రీకాల్‌కు గురైన జీప్ కంపాస్: అసలు సమస్య ఇదీ!

Written By:

ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ ఇండియాలో విక్రయించిన జీప్ కంపాస్ ఎస్‌యూవీలను రీకాల్ చేసింది. ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ ఇండియాలోకి పరిచయమయ్యాక చేసిన తొలి రీకాల్ ఇదే. సెప్టెంబర్ 05 నుండి నవంబర్ 19, 2017 మధ్య తయారైన జీప్ కంపాస్ ఎస్‌యూవీలను వెనక్కి పిలిచినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
జీప్ కంపాస్ రీకాల్

జీప్ కంపాస్ ఎస్‌యూవీలలోని ప్యాసింజర్ సైడ్ ఎయిర్ బ్యాగుల లోపం కారణంగా వెనక్కి పిలిచింది. మొత్తం 1200 యూనిట్ల జీప్ కంపాస్ వాహనాలు రీకాల్‌కు గురయ్యాయి.

Recommended Video
[Telugu] Jeep Compass Launched In India - DriveSpark
జీప్ కంపాస్ రీకాల్

ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ అంతర్జాతీయంగా నవంబరు 22, 2017 నిర్వహించిన రీకాల్‌లో భాగంగా మొత్తం 7,000 ఎస్‌యూవీలను వెనక్కి పిలిచింది. యుఎస్ మార్కెట్లోని కెనెడా, మెక్సికో వంటి దేశాలలో 1,000 యూనిట్లు రీకాల్ అయ్యాయి.

జీప్ కంపాస్ రీకాల్

అంతర్జాతీయ రీకాల్‌లో భాగంగానే ఇండియాలో విక్రయించిన వాటిలో సమస్యాత్మకంగా ఉన్న 1200 యూనిట్లను ఫియట్ క్రిస్లర్ ఇండియా వెనక్కి పిలిచింది.

జీప్ కంపాస్ రీకాల్

జీప్ కంపాస్ రీకాల్‌కు ప్రధాన కారణం, ఎయిర్ బ్యాగులును అమర్చడానికి ఉపయోగించిన బోల్టులు వదులుగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఈ లోపంతో ప్రమాదం జరిగినపుడు ఫ్రంట్ సైడ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు విచ్చుకోవడం జరగదు. దీంతో ఫ్రంట్ సైడ్ ప్యాసింజర్‌కు ఇది ప్రమాదకరమైనది.

జీప్ కంపాస్ రీకాల్

ఎయిర్ బ్యాగులోని లూజ్ బోల్ట్ ద్వారా ప్రమాదం జరగడం మరియు ఎయిర్ బ్యాగులు విచ్చుకోకపోవడం వంటివి నమోదు కాలేదని ఫియట్ క్రిస్లర్ ఇండియా పేర్కొంది. మరియు ఫ్రంట్ ఫ్యాసింజర్ ఎయిర్ బ్యాగులోని సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఫ్రంట్ ప్యాసింజర్ సీటును వినియోగించవద్దని సూచించింది.

జీప్ కంపాస్ రీకాల్

దేశవ్యాప్తంగా విక్రయించిన జీప్ కంపాస్ వాహనాలలో రీకాల్‌కు గురైన వాటిని జీప్ ఇండియా మరియు డీలర్లు గుర్తించి కస్టమర్లను అలర్ట్ చేయనున్నారు. వీటిలో ఉన్న సమస్యను జీప్ ఉచితంగా రిపేరీ చేయనుంది. మరి మీ వద్ద జీప్ కంపాస్ ఉన్నట్లయితే, వెంటనే మీ డీలర్‌ను సంప్రదించి రీకాల్ జాబితాలో మీ కంపాస్ ఉందో లేదో... చెక్ చేసుకోండి.

జీప్ కంపాస్ రీకాల్

జీప్ ఇండియా విపణిలోకి కంపాస్ ఎస్‌యూవీని జూలై 2017 విడుదల చేసింది. అనతి కాలంలో మంచి పాపులారిటీని దక్కించింది. గడిచిన అక్టోబర్ 2017 నెలలో దేశవ్యాప్తంగా 7,561 యూనిట్ల కంపాస్ ఎస్‌యూవీలను విక్రయించింది.

జీప్ కంపాస్ ఎస్‌యూవీని టెస్ట్ డ్రైవ్ చేసి, పరీక్షించి డ్రైవ్‌స్పార్క్ తెలుగు రివ్యూ ప్రచురించింది. జీప్ కంపాస్ రివ్యూ కోసం...

జీప్ కంపాస్ రీకాల్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సాధారణంగా, ఇండియాలో మంచి ఆదరణ పొందిన కార్లలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే, కస్టమర్లలో బ్రాండ్ మరియు గుర్తింపు పోతుందని కార్ల కంపెనీలు బహిరంగంగా వెల్లడించవు. కానీ, కస్టమర్ల భద్రత మరియు నాణ్యత పరంగా జీప్ తీసుకునే చొరవతో తమ కంపాస్ ఎస్‌యూవీలలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని వివరించి, ఈ సమస్యకు గురైన వాహనాలను వెవక్కి పిలిచింది.

English summary
Read In Telugu: Jeep Compass Recalled In India Over Airbag Issue; Is Yours On The List?
Story first published: Friday, November 24, 2017, 14:43 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark