సెప్టెంబర్ 2017లో అత్యధికంగా అమ్ముడుపోయిన కార్లు

సెప్టెంబర్ 2017లో అత్యధికంగా అమ్ముడుపోయిన కార్లు. సెప్టెంబర్ 2017 నుండే ఏడాది పండుగ సీజన్ ప్రారంభమైంది. దసరా పండుగ పర్వదినాన మరియు నవరాత్రి సందర్భంగా ప్యాసింజర్ కార్ల సేల్స్ విపరీతంగా పెరిగాయి.

By Anil

భారత‌దేశపు బెస్ట్ సెల్లింగ్ కారు ఏదని అడిగితే, ఎక్కువ మంది ఇచ్చే సమాధానం మారుతి ఆల్టో. మరి మీ సమాదానం కూడా ఆల్టోనే అయితే ఇవాళ్టి స్టోరీలో ఇండియా యొక్క బెస్ట్ సెల్లింగ్ గురించి తెలుసుకోవాల్సిందే.

సెప్టెంబర్ 2017 నుండే ఏడాది పండుగ సీజన్ ప్రారంభమైంది. దసరా పండుగ పర్వదినాన మరియు నవరాత్రి సందర్భంగా ప్యాసింజర్ కార్ల సేల్స్ విపరీతంగా పెరిగాయి. ప్రతి కార్ల కంపెనీ కూడా రికార్డ్ సేల్స్ నమోదు చేసుకుంది. అయితే, గత నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఏవో తెలుసుకోవాలని ఉందా...? మరెందుకు ఆలస్యం చూద్దాం రండి...

టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

10. రెనో క్విడ్

ఫ్రెంచ్ ప్యాసింజర్ కార్ల కంపెనీ రెనో ఉనికిని క్విడ్ హ్యాచ్‌హబ్యాక్‌ బయటపెడుతోంది. డస్టర్ ఎస్‌యూవీతో రెనో మంచి మంచి గుర్తింపును తెచ్చుకున్నప్పటికీ క్విడ్ విడుదలతో ప్రతి ఇండియన్ కస్టమర్‌ను కూడా చేరుకోగలిగింది.

బడ్జెట్ ధరలో వచ్చిన క్విడ్ హ్యాచ్‌బ్యాక్ గత నెలలో 9,099 యూనిట్ల వరకు అమ్ముడుపోయి టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో 10 వ స్థానంలో నిలిచింది.

టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

09. హ్యుందాయ్ క్రెటా

ఖరీదైన ఎస్‌యూవీలలో ఒకటి హ్యుందాయ్ క్రెటా కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో దక్షిణ కొరియా దిగ్గజడం ప్రవేశపెట్టిన క్రెటా ఎస్‌యూవీ అత్యుత్తమ విక్రయాలు సాధిస్తోంది. టాప్ 10 ప్యాసింజర్ కార్ల జాబితాలో ఖరీదైన కారు కూడా ఇదే.

గడిచిన సెప్టెంబర్ 2017లో 9,292 యూనిట్ల క్రెటా కార్లు అమ్ముడయ్యాయి.

Recommended Video

Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

08. హ్యుందాయ్ ఎలైట్ ఐ20

హ్యుందాయ్ వారి మరో కారు ఎలైట్ ఐ20 ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ 11,574 యూనిట్ల సేల్స్‌తో ఈ జాబితాలో ఎనిమిదవ స్థానం దక్కించుకుంది. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియమ్ ఎస్‌యూవీ శ్రేణిలో ఉన్న బాలెనో మరియు హోండా జాజ్ కార్లతో గట్టి పోటీని ఎదుర్కుంటున్నప్పటికీ నిలకడైన ఫలితాలను సాధిస్తోంది.

టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

07. మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి స్విఫ్ట్ భారత దేశపు అత్యంత విశ్వసనీయైన హ్యాచ్‌బ్యాక్ కారుగా చెరగని ముద్ర వేసుకుంది. దేశీయ మార్కెట్లోకి విడుదలైనప్పటి నుండి నిలకడైన విక్రయాలు సాధిస్తూ వచ్చింది. అయితే, మారుతి గత మూడేళ్ల కాలం నుండి నూతన మరియు అప్‌డేటెడ్ కార్లను ప్రవేశపెట్టడంతో ఆ ప్రభావం స్విఫ్ట్ సేల్స్ మీద పడింది. దీంతో తొలి నాలుగైదు స్థానాల్లో నిలిచే స్విఫ్ట్ ఈ సారి ఏడవ స్థానానికి పడిపోయింది.

గత సెప్టెంబర్ 2017 లో మారుతి దేశవ్యాప్తంగా 13,193 యూనిట్లను విక్రయించింది.

టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

06. మారుతి సుజుకి వితారా బ్రిజా

దేశీయ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో ప్రతి నెలా వచ్చే టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో మారుతి నుండి కేవలం చిన్న కార్లు మాత్రమే స్థానం సంపాదించుకునేవి. అయితే ఈ గత ఏడాది కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి విడుదలైన వితారా బ్రిజా భారీ సేల్స్ ఈ జాబితాలో స్థానం దక్కించుకుంది.

గడిచిన 2017 సెప్టెంబర్ నెలలో మారుతి సుజుకి 13,268 యూనిట్ల వితారా బ్రిజా ఎస్‌యూవీలను విక్రయించింది.

టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

05. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో హ్యుందాయ్ నుండి మరో కారు గ్రాండ్ ఐ10 హ్యాచ్‍‌బ్యాక్ 14,099 యూనిట్ల సేల్స్‌తో ఐదవ స్థానంలో నిలిచింది. హ్యుందాయ్ తమ ఐ10 కారులో భారీ మార్పులు చేసి గ్రాండ్ ఐ10 పేరుతో ప్రవేశపెట్టింది. ఇదే సెగ్మెంట్లో ఉన్న టియాగో, ఇగ్నిస్ మరియు స్విఫ్ట్ నుండి గట్టి పోటీని ఎదుర్కుంటోంది.

టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

04. మారుతి సుజుకి వ్యాగన్ఆర్

బాక్సీ డిజైన్ స్టైల్లో ఉన్న భారతదేశపు ఏకైక హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్. విడుదైలనప్పటి నుండి 20 లక్షలు సేల్స్ మైలురాయిని వ్యాగన్ఆర్ అధిగమించింది. సుమారుగా 17 ఏళ్ల క్రితం పరిచయమైన వ్యాగన్ఆర్ ఇప్పటికీ అత్యుత్తమ విక్రయాలతో టాప్ 10 జాబితాలో నిలుస్తోంది.

గత సెప్టెంబర్ 2017లో మారుతి దేశవ్యాప్తంగా 14,649 వ్యాగన్ఆర్ కార్లను విక్రయించింది.

టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

03. మారుతి సుజుకి బాలెనో

మారుతి సుజుకి ఈ మోడల్ విడుదల చేసినా... అది పెద్ద సంచనళనమే. అందుకు వితారా బ్రిజా తర్వాత మరో ఉదాహరణ బాలెనో. ఇండియన్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోకి విడుదలైన బాలెనో కారు విక్రయాలు స్విఫ్ట్‌ను దాటిపోయాయి.

భారీ డిమాండ్ నేపథ్యంలో దీని మీద వెయిటింగ్ పీరియడ్ కూడా అధికంగానే ఉంది. డిమాండుకు తగ్గ ఉత్పత్తిని చేరుకునేందుకు మారుతి గుజరాత్ ప్లాంటులో ప్రొడక్షన్ పెంచుతోంది. సెప్టెంబర్ 2017 నెలలో 16,328 బాలెనో కార్లు అమ్ముడయ్యాయి.

టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

02. మారుతి సుజుకి ఆల్టో

మారుతి ఆల్టో రెండవ స్థానంలో ఉందేంటని ఆశ్చర్యపోయారా....? నిజమే, మారుతి ఆల్టో 23,830 యూనిట్ల సేల్స్‌తో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో ద్వితీయ స్థానానికే పరిమితమైపోయింది.

టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

01. మారుతి సుజుకి డిజైర్

మారుతి డిజైర్ కాంపాక్ట్ సెడాన్ సెప్టెంబర్ 2017 లో భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. పది వేల కార్ల వ్యత్యాసం ఆల్టోని వెనక్కి నెట్టి 34,305 యూనిట్లతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.

విభిన్న ఇంటీరియర్ ఫీచర్లు, ఇంజన్ ఆప్షన్లు, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ మరియు పూర్తిగా కొత్త డిజైన్‌తో విడుదలైన నూతన డిజైర్ భారీ విక్రయాలు సాధిస్తోంది. డిజైర్ మీద వస్తున్న విపరీతమైన బుకింగ్స్ కారణంగా వెయిటింగ్ పీరియడ్ చాలా పెరిగిపోయింది.

Most Read Articles

English summary
Read In Telugu: Top 10 selling cars in September 2017
Story first published: Thursday, October 12, 2017, 16:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X