మొదటి ప్రమాదానికి గురైన టాటా హెక్సా ఎమ్‌పీవీ...టేక్ కేర్..!!

Written By:

టాటా మోటార్స్ దేశవ్యాప్తంగా హెక్సా అందుబాటులోకి తెచ్చిన తరువాత మొట్టమొదతి ప్రమాదాన్ని నమోదు చేసుకుంది. అనుకోకుండా జరిగే మొదటి ప్రమాదం ద్వారానే ఆ ఉత్పత్తి ఎంత సురక్షితమైనదో తేల్చేయవచ్చు. ప్రమాద తీవ్రత ఆధారంగా వాహనానికి జరిగే నష్టాన్ని అంచనా వేయవచ్చు. హెక్సా కూడా పెద్ద ప్రమాదానికే గురైనప్పటికీ, ఊహించిన రీతిలో ఫలితాలను కనబరిచింది. కాబట్టి ఇది ఎంత వరకు సురక్షితమైనదో చూద్దాం రండి.

టాటా హెక్సా లైనప్‌లోని టాప్ ఎండ్ వేరియంట్ ఆటోమేటిక్ వేరియంట్ ప్రమాదానికి గురైంది. దీని తాలూకు ఫోటోలు ఇప్పుడు ఫేస్‌బుక్ వేదికగా ఇంటర్నెట్లో వ్యాప్తి చెందుతున్నాయి. ఈ ప్రమాదం తమిళనాడులో కోయంబత్తూరులో చోటు చేసుకుంది.

టాఫే విక్రయ కేంద్రానికి చెందిన ఈ హెక్సా ఆటోమేటిక్ వాహనాన్ని గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగం వద్ద ఉన్నపుడు ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బ్యాగులు విచ్చుకున్నాయి. తద్వారా ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. హెక్సా వెహికల్ కూడా పాక్షిక ప్రమాదాలతో తప్పించుకుంది. టాటా మోటార్స్ యొక్క అద్బుతమైన పనితీరు ఇందులో ప్రతిబింబించింది.

ప్రమాదానికి గురైన వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే, ముందు వైపు ఫిట్టింగ్స్ నుండి బయటకు చొచ్చుకొచ్చిన చక్రాన్ని గమనించవచ్చు. మరియు కుడి భాగం చివరిలో బాడీ పాక్షికంగా రాపిడికి గురైంది. ఇంతటి వేగం వద్ద కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రయాణికులతో ప్రాణాలతో బయటపడ్డారు.

గంటకు 100 కిలోమీటర్ల వేగం వద్ద వాహనాలు ప్రమాదానికి గురైతే, చాలా వరకు నుజ్జునుజ్జయిపోతాయి. అయితే టాటా హెక్సా ధృడమైన బాడీ ప్రమాద తీవ్రతను ఎదుర్కోవడాన్ని ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు.

టాటా మోటార్స్ 2017 జనవరిలో తమ హెక్సా ఎమ్‌పీవీ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 11.99 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉంది.

అద్బుతమైన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ టియాగో విడుదల అనంతరం హెక్సా ఎమ్‌పీవీని విపణిలోకి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం డిజైన్, ఫీచర్లు, ధర మరియు భద్రత పరంగా విభిన్నమైన హెక్సా ఎమ్‌పీవీ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోనుంది.

కేవలం రెండు చక్రాల మీదే నడిచిన టాటా హెక్సా ఎమ్‌పీవీ: వీడియో ను వీక్షించండి....

ధృడమైన బాడీని కలిగి ఉన్న శక్తివంతమైన టాటా హెక్సా ఎమ్‌పీవీని వివిధ యాంగిల్స్‌లో చూపించే ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి.....

 

English summary
Tata Hexa First Crash Coimbatore
Story first published: Monday, February 13, 2017, 16:31 [IST]
Please Wait while comments are loading...

Latest Photos