ఈ ఏడాది విడుదలకు సిద్దమైన అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్-10 కార్లు

Written By:

భారతీయులు మైలేజ్ ప్రియులు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బైకులు, స్కూటర్లు మరియు కార్లు ఏ వాహనమైనా కొనే ముందు ప్రతి ఒక్కరూ విచారించే మొదటి అంశం మైలేజ్. మైలేజ్ ప్రియులను ఆకట్టుకోవడానికి విపణిలో ఇప్పటికే ఎన్నో కార్లు ఉన్నాయి.

అయితే, మరో నాలుగైదు నెలల్లో పండుగ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలు విపణిలోకి కొత్త మోడళ్లను మరియు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లను లాంచ్ చేయడానికి సిద్దమయ్యాయి. అందులో అత్యధిక మైలేజ్ ఇవ్వగల పది కొత్త కార్ల గురించి మరియు వాటి విడుదల వివరాలను నేటి కథనంతో డ్రైవ్‌స్పార్క్ తెలుగు మీ కోసం తీసుకొచ్చింది.

బెస్ట్ మైలేజ్ ఇచ్చే పది అప్ కమింగ్ కార్ల కోసం....

అప్‌కమింగ్ బెస్ట్ మైలేజ్ కార్లు

10. 2018 మారుతి సుజుకి వ్యాగన్ఆర్

భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఒకటి. ఇండియన్ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో మరియు మారుతి సుజుకి ఇండియాకు వ్యాగన్ఆర్ అత్యధిక సేల్స్ సాధించిపెడుతోంది. డిజైన్ మరియు ఇంటీరియర్ అంశాల పరంగా భారీ మార్పులు చేర్పులతో కొత్త తరం వ్యాగన్ఆర్ విడుదలకు సిద్దమవుతోంది.

అప్‌కమింగ్ బెస్ట్ మైలేజ్ కార్లు

ప్రస్తుతం విపణిలో ఉన్న వ్యాగన్ఆర్ టాల్ బాయ్ హ్యాచ్‌బ్యాక్‌లో 1.0 లీటర్ కెపాసిటి గల కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఏఆర్ఏఐ ప్రకారం, దీని గరిష్ట మైలేజ్ లీటర్‌కు 20.51కిలోమీటర్లుగా ఉంది. అయితే, కొత్త తరం మారుతి వ్యాగన్ఆర్‌ కారులో ట్యూనింగ్ చేయబడిన ఇంజన్ రానుండటంతో మైలేజ్ పాళ్లు కొద్దిమేర పెరిగే అవకాశం ఉంది.

అప్‌కమింగ్ బెస్ట్ మైలేజ్ కార్లు

09. టాటా టియాగో యాక్టివ్

టాటా మోటార్స్ దివాళా తీసే పరిస్థితుల్లో ఉన్నపుడు చివరి ప్రయత్నంగా ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా టియాగో స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. టాటా ఊహించని విధంగా టియాగో అనూహ్యమైన విజయం సాధించింది. విపణిలో ఉన్న మారుతి సెలెరియో మీద ధీటైన పోటీనిస్తూ, టాటాకు అత్యధిక విక్రయాలు సాధించి పెడుతోంది.

అప్‌కమింగ్ బెస్ట్ మైలేజ్ కార్లు

టియాగో మీద ఉన్న ప్రజాదరణను కొనసాగించేందుకు టియాగో క్రాసోవర్ వెర్షన్ టియాగో యాక్టివ్ విడుదలకు ఏర్పాట్లు చేసుకుంటోంది. టియాగో యాక్టివ్ ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌దలో అదనపు సొబగులు మరియు క్రోమ్ మేళవింపులతో అత్యంత ఆకర్షణీయమైన శైలిలో రానుంది. సాంకేతికంగా ఇందులో అవే మునుపటి రివట్రాన్ మరియు రివోటార్క్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో లభించనుంది. ఏఆర్ఏఐ మేరకు వీటి మైలేజ్ పెట్రోల్- 20కిమీ/లీ, డీజల్- 25కిమీ/లీ. టియాగో యాక్టివ్‌లో కూడా ఇదే మైలేజ్ రావచ్చు.

Recommended Video - Watch Now!
2018 మారుతి న్యూ స్విఫ్ట్ విడుదల | Maruti Swift 2018 - Full Specifications, Features - DriveSpark
అప్‌కమింగ్ బెస్ట్ మైలేజ్ కార్లు

08. ఫోర్డ్ ఫ్రీస్టైల్

ఫోర్డ్ ఇండియా అతి త్వరలో ఫ్రీస్టైల్ క్రాసోవర్ ఎస్‌యూవీని విడుదల చేయడానికి సిద్దమైంది. ఫిగో హ్యాచ్‌బ్యాక్ ఆధారిత క్రాసోవర్ ఎస్‌యూవీ. యువ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని వస్తోన్న ఫోర్డ్ ఫ్రీస్టైల్‌లో అత్యాధునిక ఫీచర్లు వస్తున్నాయి.

అప్‌కమింగ్ బెస్ట్ మైలేజ్ కార్లు

ఫోర్డ్ ఫ్రీస్టైల్ సాంకేతికంగా, 1.2-లీటర్ డ్రాగన్ సిరీస్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ టుర్బో-ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌లతో లభ్యం కానుంది. అత్యుత్తమ పవర్ మరియు టార్క్ ప్రొడ్యూస్ చేయగల ఈ ఇంజన్‌లు ఫోర్డ్ ఫిగో తరహా మైలేజ్ ఇవ్వగలవు.

అప్‌కమింగ్ బెస్ట్ మైలేజ్ కార్లు

07. ఫోర్డ్ ఫిగో ఫేస్‌లిఫ్ట్

ఇండియన్ హ్యాచ్‌బ్యాక్ కార్ల సెగ్మెంట్లో మారుతి స్విఫ్ట్ తరువాత అత్యంత ఆదరణ కలిగి ఉన్న కారు ఫోర్డ్ ఫిగో. కాస్మొటిక్ అప్‌డేట్స్, ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ పరంగా మార్పులు చేర్పులతో పాటు కొత్త ఫీచర్లను అందించి ఫిగో హ్యాచ్‌బ్యాక్‌ను ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ చేయడానికి ఫోర్డ్ ఇండియా సన్నద్దమవుతోంది.

అప్‌కమింగ్ బెస్ట్ మైలేజ్ కార్లు

సాంకేతికంగా ఫోర్డ్ ఫిగో ఫేస్‌లిఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ అవే మునుపటి పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యం కానుంది. అయితే, మునుపటి 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ స్థానంలోకి అత్యుత్తమ పవర్ ఇవ్వగల కొత్త తరం 1.2-లీటర్ డ్రాగన్ సిరీస్ పెట్రోల్ ఇంజన్ రానుంది. అత్యుతమ మైలేజ్ మరియు పనితీరు దీని సొంతం. దీనితో పాటు,1.5-లీటర్ టుర్బో-ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ రానుంది. ఏఆర్ఏఐ మేరకు దీని మైలేజ్ లీటర్‌కు 23కిమీలుగా ఉంది.

అప్‌కమింగ్ బెస్ట్ మైలేజ్ కార్లు

6. ఫోర్డ్ ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్

ఫోర్డ్ ఇండియా లైనప్‌లో ఉన్న శక్తివంతమైన కాంపాక్ట్ సెడాన్ ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్‌లో కూడా 1.2-లీటర్ డ్రాగన్ సిరీస్ పెట్రోల్ ఇంజన్ వస్తోంది. అదనంగా, ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో పలు కాస్మొటిక్ అప్‌డేట్స్ మరియు ఇంటీరియర్ ఫీచర్ల జోడింపుతో సహా అదే మునుపటి 1.5-లీటర్ డీజల్ ఇంజన్ కొనసాగింపుగా వస్తోంది.

అప్‌కమింగ్ బెస్ట్ మైలేజ్ కార్లు

5. హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్

హోండా జాజ్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ అతి త్వరలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ అవనుంది. ఎక్ట్సీరియర్ పరంగా స్వల్ప డిజైన్ మార్పులు మరియు నూతన ఫీచర్లతో సిద్దమవుతోంది. అయితే, సాంకేతికంగా అవే 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లతో రానుంది. ఏఆర్ఏఐ ప్రకారం, ప్రస్తుతం హోండా జాజ్ డీజల్ వేరియంట్ లీటర్‌కు 27.3కిలోమీటర్ల ఇస్తోంది.

అప్‌కమింగ్ బెస్ట్ మైలేజ్ కార్లు

4. హోండా అమేజ్ డీజల్

హోండా మోటార్స్ ఇండియన్ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లోకి కొత్త తరం అమేజ్ సెడాన్ కారును విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రస్తుతం విపణిలో ఉన్న డీజల్ వెర్షన్ అమేజ్ సెడాన్ భారతదేశపు అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్ల జాబితాలో ఉంది. అవే మైలేజ్ అంశాలతో కొత్త తరం అమేజ్ కారును అభివృద్ది చేసింది. ఇప్పటికే దీనిని ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్ పో 2018లో ఆవిష్కరించారు. అమేజ్ డీజల్ గరిష్ట మైలేజ్ 25.8కీమీ/లీ.

అప్‌కమింగ్ బెస్ట్ మైలేజ్ కార్లు

3. టాటా నెక్సాన్ డీజల్ ఆటోమేటిక్

ఈ ఏడాది విపణిలోకి విడుదలయ్యే అత్యధిక మైలేజ్ ఇవ్వగల కార్లలో నెక్సాన్ డీజల్ ఆటోమేటిక్ ఒకటి. టాటా మోటార్స్ తమ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని అతి త్వరలో డీజల్ వెర్షన్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్లో విడుదల చేయనుంది. తరువాత దశలో పెట్రోల్ వెర్షన్‌ను కూడా ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో విడుదల చేయనుంది. ప్రస్తుతానికి, మ్యాన్యువల్ వేరియంట్ నెక్సాన్ డీజల్ మైలేజ్ లీటరుకు 22కిలోమీటర్లుగా ఉంది. ఆటోమేటిక్ వేరియంట్లో కూడా దాదాపు ఇదే మైలేజ్ సాధ్యం కానుంది.

అప్‌కమింగ్ బెస్ట్ మైలేజ్ కార్లు

2. మారుతి సుజుకి సియాజ్ డీజల్ ఫేస్‌లిఫ్ట్

ఇటీవల కాలంలో ఇండియన్ మిడ్ సైజ్ సెడాన్ కార్ల విడుదల జోరందుకుంది. గత ఏడాదిలో కొత్త తరం హోండా సిటి, హ్యుందాయ్ వెర్నా మరియు స్కోడా ర్యాపిడ్ కార్లు అప్‌డేటెడ్ వెర్షన్‌లో లాంచ్ అయ్యాయి. వీటికి పోటీగా, మారుతి తమ సియాజ్ కారును ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేయడానికి సిద్దమైంది.

అప్‌కమింగ్ బెస్ట్ మైలేజ్ కార్లు

సాంకేతికంగా, ఇందులో అదే మునుపటి 1.3-లీటర్ కెపాసిటి గల డిడిఐఎస్ డీజల్ ఇంజన్ రానుంది. అదనంగా సుజుకి వారి ఎస్‌హెచ్‌విఎస్(SHVS) హైబ్రిడ్ టెక్నాలజీని ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చు. ఏఆర్ఏఐ ప్రకారం, మారుతి సియాజ్ డీజల్ వేరియంట్ మైలేజ్ లీటరుకు 28.09కిలోమీటర్లుగా ఉంది.

అప్‌కమింగ్ బెస్ట్ మైలేజ్ కార్లు

1. కొత్త తరం మారుతి ఎర్టిగా డీజల్

మారుతి సుజుకి ఈ ఏడాది ఆగష్టులో కొత్త తరం ఎర్టిగా ఎమ్‌పీవీని లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది. ఈ అప్‌కమింగ్ ఎర్టిగా ఎమ్‌పీవీ అవే మునుపటి పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో రానుంది. వీటిలో డీజల్ ఇంజన్ ఎర్టిగా అత్యధిక మైలేజ్‌నిచ్చే ఎమ్‌పీవీని కోరుకునే ఫ్యామిలీ కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకోనుంది. ఏఆర్ఏఐ ప్రకారం ప్రసుత ఎర్టిగా డీజల్ వేరియంట్ మైలేజ్ లీటరుకు 24.52కిమీలుగా ఉంది.

ఈ ఎస్‌యూవీలు భారతదేశపు మైలేజ్ ఛాంపియన్లు

1. ఈ ఎస్‌యూవీలు భారతదేశపు మైలేజ్ ఛాంపియన్లు

2.భారీ మైలేజ్‌నిచ్చే 14 బెస్ట్ డీజల్ కార్లు

3.మ్యాన్యువల్ కార్ల కంటే అధిక మైలేజ్ ఇస్తున్న ఆటోమేటిక్ కార్లు

4.స్పేర్ వీల్‌ను స్టెప్నీ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?

5.మంచి రీసేల్ వ్యాల్యూ ఉన్న బైకులు

English summary
Read In Telugu: 10 upcoming high-mileage cars of India: Maruti WagonR to Honda Amaze

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark