వోక్స్‌వ్యాగన్ కూడా అదే బాటపట్టనుంది

జర్మన్ ప్యాసింజర్ కార్ల దిగ్గజం వోక్స్‌వ్యాగన్ వచ్చే జనవరి 2018 నుండి ఇండియన్ మార్కెట్లో విక్రయించే అన్ని మోడళ్ల మీద ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది.

By Anil

జర్మన్ ప్యాసింజర్ కార్ల దిగ్గజం వోక్స్‌వ్యాగన్ వచ్చే జనవరి 2018 నుండి ఇండియన్ మార్కెట్లో విక్రయించే అన్ని మోడళ్ల మీద ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల పెంపు విషయంలో జపాన్ మరియు దేశీయ దిగ్గజాలు వరుసగా నిర్ణయం తీసుకుంటున్న తరుణంలో వోక్స్‌వ్యాగన్ కూడా తమ నిర్ణయాన్ని తెలిపింది.

ధరల పెంపు బాటలో వోక్స్‌వ్యాగన్

మార్కెట్లో లభించే వివిధ వోక్స్‌వ్యాగన్ కార్ల మీద గరిష్టంగా రూ. 20,000 ల వరకు ధర పెరిగే అవకాశం ఉంది. సవరించబడిన కొత్త ధరలు జనవరి 1, 2018 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.

Recommended Video

This McLaren 720S Costs Only 30 Bitcoins While Others Cost $285,000
ధరల పెంపు బాటలో వోక్స్‌వ్యాగన్

ప్రస్తుతం వోక్స్‌వ్యాగన్ ఇండియా లైనప్‌లో పోలో, వెంటో, టిగువాన్ ఎస్‌యూవీ మరియు కొత్తగా విడుదల చేసిన పస్సాట్ సెడాన్ వంటి మోడళ్లు ఉన్నాయి.

ధరల పెంపు బాటలో వోక్స్‌వ్యాగన్

అంతర్జాతీయంగా రుపాయి విలువ మారకం, దేశీయంగా పెట్టుబడి ఖర్చులు పెరగడం మరియు పలు ఆర్థికపరమైన అంశాల కారణంగా తమ కార్ల మీద ధరల పెంపు అనివార్యమైందని వోక్స్‌వ్యాగన్ చెప్పుకొచ్చింది.

ధరల పెంపు బాటలో వోక్స్‌వ్యాగన్

ఈ మధ్యనే స్కోడా ఆటో కూడా ఇండియన్ మార్కెట్లో ఉన్న తమ అన్ని మోడళ్ల మీద జనవరి 2018 నుండి ధరలు పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీనితో పాటు, ఇసుజు, హోండా మోటార్స్, టయోటా మరియు ఫోర్డ్ వంటి కంపెనీలు కూడా తమ నిర్ణయాన్ని తెలిపాయి.

ధరల పెంపు బాటలో వోక్స్‌వ్యాగన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కార్ల తయారీ కంపెనీలు ప్రతి ఏడాది చివరిలో పాత స్టాకును క్లియర్ చేసుకునేందుకు ఎవో కొన్ని ఆఫర్లు ప్రకటించి విక్రయించేస్తాయి. ఇలా ఆఫర్ల మీద నష్టపోయిన మొత్తాన్ని ఆ తరువాత ఏడాది అంటే జనవరి నెలలో కొన్ని సాకులు చెప్పి కార్ల ధరలను పెంచేస్తాయి. ఏదేమైనుప్పటికీ ఈ పద్దతి కొంత మంది కస్టమర్లకు మేలు చేకూర్చితే మరి కొంత నష్టాన్ని కలిగిస్తుంది.

ధరల పెంపు బాటలో వోక్స్‌వ్యాగన్

Most Read Articles

English summary
Read In Telugu: Volkswagen Car Prices To Increase — Here Are The Details
Story first published: Friday, December 15, 2017, 10:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X