జయేం నియో పేరుతో వస్తున్న టాటా నానో: సింగల్ ఛార్జింగ్‌తో 200కిమీలు ప్రయాణిస్తుంది

Written By:

భారత్‌లో అతి తక్కువ ధరతో లభించే నానో కారు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదలకు సిద్దం అవుతోంది. కానీ, నానో పేరుతో కాకుండా జయేం నియో పేరుతో ఎలక్ట్రిక్ వెర్షన్‌లో లాంచ్ చేయడానికి టాటా సిద్దమవుతోంది.

జయేం నియో పేరుతో వస్తున్న టాటా నానో కార్లు

టాటా మోటార్స్ వీటిని స్వయంగా నిర్మించకుండా ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ తయారీ సంస్థ కోయంబత్తూరు ఆధారిత జయేం ఆటోమోటివ్స్ భాగస్వామ్యంతో నానో ఎలక్ట్రిక్ కార్లను నిర్మించనుంది. టాటా తయారు చేసే బాడీ మరియు జయేం ఆటోమోటివ్స్ తయారు చేసే అంతర్గత వ్యవస్థ ఆధారంగా ఉత్పత్తి కానున్నాయి.

Recommended Video - Watch Now!
[Telugu] Bajaj Platina Comfortec Launched In India - DriveSpark
జయేం నియో పేరుతో వస్తున్న టాటా నానో కార్లు

టాటా మోటార్స్ మరియు జయేం ఆటోమోటివ్స్ ఉమ్మడి భాగస్వామ్యంలో తయారు కానున్న నానో ఎలక్ట్రిక్ కార్లు జయేం నియో పేరుతో నియో బ్రాండ్ క్రింద మార్కెట్లోకి రానున్నాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీగారు హైదరాబాదులో జయేం నియో కార్లను లాంచ్ చేయనున్నారు.

జయేం నియో పేరుతో వస్తున్న టాటా నానో కార్లు

టాటా జయేం నియో ఎలక్ట్రిక్ విషయానికి వస్తే, ఇందులో డిజైన్, డెవలప్‌మెంట్ మరియు ఎలక్ట్రానిక్ పవర్ ట్రైన్, బ్యాటరీ మరియు ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజం ఎలక్ట్రా ఇవి అందించిన ఎలక్ట్రానిక్ పవర్ ట్రైన్‌ డ్రైవ్‌ను జయేం ఆటోమేటివ్స్ ఇందులో అందిస్తోంది.

జయేం నియో పేరుతో వస్తున్న టాటా నానో కార్లు

జయేం నియోలో ఉన్న 48-వోల్ట్ ఎలక్ట్రిక్ సిస్టమ్ 23బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 623సీసీ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్‌కు సమానం.

జయేం నియో పేరుతో వస్తున్న టాటా నానో కార్లు

సాంకేతికంగా ఇందులో ఉన్న బ్యాటరీని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే, సింగల్ ఛార్జింగ్ మీద 200కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. నలుగు ప్రయాణికులు మరియు ఎయిర్ కండీషనింగ్ సిస్టమ్‌తో ప్రయాణిస్తే, దీని పరిధి 140కిలోమీటర్లకు పడిపోతుంది.

జయేం నియో పేరుతో వస్తున్న టాటా నానో కార్లు

అయితే, వీటిని వ్యక్తిగత అవసరాలకు కాకుండా కేవలం వాణిజ్యపరమైన అవసరాలకు మాత్రమే అందుబాటులోకి తీసుకురానుంది. అంతే కాకుండా, రూపం మొత్తం టాటా నానో కారునే పోలి ఉన్నప్పటికీ ఎక్కడా కూడా టాటా లోగో రావడం లేదు. నియో ఎలక్ట్రిక్ వెర్షన్ బ్రాండ్ పేరు క్రింద జయేం పేరుతో రానుంది.

జయేం నియో పేరుతో వస్తున్న టాటా నానో కార్లు

జయేం ఆటోమోటివ్స్ తొలి విడత క్రింద 400 నియో ఎలక్ట్రిక్ కార్లను ట్యాక్సీ దిగ్గజం ఓలా సంస్థకు క్యాబుల కోసం సరఫరా చేస్తోంది. వీటిని కేవలం ట్యాక్సీ అవసరాల కోసమే కాకుండా... ఎక్కువ పరిధితో శక్తివంతమైన ఎలక్ట్రిక్ వెర్షన్‌లో వ్యక్తిగత అవసరాల కోసం కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: Tata Electric Nano will be launched as the Jayem Neo
Story first published: Friday, November 24, 2017, 19:00 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark