నెక్సాన్ విడుదల చేసిన టాటా: ధర, మైలేజ్, ఇంజన్, ఫీచర్లు, మరియు ఫోటోలు

Written By:

దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ నేడు(21 సెప్టెంబర్) విపణిలోకి నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేసింది.

టాటా వారి తొలి సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్ ప్రారంభ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 5.85 లక్షలు మరియు ప్రారంభ డీజల్ వేరియంట్ ధర రూ. 6.85 లక్షలు ఎక్స్-షోరూమ్‌(ఢిల్లీ)గా ఉన్నట్లు టాటా ప్రతినిధులు తెలిపారు.

టాటా నెక్సాన్ విడుదల

టాటా నెక్సాన్ ఇంజన్ మరియు వేరియంట్లు

టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో నాలుగు విభిన్న వేరియంట్లలో లభించును.

అవి,

  • ఎక్స్ఇ(XE)
  • ఎక్స్ఎమ్(XM)
  • ఎక్స్‌టి(XT)
  • ఎక్స్‌జడ్ ప్లస్(XZ+)
టాటా నెక్సాన్ విడుదల

టాటా నెక్సాన్ పెట్రోల్ వేరియంట్ల ధరలు

నెక్సాన్ వేరియంట్లు ధరలు
ఎక్స్ఇ రూ. 5.85 లక్షలు
ఎక్స్ఎమ్ రూ. 6.49 లక్షలు
ఎక్స్‌టి రూ. 7.29 లక్షలు
ఎక్స్‌జడ్ ప్లస్ రూ. 8.44 లక్షలు
ఎక్స్‌జడ్ ప్లస్(డ్యూయల్ టోన్) రూ. 8.59 లక్షలు
టాటా నెక్సాన్ విడుదల

టాటా నెక్సాన్ డీజల్ వేరియంట్ల ధరలు

నెక్సాన్ వేరియంట్లు ధరలు
ఎక్స్ఇ రూ. 6.85 లక్షలు
ఎక్స్ఎమ్ రూ. 7.39 లక్షలు
ఎక్స్‌టి రూ. 8.14 లక్షలు
ఎక్స్‌జడ్ ప్లస్ రూ. 9.29 లక్షలు
ఎక్స్‌జడ్ ప్లస్(డ్యూయల్ టోన్) రూ. 9.44 లక్షలు

అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఇవ్వబడ్డాయి మరియు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ వెర్మోంట్ రెడ్ మరియు మోరోకాన్ బ్లూ రంగుల్లో మాత్రమే లభించును

టాటా నెక్సాన్ విడుదల

టాటా నెక్సాన్ స్పెసిఫికేషన్లు

టాటా నెక్సాన్ ఎస్‌యూవీలో శక్తివంతమైన 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్‌లు ఉన్నాయి. 6-స్పీడ్ మ్యాన్యుల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఉన్న రెండు ఇంజన్ వేరియంట్లలో ఎకో, సిటి మరియు స్పోర్ట్ అనే మూడు విభిన్న డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి.

Recommended Video - Watch Now!
Tata Nexon Review: Specs
టాటా నెక్సాన్ విడుదల

టాటా నెక్సాన్ పెట్రోల్ మరియు డీజల్ స్పెసిఫికేషన్లు

టాటా నెక్సాన్‌లోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 108.5బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా 1.5-లీటర్ డీజల్ ఇంజన్ 108.5బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టాటా నెక్సాన్ విడుదల

టాటా నెక్సాన్ కొలతలు:

పొడవు 3,994ఎమ్ఎమ్
వెడల్పు 1,811ఎమ్ఎమ్
ఎత్తు 1,607ఎమ్ఎమ్
వీల్ బేస్ 2,498ఎమ్ఎమ్
గ్రౌండ్ క్లియరెన్స్ 209ఎమ్ఎమ్
బూట్ స్పేస్ 350-లీటర్లు
టాటా నెక్సాన్ విడుదల

టాటా నెక్సాన్ డిజైన్

టాటా మోటార్స్ వారి సరికొత్త ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంతో రూపొందించిన టియాగో, టిగోర్ మరియు హెక్సా తరువాత నాలుగవ మోడల్‌గా, టాటా వారి తొలి సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని టాటా అభివృద్ది చేసింది. నూతన తరం ఎస్‌యూవీ స్టైల్, కూపే ట్రెడిషన్ మరియు విభిన్న ఎక్ట్సీరియర్ డిజైన్ ఎలిమెంట్లతో నెక్సాన్‌ను డెవలప్ చేశారు.

టాటా నెక్సాన్ విడుదల

నెక్సాన్ ఫ్రంట్‌ డిజైన్‌లో కండలు తిరిగి శరీరాకృతి, పెద్ద పరిమాణంలో ఉన్న హెడ్ ల్యాంప్స్, వీటిని అనుసంధానం చేస్తూ ఇంజన్‌కు ఎక్కువ గాలిని గ్రహించే విధంగా విశాలమైన బ్లాక్ హనికాంబ్ గ్రిల్ కలదు. రెండు హెడ్ ల్యాంప్స్‌ను కలుపుతూ ఫ్రంట్ గ్రిల్ క్రింది భాగంలో ఉన్న క్రోమ్ పట్టీ ఎంతో ఆకర్షణీయంగా ఉంది.

టాటా నెక్సాన్ విడుదల

నెక్సాన్ సైడ్ డిజైన్‌లో చాలా డిజైన్ అంశాలు కనిపిస్తాయి. డార్క్ గ్రే ఫ్లోటింగ్ రూఫ్ డిజైన్, విండో మరియు విండో అద్దాలను వేరు చేస్తూ, ఫ్రంట్ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్ల నుండి ప్రారంభయ్యి, వెనుక వైపున్న హెడ్ ల్యాంప్స్ వద్ద ముగిసే తెలుపు రంగు పట్టీ చాలా ఆట్రాక్టివ్‌గా ఉంది. నాలుగు చక్రాలకు 16అంగుళాల పరిమాణం ఉన్న డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

టాటా నెక్సాన్ విడుదల

నెక్సాన్ రియర్ డిజైన్‌లో పదునైన ఆకృతి గల అద్దం కలదు, దీనికి క్రిందుగా రెండు టెయిల్ ల్యాంప్స్ కలుపుతూ X-ఆకారంలో ఉన్న తెలుపు రంగు సిరామిక్ ప్లాస్టిక్ స్ట్రిప్ నెక్సాన్ ఓవరాల్ డిజైన్‌కు మరిన్ని మెరుగులుదిద్దింది.

టాటా నెక్సాన్ విడుదల

టాటా నెక్సాన్ ఇంటీరియర్

నెక్సాన్ ఇంటీరియర్‌లోని డ్యాష్‌బోర్డ్ రెండు లేయర్లను కలిగి ఉంది. ఇందులో పైవైపున్న లేయర్ డార్క్ గ్రే మరియు క్రింది లేయర్ బీజి రంగులో ఉంది. ఇదే డ్యాష్‌బోర్డులో ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌కు ప్రక్కన 6.5-అంగుళాల పరిమాణం ఉన్న హెచ్‌డి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది.

టాటా నెక్సాన్ విడుదల

నెక్సాన్ ఫీచర్లు

నెక్సాన్ ఇంటీరియర్‌లో ఆండ్రాయిడ్ ఆటో, గూగుల్ మ్యాప్స్ ఆధారిత టర్న్ బై టర్న్ న్యావిగేషన్ ఉన్నాయి, ఆపిల్ కార్ ప్లే ఫీచర్‌ను కాస్త ఆలస్యంగా పరిచయం చేయనుంది. గ్లోసీ పియానో బ్లాక్ ఫినిషింగ్‌ గల సెంటర్ కన్సోల్ కలదు. ఇక్కడ నుండి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఎయిర్ కండీషన్‌ను కంట్రోల్ చేయవచ్చు.

అదనంగా రెండు 12వోల్ట్ ఛార్జింగ్ పోర్ట్‌లు మరియు వెనుక ప్రయాణికుల కోసం ఏ/సి వెంట్స్ ఉన్నాయి.

టాటా నెక్సాన్ విడుదల

టాటా నెక్సాన్ లోని భద్రత ఫీచర్లు

టాటా మోటార్స్ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఫీచర్లున్నాయి. నెక్సాన్ లోని అన్ని వేరియంట్లలో వీటిని తప్పనిసరిగా అందిస్తోంది.

టాటా నెక్సాన్ విడుదల

టాటా నెక్సాన్ లభించు రంగులు:

టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఐదు విభిన్న రంగుల్లో లభించును. అవి,

  • మొరొకాన్ బ్లూ,
  • వెర్మోంట్ రెడ్,
  • సీటిల్ సిల్వర్,
  • గ్లాస్గో గ్రే మరియు
  • కాల్గరి వైట్.

టాటా నెక్సాన్ ఎస్‌యూవీని డ్రైవ్‌స్పార్క్ ఇది వరకే టెస్ట్ డ్రైవ్ చేసింది. టాటా నెక్సాన్ కొనడం మంచిదేనా...? ఇందులో ఉన్న ప్లస్సులేంటి... మైనస్సులేంటి వంటి వివరాలతో పాటు మా పూర్తి టెస్ట్ డ్రైవ్ అనుభవం నెక్సాన్ రివ్యూ కథనంలో మీ కోసం...

English summary
Read In Telugu: Tata nexon launched in india price mileage specifications images

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark