నెక్సాన్ ఇంటీరియర్ ఫీచర్లను రివీల్ చేసిన టాటా: బ్రిజా, ఎకోస్పోర్ట్ పతనం ఖాయం!

Written By:

ప్యాసింజర్ కార్ల విపణిలో ఆశించిన మేర ఫలితాలు సాధించలేక పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతున్న తరుణంలో టాటా మోటార్స్ టియాగో హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. అప్పటి వరకు టాటా లైనప్‌లో పెద్దగా చెప్పుకోదగ్గ మోడళ్లేవీ ఉండేవి కావు.

టియాగో విజయంతో కోలుకున్న టాటా వెనువెంటనే హెక్సా ఎమ్‌పివి మరియు టిగోర్ కాంపాక్ట్ సెడాన్‌లను విడుదల చేసి మూడు విజయవంతమైన మోడళ్లను తమ లైనప్‌లో నిలుకుంది. దీనంతటికి ప్రధాన కారణం టాటా సరికొత్త ఇంపాక్ట్ (IMPACT) డిజైన్ ఫిలాఫీ.

నెక్సాన్ ఇంటీరియర్ ఫీచర్లు

ఎస్‌యూవీ మార్కెట్లో హాటుకేకుల్లా అమ్ముడుపోతున్న మారుతి సుజుకి వితారా బ్రిజాకు గట్టిపోటీగా ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా నెక్సాన్ ఎస్‌యూవీని టాటా మోటార్స్ సిద్దం చేస్తోంది. ఇప్పటికే నెక్సాన్ ఇంజన్ వివరాలు వెల్లడించి పోటీగా ఉన్న ఎస్‌యూవీల గుండెల్లో గుబులు పుట్టించిన టాటా ఇప్పుడు ఇంటీరియర్ ఫీచర్లను రివీల్ చేసింది.

Recommended Video - Watch Now!
Volkswagen Tiguan Review In Telugu - DriveSpark తెలుగు
నెక్సాన్ ఇంటీరియర్ ఫీచర్లు

ఇలాంటి ఇంటీరియర్‌ను సాధారంగా అత్యంత ఖరీదైన మరియు హై ఎండ్ కార్లలో మాత్రమే గుర్తించగలం. టాటా కార్లలో ఈ తరహా ఇంటీరియర్, ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్, సెంటర్ కన్సోల్, డ్యాష్ బోర్డ్ డిజైన్ గమనిస్తే ఇవన్నీ నిజంగానే నెక్సాన్‌లో ఉన్నాయా అనే అనుమానం కలగకమానదు. అయితే టాటా మోటార్స్ స్వయంగా నెక్సాన్ ఇంటీరియర్ ఫోటోలను రివీల్ చేసింది కాబట్టి నమ్మితీరాల్సిందే.

నెక్సాన్ ఇంటీరియర్ ఫీచర్లు

మల్డీ డ్రైవ్ మోడ్స్...

వివిధ రహదారి పరిస్థితులకు అనుగుణంగా డ్రైవింగ్ మోడ్స్‌ ఎంచుకునే వాహనాన్ని డ్రైవ్ చేసే అవకాశం ఈ సెగ్మెంట్లో రావడంతో ఇదే ప్రథమం. సెంటర్ కన్సోల్ మీద గేర్‌నాబ్ ప్రక్కన గల రోటరీ డయల్ ఆధారంగా ఎకో, సిటి మరియు స్పోర్ట్ వంటి మోడ్స్‌ను ముందుగానే సెట్ చేసుకుని డ్రైవ్ చేయవచ్చు.

నెక్సాన్ ఇంటీరియర్ ఫీచర్లు

నెక్సాన్‌లో అందించిన ఎకో మరియు సిటి మోడ్‌లో డ్రైవ్ చేయడం ద్వారా ఉత్తమ మైలేజ్ పొందవచ్చు. స్పోర్ట్ మోడ్‌లో డ్రైవింగ్ చేసినట్లయితే గరిష్ట పవర్ మరియు టార్క్ పొందుతాము. 1.5-లీటర్ డీజల్ ఇంజన్ స్పోర్ట్ మోడ్‌లో గరిష్టంగా 260ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

నెక్సాన్ ఇంటీరియర్ ఫీచర్లు

ఫ్లోటింగ్ డ్యాష్ టాప్ హెచ్‌డి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ల్పే....

ఇతర టాటా మోడళ్ల ఇంటీరియర్‌తో పోల్చుకుంటే నెక్సాన్ ఇంటీరియర్‌లో సరికొత్త ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. డ్యాష్ బోర్డులోకి జొప్పించినట్లు కాకుండా స్టాండింగ్ పొజిషన్‌లో ఉండే డిస్ల్పే అందించింది(టాటా దీనిని ఫ్లోటింగ్ డ్యాష్ టాప్ హెచ్‌డి టచ్‌స్క్రీన్ అని పిలుస్తోంది).

నెక్సాన్ ఇంటీరియర్ ఫీచర్లు

అచ్చం లగ్జరీ కార్లలో ఉండే విధంగా యుఎస్‌బి, బ్లూటూత్ కనెక్టివిటి సపోర్ట్ మరియు న్యావిగేషన్ గల 6.5-అంగుళాల పరిమాణం ఉన్న ఫ్లోటింగ్ డిస్ల్పే ఇందులో కలదు. ఈ ఫీచర్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో తొలిసారి వచ్చింది.

నెక్సాన్ ఇంటీరియర్ ఫీచర్లు

ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే లను సపోర్ట్ చేయగల హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

టాటా నెక్సాన్ ఇంటీరియర్‌లో డ్రైవ్ మోడ్ ఆధారిత మరియు 8-స్పీకర్ల మ్యూజిక్ సిస్టమ్ అనుసంధానిత అడ్వాన్స్‌డ్ హార్మన్ ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేయగలదు(టాప్ ఎండ్ వేరియంట్లో స్టాండర్డ్‌గా లభిస్తోంది). టాటా కార్లలో ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటి పొందిన తొలి మోడల్ నెక్సాన్ ఎస్‌యూవీ.

నెక్సాన్ ఇంటీరియర్ ఫీచర్లు

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు యుఎస్‌బి కనెక్టివిటి ద్వారా కాలింగ్, మెసేజింగ్, న్యావిగేషన్ మరియు వాయిస్ అసిస్టెన్స్ వంటి ఫీచర్లను ఇన్ఫోటైన్‌మెంట్ సస్టమ్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. అదనంగా ఇందులో, టెక్ట్స్ మెసేజ్ మరియు వాట్సాప్ మేసేజ్‌లను చదివి వినిపించే మరియు వాయిస్ ఆధారంగా మన మెసేజ్‌ను టైప్ చేసి రిప్లే ఇచ్చే ఫీచర్ కలదు.

నెక్సాన్ ఇంటీరియర్ ఫీచర్లు

లగ్జరీ సెంటర్ కన్సోల్ మరియు స్లైడింగ్ మెకానిజమ్ గల డోర్

విలాసవంతమైన మరియు ఖరీదైన కార్లలో వచ్చే సెంటర్ కన్సోల్ ప్రేరణతో టాటా తమ నెక్సాన్ ఇంటీరియర్‌‌లో ప్రీమియమ్ మరియు స్పోర్టిల్ ఫీల్ కలిగించే ఆకర్షణీయమైన సెంటర్ కన్సోల్ అందించింది. మరియు సెంటర్ కన్సోల్ మీద స్వల్ప స్టోరేజ్ స్పేస్ కల్పించేందుకు స్లైడింగ్ మెకానిజమ్ గల డోర్ కలదు.

నెక్సాన్ ఇంటీరియర్ ఫీచర్లు

టాటా మోటార్స్‌ తమ రంజన్‌గావ్ ప్రొడక్షన్ ప్లాంటు నుండి నెక్సాన్ ఎస్‌యూవీల ఉత్పత్తిని ఇది వరకే ప్రారంభించింది. సాంకేతికంగా నెక్సాన్‌లోని 1.2-సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల రివట్రాన్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 108.5బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

నెక్సాన్ ఇంటీరియర్ ఫీచర్లు

టాటా నెక్సాన్‌లోని 1.5-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల రివోటార్క్ డీజల్ ఇంజన్ 108.5బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. పెట్రోల్ మరియు డీజల్ వెర్షన్ నెక్సాన్ ఎస్‌యూవీ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభ్యం కానుంది.

నెక్సాన్ ఇంటీరియర్ ఫీచర్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఈ ఎస్‌యూవీ సెగ్మెంట్లో 260ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే మోడల్ నెక్సాన్ కావడం ఇక్కడ మరో సెగ్మెంట్ ఫస్ట్ విశేషంగా చెప్పుకోవచ్చు. భారీ విక్రయాలు సాధిస్తున్న వితారా బ్రిజాలోని డీజల్ ఇంజన్ కన్నా నెక్సాన్‌లోని డీజల్ ఇంజన్ అత్యంత శక్తివంతమైనది, మరియు అధిక పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేస్తుంది. నెక్సాన్ విపణిలోకి విడుదలైతే వితారా బ్రిజా గట్టిపోటీని ఎదుర్కోవడం ఖాయం!

English summary
Read In Telugu: Tata Nexon Class-Leading Features Revealed Ahead Of Launch In India

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark