ఆన్‌లైన్ మార్కెట్లోకి టాటా హెక్సా: పూర్తి వివరాలు

Written By:

భారతదేశపు దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి తమ నూతన ఎస్‌యూవీ హెక్సా‌ను విడుదల చేసింది. అత్యంత సరసమైన ధరతో అద్బుతమైన ఫీచర్లు మరియు శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్‌లతో పోటీదారులకు మతిపోగొడుతోంది. కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు హెక్సాకు సంభందించిన కార్యకలాపాలన్నింటిని ఇప్పుడు ఆన్‌లైన్ చేసింది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం రండి....

టాటా హెక్సా ఎస్‌యూవీ

ప్రముఖ ఇ-కామర్స్ వేదిక Tata CLiQ ద్వారా కస్టమర్లు హెక్సా ఎస్‌యూవీని ఆన్‌లైన్లో టెస్ట్ డ్రైవ్ కోసం బుక్ చేసుకోవచ్చు. టాటా మరియు క్లిక్ ద్వారా హెక్సా సేవలు కస్టమర్లకుమరింత చేరువకానున్నాయి.

టాటా హెక్సా ఎస్‌యూవీ

టాటాక్లిక్(Tata CLiQ) ముఖ్య కార్యనిర్వహణ అధికారి అసుతోష్ పాండే మాట్లాడుతూ, స్టైల్, ఫీచర్లు మరియు ఇంజన్ పనితీరు యొక్క కలయిక పరంగా టాటా హెక్సా కస్టమర్లను ఖచ్చితంగా మెప్పిస్తుందని చెప్పుకొచ్చాడు.

టాటా హెక్సా ఎస్‌యూవీ

టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల బిజినెస్ హెడ్ వివేక్ శ్రీవాస్త మాట్లాడుతూ, ప్రతి ప్రొడక్ట్ కూడా ఇప్పుడు డిజిటల్‌మయమైపోతోంది. ఇది ప్రత్యేకించి వాహన రంగం మీద ఎక్కువ ప్రభావం చూపుతోంది. కస్టమర్లు ప్రపంచం వ్యాప్తంగా ఎక్కడినుండైనా తమ ఉత్పత్తుల గురించి తెలుసుకుని, వాటిని చేరువయ్యేందుకు ఈ మార్గం మరింత ఉపయోగపడుతుందని తెలిపాడు. ఇందుకోసం తమ లైఫ్ స్టైల్ వెహికల్ హెక్సా కోసం టాటాక్లిక్.కామ్ తో చేతులు కలిపామని తెలిపాడు.

టాటా హెక్సా ఎస్‌యూవీ

టాటా మోటార్స్ తమ హెక్సా ఎస్‌యూవీలో 2.2-లీటర్ సామర్థ్యం ఉన్న వారికోర్ 400 డీజల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 153.6బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

టాటా హెక్సా ఎస్‌యూవీ

టాటా మోటార్స్ తమ నెక్ట్స్ జనరేషన్ వారికోర్ ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌లను అనుసంధానం చేసింది.

టాటా హెక్సా ఎస్‌యూవీ

కస్టమర్లు టాటా హెక్సా ఎస్‌యూవీని ఆరు విభిన్న వేరియంట్లలో ఎంచుకోవచ్చు. అవి, ఎక్స్ఇ, ఎక్స్ఎమ్, ఎక్స్‌టి, ఎక్స్ఎమ్ఎ, ఎక్స్‌టిఎ మరియు ఎక్స్‌టి 4X4.

టాటా హెక్సా ఎస్‌యూవీ

టాటా హెక్సా కు సంభందించి మరెక్కడా దొరకని ఫోటోలను డ్రైవ్‌స్పార్క్ మీ కోస క్రింది గ్యాలరీ ద్వారా అందిస్తోంది. వీక్షించడానికి గ్యాలరీ మీద క్లిక్ చేయండి. మీకు నచ్చిన ఫోటోలను డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు.

 
English summary
Tata Hexa Now Available Online — CLIQ For A Test-Drive
Story first published: Tuesday, February 28, 2017, 11:26 [IST]
Please Wait while comments are loading...

Latest Photos