ఎస్‌యూవీ విడుదల తేదీ ఖరారు చేసిన స్కోడా

స్కోడా నుండి వస్తున్న మొట్టమొదటి మరియు పూర్తి స్థాయి ఎస్‌యూవీ కొడియాక్. దీనిని వోక్స్‌వ్యాగన్ వారి ఎమ్‌క్యూబి ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా సూపర్బ్ మరియు ఆక్టావియా లను ఉపయోగించుకుని కొడియాక్‌ను నిర్మించారు.

కొడియాక్ ఎస్‌యూవీ విడుదల తేదీ ఖరారు చేసిన స్కోడా

స్కోడా కొడియాక్ ఫ్రంట్ డిజైన్‌లో స్కోడా వారి సిగ్నేచర్ బటర్ ప్లై గ్రిల్, ఎల్ఇడి హెడ్ లైట్లు, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు ఉన్నాయి. కొడియాక్ సైడ్ ప్రొఫైల్ చూస్తే, ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ నుండి డోర్ హ్యాండిల్స్ మీదుగా రియర్ టెయిల్ ల్యాంప్స్ వరకు పొడగించబడిన క్యారెక్టర్ లైన్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి.

కొడియాక్ ఎస్‌యూవీ విడుదల తేదీ ఖరారు చేసిన స్కోడా

సాంకేతికంగా స్కోడా కొడియాక్ ఎస్‌యూవీ డీజల్ ఇంజన్ నుండి పవర్ పొందనుంది. అందుకోసం ఇందులో 143బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 2-లీటర్ టిడిఐ డీజల్ ఇంజన్ అందివ్వడం జరిగింది.

కొడియాక్ ఎస్‌యూవీ విడుదల తేదీ ఖరారు చేసిన స్కోడా

విడుదలప్పుడు కేవలం డీజల్ ఇంజన్ వేరియంట్లను మాత్రమే లాంచ్ చేయనుంది. ఇందులో ఎలాంటి పెట్రోల్ వేరియంట్లు రావడం లేదు. ఆక్టావియా మరియు వోక్స్‌వ్యాగన్ టిగువాన్ లలో కూడా ఇదే డీజల్ ఇంజన్ ఉపయోగించారు. స్కోడా కొడియాక్ ఆల్‌వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో కూడా రానుంది.

కొడియాక్ ఎస్‌యూవీ విడుదల తేదీ ఖరారు చేసిన స్కోడా

స్కోడా కొడియాక్ ఇంటీరియర్‌లో ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి అప్లికేషన్లను సపోర్ట్ చేయగల పెద్ద పరిమాణంలో ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ల్పే కలదు. తమ ఆక్టావియాలో అందించిన హ్యాండ్స్ ఫ్రీ కారు పార్కింగ్ ఫీచర్‌ను ఇందులో అందించే అవకాశం ఉంది.

కొడియాక్ ఎస్‌యూవీ విడుదల తేదీ ఖరారు చేసిన స్కోడా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

స్కోడా కొడియాక్ వెహికల్‌తో ఇండియన్ ఎస్‌యూవీ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. కొడియాక్ ఎస్‌యూవీ అంచనాగా 27 నుండి 32 లక్షల ఎక్స్-షోరూమ్ ధరల శ్రేణిలో టయోటా ఫార్చ్యూనర్ మరియు ఫోర్డ్ ఎండీవర్ లకు గట్టి పోటీని సృష్టిస్తూ విడుదల కానుంది.

English summary
Read In Telugu: Skoda Kodiaq India Launch Date Revealed
Story first published: Monday, September 11, 2017, 10:32 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark