ఫస్ట్ బ్యాచ్ టిగోర్ ఎలక్ట్రిక్ కార్లను EESL కు డెలివరీ ఇచ్చిన టాటా మోటార్స్

ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ది మరియు తయరీ పరంగా ఎంతో ఆసక్తికనబరిచిన టాటా మోటార్స్ ప్రభుత్వం రంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్(EESL) కు ఎలక్ట్రిక్ కార్లను అందించే ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

By Anil

ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ది మరియు తయరీ పరంగా ఎంతో ఆసక్తికనబరిచిన టాటా మోటార్స్ ప్రభుత్వం రంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్(EESL) కు ఎలక్ట్రిక్ కార్లను అందించే ఒప్పందాన్ని గతంలో కుదుర్చుకుంది. ఇచ్చిన మాట ప్రకారం, టాటా మోటార్స్ తొలి బ్యాచ్ టిగోర్ ఎలక్ట్రిక్ కార్లను EESL కు డెలివరీ ఇచ్చింది.

టిగోర్ ఎలక్ట్రిక్ కార్లు

10,000 ఎలక్ట్రిక్ కార్ల ప్రభుత్వం ప్రకటనకు అనుగుణంగా EESL టెండర్‌కు పిలిచింది. ఈ టెండర్‌లో మహీంద్రాను వెనక్కి టాటా మోటార్స్ ఈ డీల్‌ను సొంతం చేసుకుంది.

టిగోర్ ఎలక్ట్రిక్ కార్లు

EESL నిర్వహించిన టెండర్‌లో టాటా మోటార్స్ ఎల్1 బిడ్డర్‌గా అర్హత సాధించింది. ఈ టెండర్ ప్రకారం, తొలి విడత క్రింద 250 టిగోర్ ఎలక్ట్రిక్ కార్లను EESLకు సరఫరా చేయాల్సి ఉంది.

టిగోర్ ఎలక్ట్రిక్ కార్లు

టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ముఖ్య కార్యనిర్వహణ అధికారి గుంటర్ బట్స్‌చెక్ గారు EESL మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ కుమారుకు మొదటి కారు తాళాలను అందజేసి డెలివరీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమలో ఇరు కంపెనీల ప్రధాన అధికారులు పాల్గొన్నారు.

టిగోర్ ఎలక్ట్రిక్ కార్లు

టాటా టిగోర్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్యూర్ ఎలక్ట్రిక్ కారు. ఉద్గార రహిత స్టైల్ బ్యాక్ సెడాన్‌ ఇది వరకే ఉన్న పెట్రోల్/డీజల్ ఇంజన్‌తో లభించే టిగోర్ ద్వారానే పరిచయమయ్యింది. EESL సంస్థకు టిగోర్ ఎలక్ట్రిక్ సెడాన్ కారును పర్ల్‌సెంట్ వైట్ కలర్ అండ్ బ్లూ డీకాల్స్‌తో బేస్, ప్రీమియమ్ మరియు హై అనే మూడు విభిన్న వేరియంట్లలో సరఫరా చేస్తోంది.

టిగోర్ ఎలక్ట్రిక్ కార్లు

టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారులో సింగల్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కలదు. డ్రైవ్‌ సిస్టమ్ కోసం ఎలక్ట్రా ఇవి సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్ డ్రైవ్‌సిస్టమ్‌ను టిగోర్ ఎలక్ట్రిక్ కారులో అందివ్వడం జరిగింది. ఆటోమోటివ్ సెక్టారులో ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం అవసరమయ్యే డ్రైవ్‌ సిస్టమ్‌లను సరఫరా చేసే విధంగా ఎలక్ట్రా ఇవి కంపెనీ ఏర్పాటు చేయబడింది.

టిగోర్ ఎలక్ట్రిక్ కార్లు

ఈ సందజర్బంగా బట్స్‌చెక్ మాట్లాడుతూ, "టాటా టిగోర్ ఎలక్ట్రిక్ వెహికల్ పరిచయంతో దేశీయ ఇ-వెహికల్ ప్రయాణంలో టాటా కూడా చేరిందని తెలిపాడు. భవిష్యత్తులో ఇండియన్ కస్టమర్ల కోసం ఫుల్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పుకొచ్చాడు."

టిగోర్ ఎలక్ట్రిక్ కార్లు

ప్రజలు పెట్రోల్ మరియు డీజల్ కార్ల వినియోగాన్ని వదిలి ఎలక్ట్రిక్ కార్లను ఎంచుకునేలా చైతన్యం తీసుకురావడంలో ప్రభుత్వం రంగ సంస్థ ఏకంగా 10,000 ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసే అంశం సానుకూల ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు.

టిగోర్ ఎలక్ట్రిక్ కార్లు

2030 కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే అందుబాటులో ఉంచేలా తీసుకున్న ప్రభుత్వ కళను సాకారం చేయడానికి కృషి చేస్తున్నట్లు టాటా పేర్కొంది. ఇందుకోసం దేశీయంగా ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వాహనాల అభివృద్ది వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్న ఫేమ్(FAME) ఇండియాతో కలిసి పనిచేయనుంది.

టిగోర్ ఎలక్ట్రిక్ కార్లు

డ్రైవ్‍‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రపంచ భవిష్యత్తు రవాణా మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలే అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడంలో ఇండియన్స్ ఆలస్యంగా ఉన్నప్పటికీ ఏదో ఒక రోజు పెట్రోల్ మరియు డీజల్ వాహనాల స్థానాన్ని ఎలక్ట్రిక్ కార్లు పూర్తిగా భర్తీ చేయనున్నాయి.

ఇందులో భాగమయ్యేందుకు ఎన్నో వాహన తయారీ దిగ్గజాలు తమ వంతుగా ఎలక్ట్రిక్ వాహన పరిజ్ఞానాన్ని అభివృద్ది చేసుకుంటున్నాయి. వాటిలో మహీంద్రా అండ్ మహీంద్రా ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్ల విపణిలో ప్రవేశించగా, తాజాగా టాటా మోటార్స్ తమ కార్యకలాపాలను ప్రారంభించింది.

Most Read Articles

English summary
Read In Telugu: Tata Motors Delivers First Batch Of Tigor EV To EESL
Story first published: Saturday, December 16, 2017, 12:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X