టాటా జెనాన్ యోధా పికప్ ట్రక్కు విడుదల: ధర మరియు పూర్తి విడుదల వివరాలు...

Written By:

స్వదేశీ పరిజ్ఞానంతో ఎదుగుతున్న భారత దేశపు దిగ్గజ విభిన్న వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ నేడు (జనవరి 03, 2017) ఇండియన్ మార్కెట్లోకి జెనాన్ యోధా పికప్ ట్రక్కును విడుదల చేసింది. టాటా కమర్షియల్ వాహనాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న అక్షయ్ కుమార్ నేతృత్వంలో దీనిని విడుదల చేశారు.

సింగల్ మరియు డబుల్ క్యాబిన్ లతో లభించే ఈ జెనాన్ యోధా పికప్ వాహనం బిఎస్-III మరియు బిఎస్-IV ఇంజన్‌‌లతో అందుబాటులో ఉంది.

  • బిఎస్-III జెనాన్ యోధా ధర రూ. 6.05 లక్షలు
  • బిఎస్-IV జెనాన్ యోధా ధర రూ. 6.19 లక్షలు 
రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన యోధా పికప్ ట్రక్కులను 2-వీల్ డ్రైవ్ లేదా 4- వీల్ డ్రైవ్ ఆప్షన్‌లో ఎంచుకునే అవకాశం కలదు. దీనికి పేలోడ్ సామర్థ్యం 1,250 కిలోలు అని టాటా తెలిపింది.

అన్ని రకాల భూబాగాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచేందుకు ఇందులో అధునాతన 16-అంగుళాల రేడియల్ టైర్లను అందివ్వడం జరిగింది.

2017 జెనాన్ యోధా పికప్ ట్రక్కు 3.0-లీటర్ సామర్థ్యం గల టుర్బో చార్జ్‌డ్ నాలుగు సిలిండర్ల కామన్ రెయిల్ డీజల్ కలిగి ఉంది. ఇది బిఎస్-III మరియు బిఎస్-IV కాన్ఫిగరేషన్ లలో లభిస్తోంది.

బిఎస్-III ఉద్గార నియమాలను పాటించే వేరియంట్ గరిష్టంగా 71బిహెచ్‌పి పవర్ మరియు 223ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. అదే విదంగా బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే వేరియంట్ గరిష్టంగా 84బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

అత్యుత్తమ డ్రైవబులిటి కోసం సస్పెన్షన్ పరంగా ముందు వైపున 5 ప్లేట్లను మరియు వెనుక వైపున 9 ప్లేట్లను అందించారు. (ప్లేట్లను వాడుక భాషలో కట్టల్ అని కూడా పిలుస్తారు).

కొలతల పరంగా సరికొత్త జెనాన్ యోధా పికప్ ట్రక్కు పొడవు 2,550ఎమ్ఎమ్, వెడల్పు 1,750ఎమ్ఎమ్ లతో గరిష్టంగా 1,250 కిలోల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ప్రస్తుతం టాటా జెనాన్ యోధా వాహనాలకు మూడు సంవత్సరాలు లేదా ఒక లక్ష కిలోమీటర్లు మరియు మూడు సంవత్సరాలు లేదా 3,00,000 కిలోమీటర్లు పాటు ఏది ముందయితే వాటికి వారంటీని అందిస్తోంది.

12,000 కిమీల దూరం ప్రయాణించే లండన్-చైనా రైలు ప్రారంభం
చైనా నుండి సుమారుగా 12,000 కిలోమీటర్ల దూరం గల లండన్‌కు గూడ్స్ రైలు సర్వీస్ ను ప్రారంభించింది. ఈ మార్గంలో అనేక దేశాలతో చైనా వాణిజ్య వ్యాపారాలను సాగించనుంది

ఇగ్నిస్ ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభించిన మారుతి
మారుతి సుజుకి ఇగ్నిస్ విడుదల ఎప్పుడా అని యావత్తు ఇండియన్ మార్కెట్ ఎదురుచూస్తోంది. అయితే విడుదలకు ముందే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఇగ్నిస్ ఆన్‍‌లైన్ బుకింగ్స్ ను ప్రారంభించింది.

ఈ జనవరికి కొత్త బైకును విడుదల చేయనున్న యమహా
యమహా ఇండియా సరికొత్త మోటార్ సైకిల్ టీజర్ ను విడుదల చేసింది. ఈ నూతన బైకును జనవరి 24, 2017 విడుదల చేయనున్నట్లు సమాచారం.

 

English summary
Tata Xenon Yodha Launched In India; Prices Start At Rs. 6.05 Lakh
Story first published: Tuesday, January 3, 2017, 18:02 [IST]
Please Wait while comments are loading...

Latest Photos