టాటా నానో విషయంలో గుడ్ న్యూస్

టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ నానో కారును రహస్యంగా ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తోంది

By Anil

ప్రపంచపు అత్యంత సరసమైన కారు అనే కాన్సెప్టుతో టాటా మోటార్స్ పరిచయం చేసిన నానో కారుకు ఆశించిన ఆదరణ లభించలేదు. తొలినాళ్లలో ఓ మోస్తారు విక్రయాలు జరిపినప్పటికీ, ఇప్పుటి ఫలితాలు తీవ్ర నిరాశను మిగుల్చుతున్నాయి. నానో కారును సక్సెస్‌ఫుల్ మోడల్‌గా నిలిపేందుకు ఎలక్ట్రిక్ వెర్షన్‌లో నానోను విడుదల చేయడానికి టాటా సన్నద్దమవుతోంది.

నానో ఎలక్ట్రిక్ కారు

టాటా సంస్థను అత్యున్నత స్థానంలో నిలిపిన రతన్ టాటా గారి డ్రీమ్ ప్రాజెక్ట్ నానో. నిజమే, ప్రతి భారతీయుడి సొంత కారు కలను నిజం చేసేందుకు భారతదేశపు కాదు కాదు ప్రపంచపు చవకబారు కారుగా నానో కారును ఆవిష్కరించాడు.

Recommended Video

Tata Nexon Review: Specs
నానో ఎలక్ట్రిక్ కారు

టాటా నానో ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుండి టాటా మోటార్స్ ఎన్నో ఒడిదుడుకులతో పాటు తీవ్ర సవాళ్లను ఎదుర్కుంది. ఈ ప్రాజెక్టు కారణంగా టాటా మోటార్స్ కంపెనీలోని అత్యున్నత స్థానంలో ఉన్న ఉద్యోగుల కుసాలు కూడా కదిలాయి.

నానో ఎలక్ట్రిక్ కారు

ఏదేమైనా కూడా టాటా మోటార్స్ నానో విషయంలో పట్టు వదలకుండా, విశ్వాసం సడలకుండా మరిన్ని ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. అందులో ఒకటి టాటా నానో ఎలక్ట్రిక్. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ నానో కారును రహస్యంగా ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తోంది.

నానో ఎలక్ట్రిక్ కారు

టాటా డెవలప్‌మెంట్ బృందం నుండి అందిన సమాచారం మేరకు, టాటా తమ ఎలక్ట్రిక్ నానో కారుకు తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో రహస్యంగా రహదారి పరీక్షలు నిర్వహించినట్లు తెలిసింది. అయితే దీనికి సంభందించిన సాంకేతిక వివరాలు వెల్లడికాలేదు.

నానో ఎలక్ట్రిక్ కారు

రహస్యంగా జరిపిన పరీక్షల్లో టాటా నానో ఎలక్ట్రిక్ విజయం సాధించినట్లు తెలిసింది. ఇదే సమయంలో రతన్ టాటా గారు కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం. పథకం ప్రకారం ముందుకెళితే టాటా అతి త్వరలో నానో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని అతి త్వరలోనే ప్రారంభించనుంది.

నానో ఎలక్ట్రిక్ కారు

టాటా నానో ఎలక్ట్రిక్ కారులో ఎలక్ట్రిక్ మోటార్లకు పవర్ కోసం లిథియం-అయాన్ బ్యాటరీలను వినియోగించనుంది. ప్రస్తుతం విపణిలో ఉన్న మహీంద్రా ఇ2ఒ ప్లస్ ఎలక్ట్రిక్ కారుకు నానో ఎలక్ట్రిక్ గట్టి పోటీనివ్వనుంది.

నానో ఎలక్ట్రిక్ కారు

టాటా మోటార్స్ తమ చీపెస్ట్ స్మాల్ కారును విపణి నుండి శాస్వతంగా తొలగించనుందనే ఆధారం లేని వార్తలు వచ్చిన నేపథ్యంలోనే టాటా తమ నానో ఎలక్ట్రిక్ కారును పరీక్షించింది. రతన్ టాటా డ్రీమ్ ప్రాజెక్ట్ నానో ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదలైతే భారత వాహన పరిశ్రమలో ఇదొక పెద్ద సంచలనంగా మారనుంది.

నానో ఎలక్ట్రిక్ కారు

పట్టణ వాతావరణ పరిరక్షణలో ఎలక్ట్రిక్ కార్లు కీలకం. కాబట్టి భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ అధికం కానుంది. అత్యంత సరసమైన ధరతో నానో ఎలక్ట్రిక్ కారును విడుదల చేసే ఆలోచనలో టాటా ఉంది. బాడీ మొత్తాన్ని అతి తక్కువ ధరతో నిర్మించడంతో పాటు నానో ప్రాజెక్ట్ చవకైనది కావడంతో నానో ఎలక్ట్రిక్ తక్కువ ధరకే లభించనుంది.

నానో ఎలక్ట్రిక్ కారు

ఇండియన్ చిన్న కార్ల మార్కెట్లో నానో ఎలక్ట్రిక్ వెర్షన్ విప్లవాత్మక మార్పులు తెచ్చిపెట్టనుంది. అయితే, టాటా మోటార్స్ నానో ఎలక్ట్రిక్ ధరను నిర్ణయించే విధానాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ నానో విడుదల వివరాలను టాటా వెల్లడించలేదు.

నానో ఎలక్ట్రిక్ కారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రపంచ వ్యాప్తంగా పలు దిగ్గజ కార్ల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ కార్లను అభివృద్ది చేసుకుంటున్నాయి. ఇప్పుడు, టాటా మోటార్స్ కూడా ఈ రేసులోకి దిగింది. భారత ప్రభుత్వం కూడా 2030 నాటికి ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయాలకు అనుమతించే లక్ష్యంతో ఉంది. అయితే ఎలక్ట్రిక్ అవతారంలో వస్తున్న నానో సక్సెస్ అవుతుందా అంటే... దీని బాడీ నిజానికి ఎలక్ట్రిక్ వెర్షన్ కోసం రూపొందించినట్లు ఉంటుంది కాబట్టి ఎలక్ట్రిక్ నానో హిట్ ఖాయం!

మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాలు...

Most Read Articles

English summary
Read In Telugu: Tata Motors Tests Electric Nano In Coimbatore
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X