ఆంధ్రప్రదేశ్‌లో తొలి డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించిన టయోటా

Written By:

టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ఆంధ్రప్రదేశ్‌లో తమ మొట్టమొదటి మరియు ఇండియాలో ఏడవ డ్రైవింగ్ స్కూల్‌ను నెలకొల్పింది. 2020 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 50 డ్రైవింగ్ స్కూళ్లను ప్రారంభించడంలో భాగంలో కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌లో తొలి డ్రైవింగ్ స్కూల్‌ను ప్రారంభించింది.

ఆంధ్రప్రదేశ్‌లో టయోటా డ్రైవింగ్ స్కూల్

విజయవాడలోని రాధా మాధవ్ టయోటా డీలర్‌షిప్ భాగంలో డ్రైవింగ్ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. సురక్షితమైన కారుతో సురక్షితమైన డ్రైవర్ అనే నినాదంతో, కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వారికి ఉత్తమ శిక్షణ కల్పించడం కోసం టయోటా తమ డ్రైవింగ్ స్కూళ్ల సంఖ్యను పెంచుతున్నట్లు పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌లో టయోటా డ్రైవింగ్ స్కూల్

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఉన్న రాధా మాధవ్ టయోటా డ్రైవింగ్ స్కూటల్‌తో పాటు, కొచ్చి, లక్నో, హైదరాబాద్, చెన్నై, కలకత్తా మరియు ఫరీదాబాద్ వంటి నగరాల్లో సెఫ్టీ మిషన్‌లో భాగంగా మొత్తం ఏడు డ్రైవింగ్ స్కూళ్లను ఏర్పాటు చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో టయోటా డ్రైవింగ్ స్కూల్

విజయవాడ టయోటా డ్రైవింగ్ స్కూల్ ప్రారంభోత్సవంలో ఆంధ్రప్రదేశ్ రవాణా, బిసి మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ అదనపు రవాణా కమీషనర్ పి.శ్రీనివాస్ లతో పాటు, డీలర్ ప్రిన్సిపల్ సుబ్రమణ్యం, రాధా మాధవ్ టయోటా ఎమ్‌డి ఎమ్.వి శ్రీనివాస్ మరియు టయోటా కిర్లోస్కర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ ఎన్. రాజా మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో టయోటా డ్రైవింగ్ స్కూల్

టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్రస్తుతం ఎటియోస్, ఎటియోస్ లివా, ఎటియోస్ క్రాస్, కరోలా ఆల్టిస్, క్యామ్రీ మరియు క్యామ్రీ హైబ్రిడ్ కార్లతో పాటు ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్‌లను దేశీయంగానే ఉత్పత్తి చేస్తోంది. అయితే ప్రాడో, ల్యాండ్ క్రూయిజర్ మరియు ప్రియస్ కార్లను దిగుమతి చేసుకుని విపణిలో విక్రయిస్తోంది. అన్ని టయోటా కార్ల ధరలను ఇక్కడ తెలుసుకోండి....

English summary
Read In Telugu: Toyota Driving School Launched in Vijayawada
Story first published: Saturday, July 8, 2017, 16:37 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark