వోక్స్‌వ్యాగన్ వెంటో హైలైన్ ప్లస్ విడుదల: ఇంజన్, ధర ఫీచర్లు మరియు ఇతర వివరాలు...

Written By:

వోక్స్‌వ్యాగన్ దేశీయ సెడాన్ కార్ల విపణిలోకి హైలైన్ ప్లస్ ను విడుదల చేసింది. ఈ హైలైన్ ప్లస్ ధర రూ. 10.84 లక్షలు ఎక్స్ షోరూమ్ (ముంబాయ్) ‌గా ఉంది. వోక్స్‌వ్యాగన్ హైలైన్ ప్లస్ పూర్తి వివరాలు...

వోక్స్‌వ్యాగన్ వెంటో హైలైన్ ప్లస్

సరికొత్త హైలైన్ ప్లస్ మోడల్ వెంటోలోని అన్ని ఇంజన్ వేరియంట్లకు టాప్ స్పెక్ వేరియంట్‌గా అందుబాటులోకి వచ్చింది. వోక్స్‌వ్యాగన్ హైలైన్ ధరలు

  • పెట్రోల్ 1.6 లీటర్ మ్యాన్యువల్ ధర రూ. 10.84 లక్షలు
  • పెట్రోల్ 1.2 లీటర్ ఆటోమేటిక్ ధర రూ. 12.06 లక్షలు
  • డీజల్ 1.5 లీటర్ మ్యాన్యువల్ ధర రూ. 12.20 లక్షలు
  • డీజల్ 1.5 లీటర్ ఆటోమేటిక్ ధర రూ. 13.43 లక్షలు
వోక్స్‌వ్యాగన్ వెంటో హైలైన్ ప్లస్

వెంటో లోని హైలైన్ వేరియంట్‌తో పోల్చితే హైలైన్ ప్లస్ ట్రిమ్‌లో అదనపు ఫీచర్లు ఉన్నాయి,.అందులో, ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్ మరియు పగటి పూట వెలిగే లైట్లు, అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్ మీద ఇండికేటర్లు, 3డి ఎఫెక్ట్ గల టెయిల్ లైట్లు, మరియు జిర్కోనియా అల్లాయ్ వీల్స్ కలవు.

వోక్స్‌వ్యాగన్ వెంటో హైలైన్ ప్లస్

ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో రియర్ ఏ/సి వెంట్స్, ఆటో డిమ్మింగ్ రియర్ వ్యూవ్ మిర్రర్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్లు మరియు కూల్డ్ గ్లూవ్ బాక్స్ వంటి ఫీచర్లు కలవు.

వోక్స్‌వ్యాగన్ వెంటో హైలైన్ ప్లస్

వోక్స్‌వ్యాగన్ గ్రూప్ సేల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ థియరీ లెస్పియాక్ మాట్లాడుతూ, ప్రస్తుతం వోక్స్‌వ్యాగన్ ఇండియా లైనప్‌లోని వెంటోకు కొనసాగింపుగా దీనిని అందుబాటులోకి తెచ్చినట్లు వివరించాడు.

ఇంజన్ వివరాలు

ఇంజన్ వివరాలు

సాధారణ వెంటోలో ఉన్న ఇంజన్ ఆప్షన్లే ఇందులో కూడా ఉన్నాయి. వెంటో హైలైన్ ప్లస్ ట్రిమ్‌లో 1.2-లీటర్ సామర్థ్యం (1197సీసీ) గల పెట్రోల్ ఇంజన్ కలదు కేవలం ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో మాత్రమే లభించే ఇది గరిష్టంగా 103బిహెచ్‌పి పవర్ మరియు 175ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

వోక్స్‌వ్యాగన్ వెంటో హైలైన్ ప్లస్

వెంటో హైలైన్ ప్లస్ ట్రిమ్ లోని మరో పెట్రోల్ వేరియంట్ 1.6-లీటర్ సామర్థ్యంతో లభిస్తోంది. కేవలం మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే ఎంచుకోగల ఇది గరిష్టంగా 103బిహెచ్‌పి పవర్ మరియు 153ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

వోక్స్‌వ్యాగన్ వెంటో హైలైన్ ప్లస్

వెంటో హైలైన్ ప్లస్ ట్రిమ్ లో 1.5-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ కలదు. మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లతో ఎంచుకోగల ఇది గరిష్టంగా 108బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

English summary
Also Read In Telugu: Volkswagen Vento Highline Plus Launched In India; Prices Start At Rs 10.84 Lakh

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark