విడుదలకు సిద్దమైన టియాగో ఏఎమ్‌టి: విడుదల మరియు సాంకేతిక వివరాలు

Written By:

దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ గత ఏడాది విపణిలోకి విడుదల చేసిన టియాగో హ్యాచ్‌బ్యాక్ భారీ విజయాన్ని అందుకుంది. ఆ విజయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు దేశీయంగా విడుదలకు సిద్దమైన ఆటోమేటిక్ కార్లలో ఒకటి టియాగో ఏఎమ్‌టి. త్వరలో దీనిని విడుదలకు ఏర్పాట్లు చేస్తున్న టాటా, దీనిని పూర్తి స్థాయిలో అభివృద్ది చేసినట్లు సమాచారం...

To Follow DriveSpark On Facebook, Click The Like Button
టాటా టియాగో ఆటోమేటిక్

ప్రస్తుతం తాజాగా ఇంటర్నెట్లో తీవ్ర దుమారం రేగుతున్న వార్తల్లో టియాగో ఆటోమేటిక్ ఒకటి. టాటా తమ టియాగో లోని పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో కూడా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేస్తున్నట్లు ఆధారంలేని కథనాలు వెలువడుతున్నాయి.

టాటా టియాగో ఆటోమేటిక్

నూతన ట్రాన్స్‌మిషన్ జోడింపు మినహాయిస్తే డిజైన్ మరియు రూపం పరంగా ఎలాంటి మార్పులకు గురికావడం లేదని తెలుస్తోంది. మొదట పెట్రోల్ వేరియంట్లో పరిచయమైన, పిమ్మట డీజల్ వేరియంట్లో ఏఎమ్‌టి రానుందని సమాచారం.

టాటా టియాగో ఆటోమేటిక్

టియాగో లోని పెట్రోల్ లైనప్‌లో ఉన్న ఎక్స్‌టి మరియు ఎక్స్ఎమ్ వేరియంట్లలో దీనిని అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆటోమేటిక్ వేరియంట్ లీటర్‌కు 25కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది.

టాటా టియాగో ఆటోమేటిక్

ఇక ఈ టియాగో ఆటోమేటిక్ దేశీయంగా విడుదలయితే ప్రస్తుతం విపణిలో ఉన్న మారుతి సుజుకి సెలెరియో ఏఎమ్‌టి, రెనో క్విడ్ 1.0 ఏఎమ్‌టి, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఏఎమ్‌టి, వంటి వాటికి గట్టిపోటీనివ్వనుంది.

టాటా టియాగో ఆటోమేటిక్

ఆటోమేటిక్ టియాగో వేరియంట్లో సాంకేతికంగా 1.2-లీటర్ సామర్థ్యం గల రివట్రాన్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 84బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

టాటా టియాగో ఆటోమేటిక్

ఇక డీజల్ వెర్షన్ టియాగోలో 1.05-లీటర్ సామర్థ్యం గల రివోటార్క్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 69బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

టాటా టియాగో ఆటోమేటిక్

టాటా మోటార్స్ తమ టియాగో ఆధారిత కైట్-5 సెడాన్ ను అభివృద్ది చేసింది. అతి త్వరలో దీనిని విడుదలకు కూడా సిద్దం చేసింది. గత ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించిన నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదలకు సిద్దం చేస్తోంది.

టాటా టియాగో ఆటోమేటిక్

భవిష్యత్తులో ఈ కైట్ 5 సెడాన్ మరియు నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలలో కూడా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పరిచయం చేసే అవకాశం ఉంది.

 
English summary
Tata Tiago AMT Coming By March; Both Petrol And Diesel Variants To Get AMT
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark