పోటీదారులకు డబుల్ ట్రబుల్: వోక్స్‌వ్యాగన్

Written By:

వోక్స్‌వ్యాగన్ 2017 ఇండియా లైనప్‌ను రివీల్ చేసింది. రెండు కొత్త ప్రీమియమ్ వోక్స్‌వ్యాగన్ వాహనాలు - పస్సాట్ మరియు టిగువాన్ ఎస్‌యూవీ అదే విధంగా 2017 ఏడాదికి పోలో జిటిఐ ను ఆవిష్కరించింది. ఇది పోటీదారులకు రెట్టింపు భయాన్ని సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
వోక్స్‌వ్యాగన్ ఇండియా 2017 లైనప్‌

2017 టిగువాన్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో దేశీయ విడుదలకు సిద్దమవుతోంది. వోక్స్‌వ్యాగన్ ఎమ్‌క్యూబి ఫ్లాట్‌ఫామ్ వేదికగా దీనిని నిర్మించింది.

వోక్స్‌వ్యాగన్ ఇండియా 2017 లైనప్‌

దేశీయ వోక్స్‌వ్యాగ్ టిగువాన్ ఎస్‌యూవీ సాంకేతికంగా 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌తో, 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్ అనుసంధానంతో రానుంది. ప్రీమియమ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఉన్న టయోటా ఫార్చ్యూనర్ తో ఇతర మోడళ్లకు ఇది గట్టి పోటీనివ్వనుంది.

వోక్స్‌వ్యాగన్ ఇండియా 2017 లైనప్‌

వోక్స్‌వ్యాగన్ 2017 ఇండియా లైనప్‌లోకి జోడిస్తున్న మరో మోడల్ పస్సాట్. గత కొంత కాలంగా విపణిలో పస్సాట్‌ను గమనించలేకపోయాము. పస్సాట్ కూడా టిగువాన్ తరహాలో 2.0-లీటర్ డీజల్ ఇంజన్ మరియు 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ అనుసంధానంతో రానుంది.

వోక్స్‌వ్యాగన్ ఇండియా 2017 లైనప్‌

2017 ఇండియాలోకి వోక్స్‌వ్యాగన్ చేర్చిన మరో ఉత్పత్తి పోలో జిటిఐ. శక్తివంతమైన పోలో జిటిఐ వేరియంట్ 1.8-లీటర్ సామర్థ్యం ఉన్న టర్బోఛార్జ్‌డ్ ఇంజన్‌ కలిగి ఉంది. ఇది గరిష్టంగా 189బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

వోక్స్‌వ్యాగన్ ఇండియా 2017 లైనప్‌

వోక్స్‌వ్యాగన్ ఇండియాలో 2017 ఏడాదికి గాను కేవలం 99 యూనిట్ల పోలో జిటిఐ లను అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. మీకు ఇది కావాలంటే స్టాక్ అయిపోయేలోపు డీలర్లను సంప్రదించండి.

 

English summary
Volkswagen Reveals 2017 Lineup For India — Double Trouble Ahead For Rivals
Story first published: Friday, February 24, 2017, 13:00 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark