లారా సెడాన్‌ను రీకాల్ చేసిన స్కోడా

Written By:

స్కోడా ఆటో ఇండియా గతంలో విక్రయించిన లారా కార్లను రీకాల్ చేసింది. 2009 మరియు 2010 మధ్య కాలంలో ఉత్పత్తి చేసిన వాటిలో బ్రేకింగ్ సేఫ్టీ వ్యవస్థలో ఉన్న సాఫ్ట్ కంట్రోల్ యూనిట్‌ అప్‌డేట్ కారణంగా రీకాల్ చేసినట్లు స్కోడా వెల్లడించింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
భారత్‌‌లో స్కోడా లారా రీకాల్

స్కోడా ఆటో ఇండియా సర్వీస్ యాక్షన్ ఆలర్ట్ సెక్షన్‌లో తమ వెబ్‌సైట్ ఆధారంగా ప్రకటించింది. చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన స్కోడా ఏబిఎస్/ఇసిఎస్ కంట్రోల్ యూనిట్లలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కోసం సర్వీస్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది.

భారత్‌‌లో స్కోడా లారా రీకాల్

2009 మరియు 2010 మధ్య స్కోడా విక్రయించిన 663 లారా కార్లను రీకాల్ చేసింది. వీటిలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ తప్పనిసరి. ఇందులో స్కోడా ఇండియా ప్రత్యేక క్యాంపెన్ నిర్వహించడానికి ముందుకొచ్చింది.

భారత్‌‌లో స్కోడా లారా రీకాల్

అధీకృత స్కోడా డీలర్లు రీకాల్‌కు గురైన కార్ల కస్టమర్లకు స్కోడా ఫోన్ చేసి సర్వీస్ కోసం అపాయింట్ ఇవ్వనున్నారు. ఈ మొత్తం సర్వీస్ ఉచితంగా అందిస్తున్నారు. కేవలం గంట వ్యవధిలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తామని తెలిపారు.

భారత్‌‌లో స్కోడా లారా రీకాల్

మరి మీరు కూడా ఇదే కాలంలో స్కోడా లారా కారును కొనుగోలు చేసినట్లయితే, దానిని గుర్తించడం ఎలా? చాలా సింపుల్... ఇక్కడ క్లిక్ చేసి, మీ వెహికల్ ఐడింటిఫికేషన్ నంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

భారత్‌‌లో స్కోడా లారా రీకాల్

యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ చక్రాలు లాక్ అవడాన్ని మరియు అనివార్యపు టైర్ల జారుడును నివారిస్తుంది. వెహికల్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సందర్భంలో వెహికల్ స్టెబిలిటీని కంట్రోల్ చేయడానికి ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్ సిస్టమ్ ఉపయోగపడుతుంది.

భారత్‌‌లో స్కోడా లారా రీకాల్

అమెరికాకు చెందిన ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ ఇండియన్ మార్కెట్లో సుమారుగా 1,200 యూనిట్ల కంపాస్ ఎస్‌యూవీలను రీకాల్ చేసింది. కంపాస్ వాహనంలో ప్యాసింజర్ సైడ్ ఎయిర్ బ్యాగును మార్చడం కోసం లోపం ఉన్న వాహనాలను వెనక్కి పిలిచింది.

భారత్‌‌లో స్కోడా లారా రీకాల్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

స్కోడా ఆటో ఇండియా స్వచ్ఛందంగా లారా మోడల్‌ను రీకాల్ చేసింది. కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని తమ కార్లలో సాంకేతికంగా తలెత్తిన లోపాన్ని సవరించడానికి స్వయంగా ముందుకొచ్చింది.

English summary
Read In Telugu: Skoda Recalls 663 Units Of Laura In India — Is Your's On The List?
Story first published: Tuesday, November 28, 2017, 16:10 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark