మారుతి వితారా బ్రిజాతో పోల్చితే నెక్సాన్ ఎంపిక సరైనదేనా...?

Written By:

టాటా మోటార్స్ భారీ అంచనాలతో మార్కెట్లోకి నెక్సాన్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీతో వచ్చిన టాటా నెక్సాన్‌లో ఎన్నో ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు ఉన్నాయి. మార్కెట్లో ఇది వరకే ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు మహీంద్రా టియువి300 వాహనాలతో పోటీపడుతోంది.

అయితే, మారుతి సుజుకి వితారా బ్రిజాతో పోల్చుకుంటే నెక్సాన్ ఎంపిక సరైనదేనా....? నేటి కథనంలో చూద్దాం రండి....

టాటా నెక్సాన్ Vs మారుతి వితారా బ్రిజా

ప్యాసింజర్ కార్ల మార్కెట్లో పాతిక సంవత్సరాల అనుభవం గడించినప్పటికీ, టాటా లైనప్‌లో ఉన్న కార్లకు ఆశించిన ఆదరణ లభించలేదు. టాటా కార్లు అనగానే, అవే పాత ఇంజన్‌లు, పాత డిజైన్, ఎలాంటి ఫీచర్లు ఉండవు, అప్‌డేట్స్ ఉండవనే అపవాదాన్ని తెచ్చుకున్నాయి.

చివరి ప్రయత్నంగా టాటా మోటార్స్ ఇంపాక్ట్(IMPACT)డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా టియాగో చిన్న కారును విడుదల చేసింది. అనతి కాలంలో టియాగో భారీ విక్రయాల బాట పట్టింది. వెంటనే టియాగోకు కొనసాగింపుగా టిగోర్ మరియు హెక్సా అనే కార్లను విడుదల చేసింది. వాటికి కూడా మంచి ఆదరణ లభించింది.

టాటా నెక్సాన్ Vs మారుతి వితారా బ్రిజా

వరుసగా మూడు ఉత్పత్తులు సక్సెస్ కావడంతో టాటా ఇక వెనక్కితిరిగి చూసుకోలేదు. ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి తొలిసారిగా నెక్సాన్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ సెగ్మెంట్లో ఉన్న వితారా బ్రిజా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు టియువి300 లకు గట్టి పోటీనిస్తూ తక్కువ ధరతో నెక్సాన్ మార్కెట్లోకి వచ్చింది.

మారుతి వితారా బ్రిజాతో పోల్చితే నెక్సాన్ ఎంపిక సరైనదేనా...? నెక్సాన్‌ను ఎందుకు కొనాలి...? ఎందుకు కొనకూడదు...? వంటి అంశాల గురించి డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రత్యేక విశ్లేషణ..

టాటా నెక్సాన్ Vs మారుతి వితారా బ్రిజా

బ్రిజాతో పోల్చుకుంటే నెక్సాన్ విభిన్న వేరియంట్లలో లభిస్తోంది. నెక్సాన్ ఎస్‌యూవీని పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో ఐదైదు చొప్పున మొత్తం పది విభిన్న వేరియంట్లలో నెక్సాన్‌ను ఎంచుకోవచ్చు.

వితారా బ్రిజా కేవలం సింగల్ డీజల్ ఇంజన్‌తో ఏడు విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంది.

టాటా నెక్సాన్ Vs మారుతి వితారా బ్రిజా

డిజైన్: ప్యాసింజర్ కార్ల విషయంలో డిజైన్ అత్యంత కీలకమైన అంశం. ఏ కారు కొన్నా రెండేళ్లకే పాత కాలం డిజైన్‌లా అనిపిస్తుంది. అందుకోసమే కార్ల కంపెనీలు ప్రతి రెండు మూడేళ్లకొకసారి, తమ ఉత్పత్తులను డిజైన్ పరంగా అప్‌డేట్ చేస్తుంయి.

నెక్సాన్ విశయానికి వస్తే, ఇది ఫ్యూచరిస్టిక్ డిజైన్ కలిగి ఉంది. భివిష్యత్తులో కార్ల డిజైన్‌ను అంచనా వేసి టాటా తమ నెక్సాన్‌ను ఈ రూపం పోసింది. బాక్స్ ఆకారంలో ఉండే పాత కాలం ఎస్‌యూవీలను ఎంచుకునే వారి సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. ఇప్పుడు ఎక్కువగా క్రాసోవర్, కూపే స్టైల్ లక్షణాలను ఎస్‌యూవీలకు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి నెక్సాన్‌ను ఇటు ఎక్కువ వయసున్న వారు, అటు యువ కొనుగోలుదారులు కూడా ఎంచుకోవచ్చు.

Recommended Video - Watch Now!
Tata Nexon Review: Specs
టాటా నెక్సాన్ Vs మారుతి వితారా బ్రిజా

ఇంటీరియర్ స్పేస్:

ఒక కారు ఇంటీరయర్ స్పేస్‌ను దాని ఎక్ట్సీరియర్ డిజైన్ ఆధారంగా అంచనా వేయకూడదు. నిజమే, బాక్స్ ఆకారంలో ఉన్న ప్రతి వెహికల్ ఇంటీరిర్ స్పేస్ బాగానే కలిగి ఉంటుంది. కానీ, ఫ్యూచర్ డిజైన్ లక్షణాలున్న వెహికల్స్‌లో మంచి క్యాబిన్ స్పేస్ సాధ్యమవుతుంది. అందుకు నిదర్శనం టాటా నెక్సాన్ ఇంటీరియర్. ఐదు మంది ప్రయాణికులకు ఇందులో విశాలమైన క్యాబిన్ స్పేస్ ఉంది.

టాటా నెక్సాన్ Vs మారుతి వితారా బ్రిజా

ధర:

ధర విషయంలో ఇండియన్స్ అస్సలు కాప్రమైజ్ అవ్వరు. కాబట్టి ధర పరంగా టాటా మోటార్స్ అద్భుతం చేసిందని చెప్పాలి. హ్యాచ్‌బ్యాక్ మరియు సెడాన్ కార్ల ధరలో శ్రేణిలో ఒక కాంపాక్ట్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టడం అంత సులభం కాదు. కాని టాటా సుసాధ్యం చేసింది. పెట్రోల్ నెక్సాన్ ప్రారంభ ధర రూ. 5.92 లక్షలు మరియు డీజల్ నెక్సాన్ ప్రారంభ ధర రూ. 6.92 లక్షలుగా ఉంది.

ఇదే సెగ్మెంట్లో ఉన్న మారుతి బ్రిజా కేవలం డీజల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 7.41 లక్షలు. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ హైదరాబాద్‌గా ఇవ్వబడ్డాయి.

టాటా నెక్సాన్ Vs మారుతి వితారా బ్రిజా

విభిన్న డ్రైవింగ్ మోడ్స్

ఎస్‌యూవీ అంటే, స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్. విభిన్న డ్రైవింగ్ మోడ్స్ ఉండటం ద్వారా ఇంజన్ మీద అనవసరపు బారం వేయకుండా, ఆయా డ్రైవింగ్ మోడ్స్‌కు అనుగుణంగా డ్రైవ్ చేయవచ్చు. ఇలాంటి డ్రైవింగ్ మోడ్స్ ఎస్‌యూవీ వాహనాలలో తప్పనిసరిగా ఉండాయి. మరి ఇప్పటి వరకు ఎన్ని ఎస్‌యూవీలలో డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి...?

టాటా నెక్సాన్ లో సిటి, ఎకో మరియు స్పోర్ట్ డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. ఈ సెగ్మెంట్లో విడుదలైన ఎస్‌యూవీలలో ఇప్పటి వరకు ఇలాంటి డ్రైవింగ్ మోడ్స్ రాలేదు.

టాటా నెక్సాన్ Vs మారుతి వితారా బ్రిజా

ఇంజన్

డిజైన్ మరియు ధరతో పాటు శక్తివంతమైన ఇంజన్ ఎస్‌యూవీలలో ఉండాలి. టాటా నెక్సాన్ 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌లను కలిగి ఉంది. అయితే మారుతి 1.3-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌ వేరియంట్లో ఉంది.

టాటా నెక్సాన్ Vs మారుతి వితారా బ్రిజా
  • టాటా నెక్సాన్ 1.2 పెట్రోల్ ఇంజన్ - 108.5బిహెచ్‌పి పవర్/ 170ఎన్ఎమ్
  • టాటా నెక్సాన్ 1.5 డీజల్ ఇంజన్- 108.5బిహెచ్‌పి పవర్/260ఎన్ఎమ్
  • మారుతి వితారా బ్రిజా - 89బిహెచ్‌పి పవర్/ 200ఎన్ఎమ్ టార్క్
మారుతి వితారా బ్రిజా డీజల్ వేరియంట్‌తో పోల్చుకుంటే నెక్సాన్ డీజల్ శక్తివంతమైన ఇంజన్ కలిగి ఉంది. అధిక పవర్ మరియు అధిక టార్క్ ఉత్పత్తి చేయగలదు.
టాటా నెక్సాన్ Vs మారుతి వితారా బ్రిజా

6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్:

టాటా మోటార్స్ నెక్సాన్ లోని పెట్రోల్ మరియు డీజల్ రెండింటిలో 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో 6-స్పీడ్ గేర్‌బాక్స్ పొందిన తొలి మోడల్ నెక్సాన్.

మారుతి వితారా బ్రిజాలోని సింగల్ డీజల్ ఇంజన్ వేరియంట్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రం కలిగి ఉంది. ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌లో కూడా ఇదే 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది.

టాటా నెక్సాన్ Vs మారుతి వితారా బ్రిజా

ఇండియాలో బైకు కొనాలన్నా.... కారు కొనాలన్నా... ప్రతి ఒక్కరూ మొదటి చూసే అంశం మైలేజ్. భారతీయుల నాడి గమనించిన మారుతి ప్రతి ఒక్క మోడల్‌ను బెస్ట్ మైలేజ్‌లో విడుదల చేసింది. మారుతి సక్సెస్‌లో మైలేజ్ ఒక ప్రధానాంశంగా చెప్పవచ్చు.

  • టాటా నెక్సాన్ పెట్రోల్ మైలేజ్ లీటర్‌కు 17కిలోమీటర్లు
  • టాటా నెక్సాన్ డీజల్ మైలేజ్ లీటర్‌కు 21.5కిలోమీటర్లు
  • మారుతి సుజుకి వితారా బ్రిజా డీజల్ మైలేజ్ లీటర్‌కు 24.3కిలోమీటర్లు
టాటా నెక్సాన్ Vs మారుతి వితారా బ్రిజా

నెక్సాన్ ఇంటీరియర్‌లో తొలిసారిగా సరికొత్త హార్మన్ మ్యూజిక్ సిస్టమ్, కాంపాక్ట్ ఎస్‌యూవీలలోనే తొలి ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ వంటి ప్రధాన ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్ కీ, 31 రకాల విభిన్న స్మార్ట్ స్టోరేజ్ స్పేస్, మరియు డోర్లలో గొడుగులను స్టోర్ చేసుకునే సదుపాయం కల్పింది.

టాటా నెక్సాన్ Vs మారుతి వితారా బ్రిజా

లగ్జరీ మరియు హై ఎండ్ కార్లకే పరిమితమైన ఇలాంటి ఫీచర్లు, దేశీయ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను శాసిస్తున్న ఇతర కంపెనీలు తమ మోడళ్లలో ప్రవేశపెట్టలేకపోయాయి. ప్రతి సాధారణ కస్టమర్‌ను చేరుకునే విధంగా టాటా నెక్సాన్‌ను తీర్చిదిద్దింది.

టాటా నెక్సాన్ Vs మారుతి వితారా బ్రిజా

కొత్తగా ఎంచుకునే వాహనాలన్నీ మొదట్లో బాగానే ఉంటాయి. అయితే రెండు మూడేళ్ల తర్వాత కూడా నెక్సాన్ పనితీరు సంతృప్తినిస్తుందా... ? మరియు నిర్మాణ నాణ్యత పరమైన అవగాహన టాటా కల్పించాల్సి ఉంటుంది.

మారుతి సుజుకి సంస్థకు దేశవ్యాప్తంగా విసృతమైన డీలర్‌షిప్ నెట్‌వర్క్ ఉండటం ద్వారా వీలైనంత ఎక్కువ మంది కస్టమర్లను చేరుకుంటోంది. కాబట్టి టాటా కూడా డీలర్ల సామ్రాజ్యాన్ని విసృతపరుచుకోవాలి.

టాటా నెక్సాన్ Vs మారుతి వితారా బ్రిజా

మారుతి సుజుకి వే ఆప్ లైఫ్ అనే నిదాంతో కార్లను విక్రయిస్తోంది. అయితే టాటా మోటార్స్ రెండేళ్ల కాలంలో విడుదల చేసిన టియాగో, టిగోర్, హెక్సా మరియు నెక్సాన్ మోడళ్లతో పోల్చుకుంటే భారతీయుల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడం ఖాయం అనిపిస్తోంది.

టాటా నెక్సాన్ Vs మారుతి వితారా బ్రిజా

టాటా నెక్సాన్ మరియు మారుతి సుజుకి వితారా బ్రిజాలలో, ధర, ఇంజన్, ఫీచర్లు, డిజైన్, నూతన టెక్నాలజీ పరంగా నెక్సాన్ మంచి ఎంపిక. అయితే, మారుతికున్న విసృతమైన డీలర్ల నెట్‌వర్క్, మైలేజ్ దృష్ట్యా వితారా బ్రిజాను ఎంచుకోవచ్చు.

ఈ రెండింటిలో ఏ ఎస్‌యూవీ మంచిది...? ఎందుకు మంచిదో... క్రింది కామెంట్ బాక్సు ద్వారా మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి...

English summary
Read In Telugu: Is Nexon Worth Buying Compared To Maruti Brezza. Tata Nexon Maruti Vitara Brezza price mileage fatures spec comparision
Story first published: Friday, September 22, 2017, 17:07 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark