నెక్సాన్ విడుదల మరియు సాంకేతిక వివరాలను అధికారికంగా వెల్లడించిన టాటా మోటార్స్

Written By:

దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ సంచలనాత్మక మోడల్‌ను విడుదలకు సిద్దం చేసింది. ఈ నేపథ్యంలో టాటా అధికారికంగా నెక్సాన్‌లోని ఇంజన్ వివరాలను వెల్లడించింది. అంతే కాకుండా కూపే తరహా డిజైన్‌ను పోలి ఉండేలా నెక్సాన్ టీజర్ ఫోటోను విడుదల చేసింది.

టాటా నెక్సాన్ విడుదల మరియు ఇంజన్ వివరాలు

ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీతో రూపొందించిన నెక్సాన్ ఎస్‌యూవీ కూపే డిజైన్ స్టైల్లో ఉంది. డ్యూయల్ టోన్ ఎక్ట్సీరియర్ కలర్ ఆప్షన్‌లో రానున్న నెక్సాన్ మారుతి సుజుకి వితారా బ్రిజా మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌లకు గండంగా మారనుంది. నెక్సాన్ లోని ఇంజన్‌లను పరిశీలిస్తే, ఈ రెండు ఎస్‌యూవీలకు సరాసరి పోటీనివ్వనుంది.

టాటా నెక్సాన్ విడుదల మరియు ఇంజన్ వివరాలు

అప్ కమింగ్ నెక్సాన్ ఎస్‌యూవీలో 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల రివోట్రాన్ టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌ను అందివ్వనున్నట్లు టాటా ఆఫీషియల్‌గా ప్రకటించింది. ఇది 5,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 108.5బిహెచ్‌పి పవర్ మరియు 2,000-4,000ఆర్‌పిఎమ్ మధ్య 170ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

టాటా నెక్సాన్ విడుదల మరియు ఇంజన్ వివరాలు

నెక్సాన్ డీజల్ వేరియంట్లో 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల రివోటార్క్ డీజల్ ఇంజన్ అందిస్తోంది. ఇది 3,750ఆర్‌పిఎమ్ వద్ద 108.5బిహెచ్‌పి పవర్ మరియు 1,500 నుండి 2,750ఆర్‌పిఎమ్ మధ్య 260ఎమ్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టాటా నెక్సాన్ విడుదల మరియు ఇంజన్ వివరాలు

నెక్సాన్ లోని పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో మూడు విభిన్నమైన డ్రైవింగ్ మోడ్స్ అందిస్తోంది. అవి, ఎకో, సిటి మరియు స్పోర్ట్. టాటా మోటార్స్ ప్రకారం టిఎ6300 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌లో మాత్రమే లభించనుంది.

టాటా నెక్సాన్ విడుదల మరియు ఇంజన్ వివరాలు

ఏవిఎల్, బాష్, మహాలే మరియు హానీవెల్ సప్లయర్స్ నుండి సేకరించిన విడి భాగాలతో టాటా పూనే ప్లాంటులోనే రెండు ఇంజన్‌లను పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతనే అభివృద్ది చేసినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. పెట్రోల్ రివోట్రాన్ మోడల్‌ను సనంద్ ప్లాంటులో మరియు డీజల్ రివోటార్క్ మోడళ్లను రంజన్‌గావ్ ప్లాంటులో ఉత్పత్తి చేయనుంది.

టాటా నెక్సాన్ విడుదల మరియు ఇంజన్ వివరాలు

టాటా మోటార్స్ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదల చేస్తే, మారుతి సుజుకి వితారా బ్రిజా మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ లకు తీవ్రపోటీనివ్వనుంది. అంతే కాకుండా మహీంద్రా టియువి300 మరియు రెనో డస్టర్ సేల్స్ మీద కూడా నెక్సాన్ ప్రభావం తీవ్రంగా ఉండనుంది.

టాటా నెక్సాన్ విడుదల మరియు ఇంజన్ వివరాలు

టాటా మోటార్స్ నెక్సాన్ ధరలను రూ. 6 నుండి 9 లక్షల మధ్య నిర్ణయించే అవకాశం ఉంది. ఇవే ధరలతో విడుదలైతే ఇండియన్ ఎస్‌యూవీ మార్కెట్లో నెక్సాన్ సంచలనాత్మక విక్రయాలు సాధించడం ఖాయం.

టాటా నెక్సాన్ విడుదల మరియు ఇంజన్ వివరాలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా మోటార్స్ టియాగో సక్సెస్‌తో పాటు హెక్సా మరియు టిగోర్ ద్వారా వరుస విజయాల బాట పట్టింది. ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ద్వారా టాటా రూపొందించిన ఈ మూడు మోడళ్లు మంచి డిమాండ్ సొంతం చేసుకుంటున్నాయి. ఇదే డిజైన్ ఫిలాసఫీతో వస్తున్న నెక్సాన్ సరైన ధరలతో విడుదలైతే మారుతి సుజుకి వితారా బ్రిజా క్రేజ్‌కు బ్రేకులు పడటంలో ఎలాంటి సందేహం లేదు.

English summary
Read In Telugu: Tata Motors Teases Nexon And Reveals Engine Details
Story first published: Tuesday, July 18, 2017, 17:41 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark