టిగోర్ ఎలక్ట్రిక్ వెర్షన్ ప్రొడక్షన్ ప్రారంభించిన టాటా మోటార్స్

Written By:

దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ టిగోర్ ఎలక్ట్రిక్ కారును ప్రొడక్షన్ ప్లాంటు నుండి అధికారికంగా ఆవిష్కరించింది. ఇప్పటికే, ఫస్ట్ బ్యాచ్ టిగోర్ ఎలక్ట్రిక్ వాహనాలను టాటా సనంద్ ప్రొడక్షన్ ప్లాంట్ ఉత్పత్తి చేసింది.

టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారు

విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న ఎనర్జీ ఎఫీషియెన్స్ సర్వీసెస్(EESL)సంస్థకు టాటా ఉత్పత్తి చేసిన టిగోర్ ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ ఇవ్వనుంది. EESL ఆర్డర్ ప్రకారం మొత్తం 10,000 యూనిట్ల టిగోర్ ఎలక్ట్రిక్ కార్లను టాటా డెలివరీ ఇవ్వనుంది.

టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారు

తొలివిడత క్రింద 250 యూనిట్ల టిగోరో ఎలక్ట్రిక్ కార్లను EESL సంస్థకు చేర్చడానికి టాటా మోటార్స్ అఫీషియల్ లెటర్ పొందింది. టాటా సన్స్ మరియు టాటా మోటార్స్ గౌరవ ఛైర్మన్ శ్రీ ఎన్ చంద్రశేఖరన్ గారు, జెండా ఊపి టిగోర్ ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇతర టాటా అధికారులు పాల్గొన్నారు.

టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారు

ఈ సందర్భంగా చంద్రశేఖరన్ మాట్లాడుతూ, టాటా ఎలక్ట్రిక్ బృందం మొత్తానికి ఇదొక గర్వకారణమైన సందర్భం, దీంతో టాటా మోటార్స్ మరో అరుదైన మైలురాయిని ఖాతాలో వేసుకుంది. సమిష్టి కృషితో దేశీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో అత్యుత్తమ ఫలితాలు సాధించే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు."

టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారు

టాటా టిగోర్ ఎలక్ట్రిక్ చూడటానికి అచ్చం రెగ్యులర్ వెర్షన్‌నే పోలి ఉంటుంది. అయితే, ఎలక్ట్రిక్ వెర్షన్ అని గుర్తించేందుకు టిగోర్ ప్రక్కన ఇవి అనే బ్యడ్జింగ్ జోడించడం జరిగింది. టిగోర్ ఎలక్ట్రిక్‌లో జరిగిన అతి ప్రధానమైన మార్పు ఇంజన్ స్థానంలో ఎలక్ట్రిక్ మోటార్ సిస్టమ్ రావడం. ఇందులో వినియోగించిన ఎలక్ట్రిక్ సిస్టమ్‌ను ఎలక్ట్రా ఇవి సంస్థ అభివృద్ది చేసి, సరఫరా చేస్తోంది.

టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారు

ఎలక్ట్రా ఇవి సంస్థ వాహన పరిశ్రమకు కావాల్సిన ఎలక్ట్రిక్ డ్రైవ్ సిస్టమ్‌లను అభివృద్ది, ఉత్పత్తి చేసి, సరఫరా చేస్తోంది. 2030 నాటికి కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే విక్రయించే లక్ష్యంతో ఉన్న భారత ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా వివిధ రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు కావాల్సిన ఎలక్ట్రిక్ డ్రైవ్ సిస్టమ్‌ను అభివృద్ది చేస్తోంది.

టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా తొలిసారిగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన పరిశ్రమలోకి అడుగుపెట్టడంతో దేశీయంగా ఎలక్ట్రిక్ కార్ల శకం మొదలైందని చెప్పవచ్చు. ప్రపంచ పర్యావరణానికి అనుగుణంగా కాలుష్యరహిత వాహనాల అభివృద్ది, తయారీ మరియు విక్రయాలకు సముఖత చూపి, ఆచరించడం రతన్ టాటా మరియు యావత్ భారతదేశం గర్వించదగ్గ విషయం.

ప్రస్తుతానికి వాణిజ్యపరమైన అవసరాలకు మాత్రమే టాటా తమ టిగోర్ ఎలక్ట్రిక్ కారును విక్రయిస్తోంది. వ్యక్తిగత అవసరాలకు ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదు.

English summary
Read In Telugu: Tata Tigor Electric Vehicle (EV) Rolls Out From Sanand Plant
Story first published: Thursday, December 7, 2017, 12:31 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark