సెప్టెంబర్ 21 న వస్తోన్న టాటా నెక్సాన్

Written By:

టాటా మోటార్స్ తమ నెక్సాన్ ఎస్‌యూవీని సెప్టెంబర్ 21, 2017 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా టాటా డీలర్ల వద్ద నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ బుకింగ్స్ ఇది వరకే ప్రారంభమయ్యాయి.

నెక్సాన్ ఎస్‌యూవీ విడుదల

పూనేలోని రంజన్‌గావ్ ప్రొడక్షన్ ప్లాంటులో టాటా మోటార్స్ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఉత్పత్తిని ప్రారంభించింది. విడుదల అనంతరం సెప్టెంబర్ చివరి నుండి నెక్సాన్ డెలివరీలను ప్రారంభించనుంది.

Recommended Video - Watch Now!
Tata Nexon Review: Specs
నెక్సాన్ ఎస్‌యూవీ విడుదల

టాటా మెటార్స్ సరికొత్త నెక్సాన్ ఎస్‌‌యూవీని ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా రూపొందించింది. అదే ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా వచ్చిన టియాగో, హెక్సా మరియు టిగోర్ తర్వాత నాలుగవ ప్రొడక్ట్‌గా టాటా లైనప్‌లోకి ప్రవేశిస్తోంది. టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్ఇ, ఎక్స్ఎమ్, ఎక్స్‌టి, ఎక్స్‌జడ్ మరియు ఎక్స్‌జడ్ ప్లస్ వేరియంట్లలో లభించనుంది.

నెక్సాన్ ఎస్‌యూవీ విడుదల

నెక్సాన్ ఎస్‌యూవీ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభించనుంది. టియాగో హ్యాచ్‌బ్యాక్‌లో అందించిన 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఇందులో అందిస్తోంది. ఇది 108.5బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా 108.5బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌తో రానుంది.

నెక్సాన్ ఎస్‌యూవీ విడుదల

టాటా మోటార్స్ నెక్సాన్‌ను తొలుత 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో విడుదల చేసి, ఆలస్యంగా ఆటోమేటిక్ వెర్షన్ నెక్సాన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లు ఎకానమీ, సిటి మరియు స్పోర్ట్ అనే మూడు విభిన్న డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి.

నెక్సాన్ ఎస్‌యూవీ విడుదల

కండలు తిరిగి శరీరాకృతిలో, కూపే తరహా ప్లోటింగ్ రూఫ్ లైన్ డిజైన్ లక్షణాలతో విపణిలో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ లకు గట్టి పోటీనివ్వనుంది. మరియు ఇంటీరియర్‌లో కేవలం లగ్జరీ కార్లలో వచ్చే ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వస్తోంది.

నెక్సాన్ ఎస్‌యూవీ విడుదల

టాటా తమ నెక్సాన్ ఇంటీరియర్‌లో 6.5-అంగుళాల పరిమాణం ఉన్న హెచ్‌డి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఎనిమిది స్పీకర్లు గల హార్మన్ ఆడియో సిస్టమ్ వంటి అతి ప్రధానమైన ఫీచర్లు రానున్నాయి.

నెక్సాన్ ఎస్‌యూవీ విడుదల

నెక్సాన్ ఎస్‌యూవీ 7 నుండి 10 లక్షల ధరల శ్రేణిలో విడుదలయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 21 న టాటా నెక్సాన్ విడుదల వివరాలను డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రత్యేక కథనంతో ప్రచురిస్తుంది. మరిన్ని తాజా ఆటోమొబైల్ న్యూస్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి.

డ్రైవ్‌స్పార్క్ బృందం ఇది వరకే టాటా నెక్సాన్ ఎస్‌యూవీకి టెస్ట్ డ్రైవ్ నిర్వహించి పరీక్షించింది. నెక్సాన్‌లోని ప్రయోజనాలు మరియు అప్రయోజనాలతో పాటు నెక్సాన్ కొనచ్చా.... కొనకూడదో నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూలో చూద్దాం రండి....

English summary
Read In Telugu: Tata Nexon India Launch Date Revealed
Story first published: Wednesday, September 6, 2017, 19:02 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark