అతి త్వరలో విడుదల కానున్న కాపాక్ట్ ఎస్‌యూవీలు

Written By:

ఇండియన్ మార్కెట్లోని ఎస్‌యూవీల విభాగం కనీవిని ఎరుగని ఫలితాలు సాధిస్తోంది. తక్కవ ధరతో లభించే స్మాల్ హ్యాచ్‌బ్యాక్ మరియు సెడాన్ కార్లకు ధీటుగా ఎస్‌యూవీ అమ్మకాలు సాగుతున్నాయి.

త్వరలో విడుదల కానున్న కాపాక్ట్ ఎస్‌యూవీలు

ప్రస్తుతం ఎస్‌యూవీల మీద ఇండియాలో పెరుగుతున్న డిమాండ్‌ను అవకాశంగా మార్చుకుని ప్రతి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ విభిన్న డిజైన్, ఫీచర్లు మరియు ఇంజన్‌లతో అనేక ఉత్పత్తులను అభివృద్ది చేస్తున్నాయి. అందులో కొన్ని ఇప్పటికే మార్కెట్‌ను శాసిస్తుండగా, మరికొన్ని ఎస్‌యూవీలు విడుదలకు వరుసగా సిద్దమయ్యాయి.

అతి త్వరలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానున్న కాంపాక్ట్ ఎస్‌యూవీల గురించి నేటి కథనంలో...

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
త్వరలో విడుదల కానున్న కాపాక్ట్ ఎస్‌యూవీలు

టాటా నెక్సాన్

టాటా మోటార్స్ ఈ మధ్యనే నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. నెక్సాన్ విషయంలో ప్రతి ఒక్కరూ సంతోషించదగ్గ విషయం ఏమిటంటే 2014 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద కాన్సెప్ట్ దశలో వచ్చిన నెక్సాన్ ఇప్పుడు ప్రొడక్షన్ దశకు సిద్దమైంది. డిజైన్, స్టైలింగ్ మరియు అద్బుతమైన ఫీచర్లతో రానున్న నెక్సాన్ విడుదల కోసం ఎంతో మంది ఔత్సాహికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

త్వరలో విడుదల కానున్న కాపాక్ట్ ఎస్‌యూవీలు

ప్రస్తుతం కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో దిక్కులేని అమ్మకాలు సాగిస్తున్న మారుతి సుజుకి వితారా బ్రిజా మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ అదే విధంగా మహీంద్రా టియువి300 లకు గట్టి పోటీనివ్వనుంది. అన్ని రకాల కస్టమర్ల ఆదరణ పొందేందుకు నెక్సాన్ 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో రానుంది.

త్వరలో విడుదల కానున్న కాపాక్ట్ ఎస్‌యూవీలు

నెక్సాన్ లోని రెండు ఇంజన్‌లు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభించనున్నాయి. మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ నెక్సాన్ 2018 నాటికి విడుదల కానుంది.

  • విడుదల అంచనా: సెప్టెంబర్ 2017
  • ధర అంచనా: 6.5 లక్షల నుండి 8.5 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ధరతో
త్వరలో విడుదల కానున్న కాపాక్ట్ ఎస్‌యూవీలు

ఫోర్డ్ ఎకోస్పోర్ట్

ఎకోస్పోర్ట్‌ను ఇండియన్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి ఫోర్డ్ తొలిసారి విడుదల చేసింది. సులభమైన హ్యాండ్లింగ్ మరియు రైడింగ్ లక్షణాలను కలిగి ఉన్న ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఆరు ఎయిర్ బ్యాగులతో విడుదలైన తొలినాళ్లలో అత్యుత్తమ విక్రయాలు సాధించింది.

త్వరలో విడుదల కానున్న కాపాక్ట్ ఎస్‌యూవీలు

అనతి కాలంలో మారుతి సుజుకి వితారా బ్రిజా మరియు మహీంద్రా టియువి300 సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీల విడుదలతో ఎకోస్పోర్ట్ తన ప్రాబల్యాన్ని కోల్పోయింది. అయితే ఫోర్డ్ తమ పూర్వ వైభవం కోసం ఎకోస్పోర్ట్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేయడానికి సిద్దమైంది.

త్వరలో విడుదల కానున్న కాపాక్ట్ ఎస్‌యూవీలు

ప్రస్తుతం ఎకోస్పోర్ట్ లభించే అవే ఇంజన్ ఆప్షన్‌లతో ఫేస్‌లిఫ్ట్ మోడల్‍‌ను విడుదల చేయనుంది. అయితే తాజాగా అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం,స ఫోర్డ్ అభివృద్ది చేసిన డ్రాగన్ సిరీస్ పెట్రోల్ ఇంజన్‌లను కూడా ఇందులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

  • విడుదల అంచనా: సెప్టెంబర్-అక్టోబర్ 2017 మధ్య కాలంలో
  • ధర అంచనా: 7 నుండి 10 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ధరతో
త్వరలో విడుదల కానున్న కాపాక్ట్ ఎస్‌యూవీలు

రెనో కప్తుర్

రెనో ఇండియన్ మార్కెట్లో సరికొత్త సెగ్మెంట్ ప్రారంభించడంలో దిట్ట అని చెప్పవచ్చు. దేశీయంగా ఎస్‌యూవీల సెగ్మెంట్‌కు డస్టర్ విడుదలతో ఆజ్యం పోసింది. అయితే పోటీ పెరిగిన నేపథ్యంలో పట్టును కోల్పోయింది. కానీ, మరో కొత్త ఎస్‌యూవీ విడుదలకు సిద్దమైంది. యువ కొనుగోలుదారులను టార్గెట్ చేస్తూ, అత్యుత్తమ డైనమిక్ రైడింగ్ మరియు హ్యాండ్లింగ్ సామర్థ్యం ఉన్న కప్తుర్ ఎస్‌యూవీని అతి త్వరలో విడుదల చేయనుంది.

త్వరలో విడుదల కానున్న కాపాక్ట్ ఎస్‌యూవీలు

అంతర్జాతీయ మార్కెట్లో క్యాప్చర్(Captture) పేరుతో లభించే ఇది ఇండియన్ మార్కెట్లో కప్తుర్(Kaptur)పేరుతో లభించనుంది. డస్టర్‌కు పై స్థానంలో రానున్న ఇది మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు హ్యుందాయ్ క్రెటా లోని కొన్ని టాప్ ఎండ్ వేరియంట్లు మరియు జీప్ కంపాస్ లోని కొన్ని ఎంట్రీ లెవల్ వేరపియంట్లతో పోటీపడనుంది.

త్వరలో విడుదల కానున్న కాపాక్ట్ ఎస్‌యూవీలు

రెనో కప్తుర్ ప్రీమియమ్ ఫీచర్లతో మరియు శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్లతో డస్టర్ ఎస్‌యూవీ ఫ్లాట్‌ఫామ్ మీద అభివృద్ది చేయబడింది. ఇంటీరియర్‌లోని అధునాత ఫీచర్లతో పాటు 2.0-లీటర్ సామర్థ్యం గల ఇంజన్‌లతో రానుంది.

  • విడుదల అంచనా: 2017 చివరి నాటికి
  • ధర అంచనా: 15 నుండి 18 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ధరతో
త్వరలో విడుదల కానున్న కాపాక్ట్ ఎస్‌యూవీలు

మారుతి సుజుకి ఎస్-క్రాస్

అప్ కమింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీల జాబితాలో క్రాసోవర్ వాహనాన్ని ఎందుకు చేర్చారు అని ఆశ్చర్యపోతున్నారా...? నిజమే, అయితే సెడాన్ కారును ఎస్‌యూవీ లక్షణాలతో ఎంచుకునే కస్టమర్ల కోసం మారుతి సుజుకి ఎస్-క్రాస్‌ను అభివృద్ది చేసింది. కాబట్టి ఎస్-క్రాస్‌ను ఈ జాబితాలో చేర్చడం జరిగింది.

త్వరలో విడుదల కానున్న కాపాక్ట్ ఎస్‌యూవీలు

మారుతి ఎస్-క్రాస్ క్రాసోవర్ పెద్ద సంఖ్యలో కస్టమర్లను చేరుకోవడంలో విఫలమైంది. దీంతో ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ రూపంలో రీలాంచ్ చేయడానికి మారుతి సిద్దమైంది. అవే శక్తివంతమైన ఇంజన్‌లతో అధునాత ప్రీమియమ్ ఇంటీరియర్ ఫీచర్లు మరియు ఎక్ట్సీరియర్ డిజైన్ మార్పులతో ఫేస్‌లిఫ్ట్ ఎస్-క్రాస్ విడుదలకు సిద్దమైంది.

త్వరలో విడుదల కానున్న కాపాక్ట్ ఎస్‌యూవీలు

మారుతి ఫేస్‌లిఫ్ట్ ఎస్-క్రాస్‌లో 1.3-లీటర్ మరియు 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌లతో పాటు 110బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల బూస్టర్ ఇంజన్‌ను పరిచయం చేయనుంది. మరియు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు సివిటి(ఆటోమేటిక్) ట్రాన్స్‌మిషన్‌లో కూడా రానుంది.

  • విడుదల అంచనా: ఆక్టోబర్ 2017లో
  • ధర అంచనా: 8 నుండి 10 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ధరతో
త్వరలో విడుదల కానున్న కాపాక్ట్ ఎస్‌యూవీలు

మహీంద్రా కెయువి100

ఈ జాబితాలో ఉన్న ఎస్‌యూవీలతో పోల్చితే మహీంద్రా కెయువి100 ఒక మైక్రో ఎస్‌యూవీ అని చెప్పవచ్చు. యంగ్ ఎస్‌యూవీగా పిలువబడే కెయువి100 విడుదలయ్యి ఇప్పటికి ఏడాదికిపైనే అవుతోంది. ఈ తరుణంలో దీనిని ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్‌ చేయడానికి సమాయత్తమవుతోంది.

హ్యుందాయ్, డాట్సన్ మరియు మహీంద్రా సంస్థలు కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి కొత్త వాహనాలను అభివృద్ది చేసి 2018 లో విడుదల చేయడానికి సిద్దమవుతున్నాయి.

త్వరలో విడుదల కానున్న కాపాక్ట్ ఎస్‌యూవీలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కాంపాక్ట్ ఎస్‌యూవీ భవిష్యత్తులో ప్రతి కంపెనీకి ప్రధాన సెగ్మెంట్‌గా మారనుంది. ఇందుకు అనుగుణంగా ఈ ఏడాది కొన్ని కొత్త కంపెనీలు కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో తమ జాతకాన్ని పరీక్షించుకోనున్నాయి.

ఏదేమైనప్పటికి కస్టమర్లు ఎంచుకోవడానికి విభిన్న ఎస్‌యూవీలు అందుబాటులోకి రానున్నాయి.

English summary
Read In Telugu: Upcoming Compact SUVs In India
Story first published: Monday, August 14, 2017, 13:14 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark