టిగువాన్ ఎస్‌యూవీ విడుదల తేదీ వెల్లడించిన వోక్స్‌వ్యాగన్

Written By:

జర్మనీకి చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ తమ టిగువాన్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయడానికి సర్వం సిద్దం చేసుకుంది. వోక్స్‌వ్యాగన్ అధికారికంగా వెల్లడించిన వివరాల మేరకు మే 24 న రెండు విభిన్న వేరియంట్లో టిగువాన్‌ను విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‍‌యూవీ విడుదల

టిగువాన్ ఎస్‌యూవీని విడుదల ఖరారు చేస్తూ తమ అధికారిక వెబ్‌‌సైట్లో ఓ టీజర్ విడుల చేసింది. ఐదు మంది కూర్చునే సీటింగ్ లేఔట్‌లో ఉన్న దీనిని వోక్స్‌వ్యాగన్ తమ ఎమ్‌క్యూబి ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా అభివృద్ది చేసింది.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‍‌యూవీ విడుదల

వోక్స్‌వ్యాగన్ అంతర్జాతీయ విపణిలో అందుబాటులో ఉంచిన టిగువాన్ కంటే ఈ కొత్త జనరేషన్ టిగువాన్ 50 కిలోల వరకు తక్కువ బరువుతో ఉంది. ఔరంగాబాద్‌లో ఉన్న వోక్స్‌వ్యాగన్ ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేయనుంది.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‍‌యూవీ విడుదల

గతంలో వోక్స్‌వ్యాగన్ తమ టిగువాన్‌కు రహస్యంగా పరీక్షలు నిర్వహించింది. తాజాగా మహారాష్ట్రోలోని ఔరంగాబాద్‌లో ఉన్న స్కోడా ప్రొడక్షన్ ప్లాంటు సమీపంలో దీనికి రహదారి పరీక్షలు నిర్వహిస్తుండగా మీడియా కంటికి చిక్కింది.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‍‌యూవీ విడుదల

రహస్యంగా లీకయిన ఫోటోల ప్రకారం, టిగువాన్ ఫ్రంట్ డిజైన్‌లో ఎల్ఇడి హెడ్ లైట్లు, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, విశాలమైన ఫ్రంట్ గ్రిల్ మరియు హెడ్ ల్యాంప్స్ చుట్టూ క్రోమ్ సొబగులతో అత్యంత ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంది.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‍‌యూవీ విడుదల

ఇంటీరియర్‌లో ఆల్ బ్లాక్ డ్యాష్ బోర్డ్ కలదు, సెంటర్ కన్సోల్‌ను డ్రైవర్‌ వైపుకు వంచబడినట్లుగా ఉంటుంది. తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అదే విధంగా బాక్స్ ఆకారంలో ఉన్న ఏ/సి వెంట్స్ ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‍‌యూవీ విడుదల

టిగువాన్‌లో ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ ఉన్నట్లుగా స్పష్టం అవుతోంది. మూడు స్పోక్స్ ఉన్న స్టీరింగ్ వీల్ మీద పియానో బ్లాక్ తొడుగులున్న నియంత్రికలు ఉన్నాయి. అధికారికంగా ప్రకటించిన కథనం మేరకు ఇది హైలైన్ మరియు కంఫర్ట్‌లైన్ అనే రెండు వేరియంట్లలో రానుంది.

టిగువాన్ ఎస్‌యూవీలో రానున్న భద్రత ఫీచర్లు

టిగువాన్ ఎస్‌యూవీలో రానున్న భద్రత ఫీచర్లు

  • ఆరు ఎయిర్ బ్యాగులు,
  • యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్(ABD),
  • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్(EBD),
  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రో(ESC),
  • యాంటి స్లిప్ రెగ్యులేషన్(ASR),
  • ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్(EDL).
  • ఇంజన్ డ్రాగ్ టార్క్ కంట్రోల్ సిస్టమ్(EDTC), మరియు
  • అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులున్నాయి.
వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‍‌యూవీ విడుదల

వోక్స్‌వ్యాగన్ టిగువాన్‌లో ప్యానరోమిక్ సన్ రూఫ్, లెథర్ అప్‌హోల్‌స్ట్రే, 3-జోన్ ఎయిర్ కండీషనింగ్, లెథర్ తొడుగుతో ఉన్న స్టీరింగ్ వీల్, ఆటో డిమ్మింగ్ ఐఆర్‌విఎమ్, ఆంబియంట్ లైటింగ్, ఎలక్ట్రిక్ పవర్ ద్వారా ముందు సీట్లను అడ్జెస్ట్ చేసుకునే వంటి ఫీచర్లున్నాయి.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‍‌యూవీ విడుదల

సాంకేతికంగా వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యూవీలో 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల టిడిఐ డీజల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 147బిహెచ్‌పి పవర్ మరియు 330ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‍‌యూవీ విడుదల

ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు అనుసంధానం చేసిన 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ గుండా నాలుగు చక్రాలకు అందుతుంది.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‍‌యూవీ విడుదల

పూర్తి స్థాయిలో వోక్స్‌వ్యాగన్ టిగువాన్ విపణిలోకి విడుదలైతే... హ్యుందాయ్ టక్సన్ మరియు త్వరలో విడుదల కానున్న జీప్ కాంపాస్ ఎస్‌యూవీకు గట్టి పోటీనివ్వగలదు. రూ. 20 లక్షల అంచనా ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‍‌యూవీ విడుదల

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ విడుదల వివరాలను డ్రైవ్‌స్పార్క్ బృందం ప్రత్యేక కవరేజ్‌ చేయనుంది. మే 24, 2017 న టిగువాన్ లాంచ్ వివరాలతో "టిగువాన్ విడుదల" కథనాన్ని ప్రచురిస్తాం. మరిన్ని తాజా ఆటోమొబైల్ అప్‌డేట్స్ తెలుగులో పొందండి....

English summary
Read In Telugu Volkswagen Tiguan India Launch Date Revealed
Story first published: Saturday, May 20, 2017, 15:24 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark