నెక్ట్స్ జనరేషన్ వ్యాగన్ ఆర్ ఆవిష్కరించిన సుజుకి

Written By:

మారుతి సుజుకి లోని ఎవర్‌గ్రీన్ వ్యాగన్ ఆర్ భారీ మార్పులతో విడుదలకు సిద్దమవుతోంది. నెక్ట్స్ జనరేషన్ వ్యాగన్ ఆర్ ను సుజుకి తమ మాతృ దేశం జపాన్‌లో విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది బెస్ట్ కారుగా ఎంచుకుంటున్న వ్యాగన్ ఆర్ రూపురేఖలన్నింటిని పూర్తిగా మార్చేసింది. దీని గురించి పూర్తి వివరాలు...

To Follow DriveSpark On Facebook, Click The Like Button
ఎక్ట్సీరియర్

ఎక్ట్సీరియర్

సుజుకి ఈ వ్యాగన్ ఆర్ కు ఎప్పటిలాగే టాల్ బాయ్ బాడీని అందించింది. ఫ్రంట్ డిజైన్‌లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ముందు వైపు ఉన్న హెడ్ ల్యాంప్ మరియు ఫాగ్ ల్యాంప్స్ ఒకదాని క్రింద ఒకటి ఉన్నాయి. అయితే వాటిని వేరు చేస్తూ మధ్యలో బ్లాక్ స్టిప్ ఒకటి అందించారు.

సుజుకి నెక్ట్స్ జనరేషన్ వ్యాగన్ ఆర్

రెండు భాగాల్లో ఉన్న ఫ్రంట్ గ్రిల్ నలుపు రంగులో ఉన్న నిలువు పట్టీలను కలిగి ఉన్నాయి. ప్రక్క వైపు డిజైన్ ను కొనసాగిస్తూ ముందు వైపు బంపర్ రూపొందించడాన్ని స్పష్టంగా గుర్తించవచ్చు.

సుజుకి నెక్ట్స్ జనరేషన్ వ్యాగన్ ఆర్

న్యూ జనరేషన్ వ్యాగన్ ఆర్ రియర్ డిజైన్ విషయానికి వస్తే, దాదాపు ప్లేన్‌గా తీర్చిదిద్దారు. అయితే టెయిల్ లైట్లను అందివ్వడంలో మార్పులు చేశారు. చతుర్బుజాకారంలో ఉన్న టెయిల్ లైట్లను బంపర్ మీద అందివ్వడం జరిగింది.

ఇంటీరియర్

ఇంటీరియర్

సుజుకి ఇంటీరియర్‌లో కూడా మార్పులు చేసింది. అయితే ఇంటీరియర్ పరంగా అత్యుత్తమ స్టోరేజ్ ప్రదేశాన్ని అందించే విషయంలో వ్యాగన్ ఆర్ బాగా సుపరిచితం. సరికొత్త డ్యాష్ బోర్డ్ ఇందులో అందివ్వడం జరిగింది. మధ్యలోకి చేర్చబడిన ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు దాని క్రింది ఇగ్నిస్ లో ఉన్నటువంటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

సుజుకి నెక్ట్స్ జనరేషన్ వ్యాగన్ ఆర్

గతంలో ప్లోర్ మీద అందించే గేర్ రాడ్‌ను ఇప్పుడు డ్యాష్ బోర్డులో నిర్మించారు. డ్రైవర్ మరియు కో డ్రైవర్ ఎ/సి ని సులభంగా నియంత్రించేందుకు ఏ/సి విభాగం, సరికొత్త బ్లాక్ మరియు బీజి రంగుల్లో ఉన్న అప్‌హోల్‌స్ట్రే కలదు.

ఇంజన్ వివరాలు

ఇంజన్ వివరాలు

సుజుకి జపాన్ మార్కెట్ కోసం అభివృద్ది చేసిన ఇందులో మధ్య స్థాయి మరియు పూర్తి స్థాయి హైబ్రిడ్ పరిజ్ఞానాన్ని అందించింది. అయితే ఈ వేరియంట్లు ఇండియాకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

సుజుకి నెక్ట్స్ జనరేషన్ వ్యాగన్ ఆర్

అయితే దేశీయ విపణిలోకి విడుదలయ్యే వేరియంట్లో 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ వచ్చే అవకాశం ఉంది.

సుజుకి నెక్ట్స్ జనరేషన్ వ్యాగన్ ఆర్

ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్లో ఎంట్రీ లెవల్ హైబ్రిడ్ కార్లు లేవు, ఒక వేళ విడుదలయితే వాటికి పోటీగా ఈ వ్యాగన్ ఆర్ హైబ్రిడ్ ను పరిచయం చేసే ఛాన్స్ ఉంది.

సుజుకి నెక్ట్స్ జనరేషన్ వ్యాగన్ ఆర్

తరువాత తరం వ్యాగన్ ఆర్ తో పాటు స్టింగ్‌రే మరియు సింపుల్ వ్యాగన్ ఆర్ (ప్రస్తుతం అందుబాటులో ఉన్న)ను కూడా విడుదల చేసింది. ధరను దృష్టిలో ఉంచుకుని కొన్ని అప్‌గ్రేడ్స్ కు గురైన ఈ వేరియంట్లను చౌక కార్లకు డిమాండ్ ఉన్న మార్కెట్లలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

సుజుకి నెక్ట్స్ జనరేషన్ వ్యాగన్ ఆర్

ఇండియన్ మార్కెట్లోకి ఈ సరికొత్త వ్యాగన్ ఆర్ 2018 నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో అత్యాధునిక ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు కెమెరా, సెన్సార్ల ద్వారా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ వంటివి రానున్నాయి.

సుజుకి నెక్ట్స్ జనరేషన్ వ్యాగన్ ఆర్

మారుతి సుజుకి నుండి హ్యాచ్‌బ్యాక్ కారును కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారా...? మారుతి సరికొత్త 2017 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ విడుదల చేయడానికి సన్నద్దం అవుతోంది. వీటికి చెందిన ఎక్స్‌క్లూజివ్ ఫోటోలు క్రింది గ్యాలరీలో.....

 

English summary
Next-Generation WagonR Revealed
Story first published: Saturday, February 4, 2017, 11:41 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark