208 కారును రహస్యంగా పరీక్షిస్తున్న ప్యూజో

Written By:

ఫ్రెంచ్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ ప్యూజో ఇండియన్ రోడ్ల మీద తమ మోస్ట్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ 208 కారును రహస్యంగా పరీక్షిస్తోంది. మహారాష్ట్రలో టెస్టింగ్ నిర్వహిస్తుండగా ఐఏబి అనే వైబ్‌సైట్ గుర్తించింది.

ప్యూజో 208 టెస్టింగ్

ప్యూజో 208 కారును తొలుత 2011లో విడుదల చేసింది. తరువాత 2015లో ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేసింది. ఇప్పుడు పిఎస్ఎ గ్రూప్ సెకండ్ జనరేషన్ 208 కారును రూపొందిస్తోంది.

ప్యూజో 208 టెస్టింగ్

తాజాగా లీకైన స్పై ఫోటోల ప్రకారం, ప్రొడక్షన్ దశకు చేరుకున్న సెకండ్ జనరేషన్ 208 మోడల్ అని స్పష్టం అవుతోంది. దీనిని 2018 మలిసగంలో విపణిలోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది.

ప్యూజో 208 టెస్టింగ్

ఇండియన్ మార్కెట్లో బి-సెగ్మెంట్ హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ సెడాన్ మరియు కాంపాక్ట్ ఎస్‌యూవీలను విడుదలకు సిద్దం చేస్తోంది.

ప్యూజో 208 టెస్టింగ్

యూరోపియన్ రేంజ్ మోడళ్లను దేశీయ విపణిలోకి తీసుకువస్తే, వీటిలో సెకండ్ జనరేషన్ 208 హ్యాచ్‌బ్యాక్, సెడాన్ మరియు 301 కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఉన్నాయి.

ప్యూజో 208 టెస్టింగ్

పిఎస్ఎ గ్రూపు కార్ల ఉత్పత్తి, అమ్మకాలు మరియు విడి పరికరాల ఉత్పత్తికి సికె బిర్లా గ్రూపుతో భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకుంది. సికె బిర్లాకు తమిళనాడులో ఏడాది లక్ష యూనిట్ల తయారీ సామర్థ్యం ఉన్న ప్రొడక్షన్ ప్లాంటు కలదు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రపంచ విపణిలో భారత్ అతి పెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా ఉంది. కొన్ని అంతర్జాతీయ సంస్థలు తమ కార్లను ఇండియాలో విక్రయించుకోవడానికి ఇప్పుటికే ఓ కన్నేసి ఉంచాయి. అందులో ప్యూజో ఒకటి. ఈ కంపెనీ వచ్చే ఏడాది ఇండియన్ మార్కెట్లో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది.

Source

English summary
Read In Telugu: Spy Pics: Peugeot 208 Spotted Testing In India. Get more details about peugeot 208.

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark