TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
వోక్స్‌వ్యాగన్ టి-రాక్ ఆవిష్కరణ: ఎలా ఉందో ఓ లుక్కేసుకుందాం రండి
టూ వీలర్ కెటగిరీలో అడ్వెంచర్ మోటార్ సైకిళ్లు ట్రెండింగ్‌గా ఉన్నాయి, అయితే ఫోర్ వీలర్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీ వెహికల్స్ ఇప్పుడు ట్రెండింగ్‌గా నిలిచాయి. ఇండియాలో పర్సనల్ ప్యాసింజర్ వెహికల్ ఎంచుకునే వారిలో కాంపాక్ట్ ఎస్‌యూవీలకే అధికంగా మొగ్గు చూపుతున్నారు.
ఈ నేపథ్యంలో వోక్స్‌వ్యాగన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో టి-రాక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. దీని గురించి పూర్తి వివరాలు నేటి కథనంలో చూద్దాం రండి....
వోక్స్‌వ్యాగన్ టి-రాక్ ఎస్‌యూవీ బోల్డ్ ఫ్రంట్ లుక్‌తో, ఆకర్షణీయమైన ఫ్రంట్ డిజైన్ మరియు వీల్ ఆర్చెస్ ఉన్నాయి. వోక్స్‌వ్యాగన్ దీనిని గోల్ఫ్ ఆధారంగా అభివృద్ది చేసినప్పటికీ, ప్రక్కవైపుల ప్లాస్టిక్ క్లాడింగ్ మరియు ఎత్తైన బాడీతో రూపొందించడం ద్వారా టి-రాక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి వచ్చి చేరింది.
వోక్స్‌వ్యాగన్ టి-రాక్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో మూడు పెట్రోల్ మరియు మూడు డీజల్ మొత్తం ఆరు ఇంజన్ వేరియంట్లలో ప్రవేశపెట్టనుంది.
పెట్రోల్ ఆప్షన్స్
- 1.0-లీటర్ ఇంజన్ 113బిహెచ్‌పి పవర్ మరియు 113ఎన్ఎమ్ టార్క్, 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్, ఫ్రంట్ వీల్ డ్రైవ్.
- 1.5-లీటర్ 113బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల ఇంజన్, 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మరియు ఆప్షనల్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభించనుంది.
- వోక్స్‌వ్యాగన్ టి-రాక్ లో రానున్న మూడువ ఇంజన్ 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 187బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో రానుంది.
- డీజల్ ఇంజన్ వేరియంట్లు
- 113బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.6-లీటర్ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు ఫ్రంట్ వీల్ డ్రైవ్‌తో లభించనుంది.
- 148బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 2.0-లీటర్ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 7-స్పీడ్ ఆటోమేటిక్‌తో పాటు ఆప్షనల్ ఆల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభించనుంది.
- 187బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 2.0-లీటర్ ఇంజన్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌లతో లభించనుంది.
వోక్స్‌వ్యాగన్ టి-రాక్ ఎస్‌యూవీ ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌ను కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దింది. అంతే కాకుండా స్వయంగా వోక్స్‌వ్యాగన్ దీని మీద కస్టమైజేషన్ ఆప్షన్స్ అందిస్తోంది. ఎక్ట్సీరియర్ మీద డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌తో ఎంచుకోవచ్చు.
వోక్స్‌వ్యాగన్ టి-రాక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్‌లో 6.5-అంగుళాల పరిమాణం ఉన్న బేసిక్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. మరియు ఆప్షనల్‌గా 8.0-అంగుళాల పరిమాణం ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటి అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది.
జర్మన్ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ తమ టి-రాక్ ఎస్‌యూవీని డిసెంబర్‌లో ఇంగ్లాండులో విడుదల చేయనుంది. విడుదలకు ముందే, అంటే వచ్చే సెప్టెంబర్‌లో దీని మీద ముందస్తు బుకింగ్స్ ప్రారంభించనుంది. అతి త్వరలో ధరల వివరాలు కూడా వెల్లడించనుంది.
ఇండియాలో వోక్స్‌వ్యాగన్ తమ టి-రాక్ ఎస్‌యూవీ విడుదల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. దేశీయంగా కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో మంచి అవకాశాలు ఉన్న నేపథ్యంలో దీని విడుదల పట్ల సానుకూలత కనిపిస్తోంది.