వర్చస్ సెడాన్ రివీల్ చేసిన వోక్స్‌వ్యాగన్: ఇంజన్, స్పెసిఫికేషన్స్, ఫోటోలు

Written By:

జర్మన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్ ఆధారిత వర్చస్ సెడాన్ కారును తాజాగా బ్రెజిల్ మార్కెట్లో మొట్టమొదటిసారిగా ఆవిష్కరించింది. వోక్స్‌వ్యాగన్ యొక్క విన్నూత ఎమ్‌క్యూబి(AO) ఫ్లెక్సిబుల్ ఫ్లాట్‌ఫామ్ మీద, 2017 వోక్స్‌వ్యాగన్ పోలో ఆధారంగా నిర్మించింది.

వోక్స్‌వ్యాగన్ వర్చస్

ఆధునిక మోడళ్లను అభివృద్ది చేస్తున్న ఎమ్‌క్యూబి వేదిక మీద విశాలమైన ఇంటీరియర్ స్పేస్‍‌తో పొడవాటి వీల్ బేస్(2,650ఎమ్ఎమ్)తో నిర్మించబడింది. అత్యధిక క్యాబిన్ స్పేస్‌తో పెద్దలందరూ సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. మరియు గరిష్టంగా 521-లీటర్ల స్టోరేజ్ స్పేస్ కలదు.

Recommended Video - Watch Now!
[Telugu] 2017 Skoda Octavia RS Launched In India - DriveSpark
వోక్స్‌వ్యాగన్ వర్చస్

వోక్స్‌వ్యాగన్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని ప్రతి విపణిలో రాణించేందుకు సెడాన్ వెర్షన్‌లో మరొ కొత్త లెవల్ ప్రొడక్ట్‌ను వర్చస్ పేరుతో MQB ఫ్లాట్‌ఫామ్ మీద డెవలప్ చేసింది.

వోక్స్‌వ్యాగన్ వర్చస్

వర్చస్ డిజైన్ మరియు స్టైల్ గురించి మాట్లాడితే, ఫ్రంట్ డిజైన్ మరియు సైడ్ ప్రొఫైల్ చూడటానికి అచ్చం నెక్ట్స్ జనరేషన్ పోలో హ్యాచ్‌బ్యాక్‌ను పోలి ఉంటుంది. అయితే, పొడవాటి వీల్ బేస్(ముందు మరియు వెనుక చక్రాల మధ్య ఉన్న దూరం) మరియు వెడల్పాటి వెనుక డోర్లతో వర్చస్ సెడాన్ పొడవుగా ఉన్నట్లు కనిపిస్తుంది.

వోక్స్‌వ్యాగన్ వర్చస్

అదే విధంగా వోక్స్‌వ్యాగన్ వర్చస్ లోని బంపర్లు చాలా విభిన్నంగా ఉంటాయి. మృదువైన ఫ్లోటింగ్ క్యారెక్టర్ లైన్స్, ఫాగ్ ల్యాంప్స్ మరియు క్రోమ్ సొబగులతో ఫ్రంట్ బంపర్ నుండి బానెట్ డోర్ వరకు ఉన్న డిజైన్ ఎంతో అట్రాక్టివ్‌గా ఉంది.

వోక్స్‌వ్యాగన్ వర్చస్

వర్చస్ ప్రీమియమ్ సెడాన్ ఇంటీరియర్‌లో ఫ్రీమియమ్ ఫీల్ కలిగించే ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. ఆధునిక టెక్నాలజీ నిండిన అత్యాధునిక డ్యాష్ బోర్డ్ మరియు టాప్ ఎండ్ వేరియంట్లో రెండు డిజిటల్ స్క్రీన్లు ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ వర్చస్

బ్రెజిల్ విపణిలో ఆవిష్కరించిన వోక్స్‌వ్యాగన్ వర్చస్ రెండు ఇంజన్ వేరియంట్లలో లభిస్తోంది. అవి, 115బిహెచ్‌పి పవర్ మరియు 162ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.6-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్, మరియు 126బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 1.0-లీటర్ 3-సిలిండర్ల టుర్బో పెట్రోల్ ఇంజన్.

వోక్స్‌వ్యాగన్ వర్చస్

ట్రాన్స్‌మిషన్ పరంగా 1.6 లీటర్ ఇంజన్‌లో 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ మరియు 1.0 లీటర్ ఇంజన్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ అనుసంధానంతో ఉన్నాయి. అయితే, రెండింటిలో మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అస్సలు రాలేదు.

వోక్స్‌వ్యాగన్ వర్చస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వోక్స్‌వ్యాగన్ డిజైనింగ్ విభాగంలో బాగా ప్రాచుర్యం పొందిన MQB ఫ్లాట్‌ఫామ్ నుండి అన్ని అవకాశాలను ఉపయోగించుకుని, అధునిక కాలంలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫీచర్లు మరియు లగ్జరీ ఫీల్ కలిగించే ఇంటీరియర్‌తో వోక్స్‌వ్యాగన్ వర్చస్ ప్రపంచ విపణిలోకి పరిచయం అయ్యింది.

వోక్స్‌వ్యాగన్ వర్చస్

ఇప్పటి వరకు వర్చస్ సెడాన్ ఇండియా విడుదల గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ప్రీమియమ్ సెడాన్ సెగ్మెంట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వోక్స్‌వ్యాగన్ ఖచ్చితంగా వర్చస్ సెడాన్‌ను స్కోడాకు పోటీగా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: Volkswagen Polo-Based Virtus Sedan Revealed; Specifications, Features & Images
Story first published: Saturday, November 18, 2017, 17:59 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark