ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌ను తైవాన్‌లో ఎస్ఎక్స్4 పేరుతో విడుదల చేసిన సుజుకి

జపాన్ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ సుజుకి ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్న ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని తైవాన్ మార్కెట్లోకి విడుదల చేసింది.

By Anil

జపాన్ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ సుజుకి ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్న ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని తైవాన్ మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఇక్కడ గమ్మత్తయిన విషయం ఏమిటంటే, ఒకప్పుడు ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఎస్ఎక్స్4 సెడాన్‌ పేరుతో ఎస్-క్రాస్ ను తైవాన్‌లో విడుదల చేసింది.

మారుతి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

ఎస్ఎక్స్4(ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్) ఎస్‌యూవీ ఫ్రంట్ డిజైన్‌లో వాటర్‌ఫాల్ ఫ్రంట్ గ్రిల్, రీ డిజైన్ చేయబడిన హెడ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు మరియు నూతన డిజైన్‌లో ఫ్రంట్ బంపర్ ఉన్నాయి. బానెట్ మీద క్రాసోవర్ ఎస్‌యూవీ ఫీల్ కలిగించేలా రెండు పొడవాటి క్యారెక్టర్ లైన్స్ ఉన్నాయి.

Recommended Video

2017 Mercedes New GLA Launch In Telugu - DriveSpark తెలుగు
మారుతి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

తైవాన్‌లో విడుదలైన ఎస్ఎక్స్4 ఎస్‌యూవీలో 1.4-లీటర్ సామర్థ్యం గల బూస్టర్ జెట్ టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ అనుసంధానం గల ఇది గరిష్టంగా 138బిహెచ్‌పి పవర్ మరియు 219ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మారుతి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

2017 ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ తైవాన్ విపణిలో కేవలం జిఎల్ఎక్స్ వేరియంట్లో మాత్రమే లభిస్తోంది. ఇందులో కీ లెస్ ఎంట్రీ, ఇంజన్ పుష్ స్టార్ట్ బటన్, క్రూయిజ్ కంట్రోల్ మరియు డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మారుతి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

భద్రత పరంగా 2017 ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌లో ఏడు ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌ను పలుమార్లు ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తోంది. ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి దేశీయ విపణిలోకి విడుదలయ్యే అవకాశం ఉంది.

మారుతి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సుజుకి ఇప్పటికే అంతర్జాతీయంగా ఉన్న ప్రధాన మార్కెట్లలోకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. దేశీయంగా విడుదలవడానికి సిద్దమవుతున్న ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇది పూర్తి స్థాయిలో విడుదలయితే, హ్యందాయ్ క్రెటా, రెనో డస్టర్, నిస్సాన్ టెర్రానో మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌ల నోరు మూయించడం గ్యారంటీ!

Most Read Articles

English summary
Read In Telugu: Suzuki Introduces India-Bound S-Cross Facelift In Taiwan
Story first published: Tuesday, July 25, 2017, 10:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X