వాహనం కొనుగోలు చేసే ముందు సుప్రీం కోర్టు యొక్క ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోండి..!!

Written By:

ప్రతి ఏడాది భారత వాహన పరిశ్రమలో కొత్త నియమాలు, కొత్త నిభందనలు అమల్లోకి వస్తుంటాయి. ఎప్పటిలాగే సుప్రీం కోర్టు కొన్ని కొత్త రూల్స్‌ను ప్రకటించింది. ఆ రూల్స్ ఏంటి, వాటి వలన ఎవరికి లాభం గురించి మరిన్ని వివరాలు...

వచ్చే ఏప్రిల్ 1, 2017 నుండి దేశీయంగా అమ్ముడుపోయే ప్రతి వాహనంలో కూడా బిఎస్-4 ఇంజన్ తప్పనిసరిగా ఉండాలి. అయితే ఇప్పుడు యథావిధిగా బిఎస్-3 ఇంజన్‌లు గల వాహనాలను విక్రయించుకోవచ్చు. అయితే వాహన తయారీ సంస్థలకు తలపోటు తెప్పించే ఆదేశాన్ని సుప్రీం కోర్టు జారీ చేసింది.

బిఎస్-4 వాహనాలు పరిచయం చేసిన తరువాత, అమ్ముడుపోకుండా నిలిచిపోయిన బిఎస్-3 వెహికల్స్ ఏ మేరకు ఉన్నాయో అనే వివరణ ఇవ్వాలని పేర్కొంది.

ఇటి ఆటో ప్రకారం, వాహన తయారీ సంస్థలు ఇచ్చే గణాంకాలను బట్టి, బిఎస్-3 నియమాలను పాటించే వాహనాలు గడువులోపు ఎక్కువ సంఖ్యలో తయారీదారుల వద్ద ఉంటే, వాటిని తిరిగి అమ్ముకునే విశయంపై పునరాలోచన చేయనున్నట్లు తెలిసింది.

అంతే కాకుండా డిసెంబర్ 31, 2015 నుండి ఇప్పటి వరకు ఉత్పత్తి అయిన బిఎస్-3 వాహనాలు వివరాలను వెల్లడించాలని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫ్యాక్చరర్స్(SIAM) ను సుప్రీ కోర్టు కోరింది.

ఇప్పటి వరకు అమ్ముడుపోకుండా నిలిచిపోయిన బిఎస్-3 ఉద్గార నియమాలను పాటించే వాహనాల వివరాలను సియామ్ కాలుష్య నియంత్రణ మండలికి ఓ నివేదికను సమర్పించింది.

సియామ్ వెల్లడించిన వివరాలు మేరకు, 20,000 కార్లు మరియు ఎస్‌యూవీలు, 7,50,000 ద్విచక్ర వాహనాలు, 47,000 మూడు చక్రాల వాహనాలు అదే విధంగా 75,000 కమర్షియల్ వాహనాలు ఉన్నట్లు వివరించింది.

కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏప్రిల్ 1 , 2017 నుండి అన్ని వాహనాలను కూడా బిఎస్- IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌లతో మాత్రమే విక్రయించాలిని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

అయితే గడువులోపు బిఎస్-III ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌లు ఉన్న వాహనాల స్టాక్‌ పూర్తి చేసేందుకు వాహన తయారీ సంస్థలు అనేక డిస్కౌంట్లు మరియు భారీ ఆఫర్లతో కస్టమర్లకు ఎర వేస్తున్నాయి.

బిఎస్-III ప్రమాణాలను పాటించే ఇంజన్‌లతో పోల్చిచే బిఎస్-IV ప్రమాణాలను పాటించే ఇంజన్‌లు తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తాయి. కాబట్టి బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌లను అన్ని వాహనాలలో ఇప్పుడు తప్పనిసరైంది. బిఎస్ అనగా భారత్ స్టేజ్.

 

English summary
Supreme Court Orders Vehicle Manufacturers To Disclose Unsold BS3 Vehicle Numbers
Story first published: Wednesday, March 22, 2017, 11:08 [IST]
Please Wait while comments are loading...

Latest Photos