విమానాన్ని లాగిన టాటా హెక్సా: నమ్మశక్యంగా లేదా అయితే ఈ వీడియో చూడండి

Written By:

దేశీయంగా టటా మోటార్స్ పరిచయం చేసిన హెక్సా వాహనం రోజురోజుకీ మరింత ప్రత్యేకతను సంతరించుకుంటోంది. శక్తివంతమైన హెక్సా వాహనం బలపరీక్షకు సిద్దమై ఏకంగా 66 టన్నుల బరువున్న విమానాన్ని లాగింది. పూర్తి వివరాలను ఇవాళ్టి కథనంలో తెలుసుకుందా రండి.

టాటా మోటార్స్ యొక్క భాగస్వామ్యపు సంస్థ ల్యాండ్ రోవర్ ఇలాంటి ప్రయోగాలకు వేదిక. ఒకప్పుడు ల్యాండ్ రోవర్ కు చెందిన ఓ ఎస్‌యూవీ రైలును లాగి తన బలాన్ని నిరూపించుకుంటే ఇప్పుడు దేశీయ ఎస్‌యూవీ విమాన్ని లాగి తన శక్తిని నిరూపించుకుంది.

గుర్తించబడని ఓ విమానాశ్రయంలో బోయిగ్‌కు చెందిన 737 విమాన్ని కొద్ది దూరం మేర లాగి హెక్సా యొక్క అద్బుతమైన పనితీరును ప్రదర్శించింది. ఈ విమానం బరువు ఏకంగా 66 టన్నులు ఉంది.

విమానాన్ని లాగిన హెక్సా లోని ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 2.2-లీటర్ సామర్థ్యం గల వారికోర్ డీజల్ ఇంజన్ కలదు. ఇది 1,700ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద గరిష్టంగా 400ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

హెక్సా ఎస్‌యూవీ విమానాన్ని లాగుతున్న సన్నివేశాన్ని చూడాలంటే క్రింది వీడియోని తప్పకుండా వీక్షించాల్సిందే.

ధరకు తగ్గ విలువలతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎస్‌యూవీ మరియు ఎమ్‌పీలకు ముచ్చెమటలు పట్టిస్తున్న టాటా హెక్సా వాహనాన్ని అన్ని కోణాల్లో వివరంగా చూపించే ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి ...

  

English summary
Tata Hexa Pulls A Boeing 737 Airplane — The Ultimate Torque Test?
Please Wait while comments are loading...

Latest Photos