పెట్రోల్ ప్రియులను టార్గెట్ చేసిన వితారా బ్రిజా పెట్రోల్ ఎస్‌యూవీ

భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఇటీవల ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో లాంచ్ చేసింది. దీనికి కొనసాగింపుగా, పెట్రోల్ ప్రియుల కోసం వితారా బ్రిజా ఎస్‌యూవీని పెట్రోల్ వెర్షన్‌లో లాంచ్ చే

By Anil Kumar

మారుతి సుజుకి 2016లో లాంచ్ చేసిన వితారా బ్రిజా దేశీయ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ సెగ్మెంట్లోకి కాస్త ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ, ఫోర్డ్ ఇకోస్పోర్ట్ మరియు టాటా నెక్సాన్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది.

పెట్రోల్ ప్రియులను టార్గెట్ చేసిన వితారా బ్రితా పెట్రోల్ ఎస్‌యూవీ

విపరీతమైన సేల్స్ సాధిస్తున్న భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఇటీవల ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో లాంచ్ చేసింది. దీనికి కొనసాగింపుగా, పెట్రోల్ ప్రియుల కోసం వితారా బ్రిజా ఎస్‌యూవీని పెట్రోల్ వెర్షన్‌లో లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

పెట్రోల్ ప్రియులను టార్గెట్ చేసిన వితారా బ్రితా పెట్రోల్ ఎస్‌యూవీ

విడుదలకు ఎంతగానో ఎదురుచూస్తున్న మారుతి సుజుకి వితారా బ్రిజా పెట్రోల్ ఎస్‌యూవీ గురించి ఎవ్వరికీ తెలియని ఐదు ముఖ్యమైన విషయాల గురించి కంప్లీట్ డిటైల్స్ ఇవాళ్టి స్టోరీలో....

పెట్రోల్ ప్రియులను టార్గెట్ చేసిన వితారా బ్రితా పెట్రోల్ ఎస్‌యూవీ

5. సరికొత్త 1.5-లీటర్ పెట్రోల్ డీజల్

పెట్రోల్ తాగే వితారా బ్రిజా ఎస్‌యూవీలో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ వస్తోంది. ఈ సరికొత్త కె15బి 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 104బిహెచ్‌పి పవర్ మరియు 138ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

పెట్రోల్ ప్రియులను టార్గెట్ చేసిన వితారా బ్రితా పెట్రోల్ ఎస్‌యూవీ

ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం సియాజ్ మరియు ఎర్టిగా కార్లలో ఉన్న కె14 1.4-లీటర్ పెట్రోల్ ఇంజన్ స్థానాన్ని భర్తీ చేస్తుంది. కొత్త తరం మారుతి ఎర్టిగా ఎమ్‌పీవీ మరియు సియాజ్ ఫేస్‌లిఫ్ట్ కార్లలో కూడా రానుంది.

పెట్రోల్ ప్రియులను టార్గెట్ చేసిన వితారా బ్రితా పెట్రోల్ ఎస్‌యూవీ

4. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్

మారుతి సుజుకి తమ వితారా బ్రిజా డీజల్ ఎస్‌యూవీని ఆటోమేటిక్ వేరియంట్లో లాంచ్ చేసి టాటా నెక్సాన్ డీజల్ ఏఎమ్‌టి వేరియంట్‌కు పోటీనిచ్చినట్లు, విపణిలో ఉన్న నెక్సాన్ పెట్రోల్ ఏఎమ్‌టి మరియు ఫోర్డ్ ఇకోస్పోర్ట్ పెట్రోల్ ఏఎమ్‌టి మోడళ్లకు పోటీగా వితారా బ్రిజా పెట్రోల్‌ ఎస్‌యూవీలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పరిచయం చేయనుంది.

పెట్రోల్ ప్రియులను టార్గెట్ చేసిన వితారా బ్రితా పెట్రోల్ ఎస్‌యూవీ

అప్‌కమింగ్ మారుతి వితారా బ్రిజా పెట్రోల్ ఎస్‌యూవీ 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధనంతో లభించే అవకాశం ఉంది. బ్రిజా పెట్రోల్ ఏఎమ్‌టి పూర్తి స్థాయిలో లాంచ్ అయితే, మారుతి వితారా బ్రిజాను రెండు రకాల ఇంజన్ మరియు రెండు రకాల ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో ఎంచుకోవచ్చు.

పెట్రోల్ ప్రియులను టార్గెట్ చేసిన వితారా బ్రితా పెట్రోల్ ఎస్‌యూవీ

3. హైబ్రిడ్

తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, అప్ కమింగ్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ సుజుకి వారి మైక్రో-హైబ్రిడ్ టెక్నాలజీని అందిస్తున్న తెలిసింది. ఈ హైబ్రిడ్ టెక్నాలజీని తొలుత సియాజ్ డీజల్‌లో ఈ టెక్నాలజీ పరిచయం చేసిన మారుతి, ఆ తరువాత ఎర్టిగా ఎమ్‌పీవీలో ప్రవేశపెట్టింది.

పెట్రోల్ ప్రియులను టార్గెట్ చేసిన వితారా బ్రితా పెట్రోల్ ఎస్‌యూవీ

స్మార్ట్ హైబ్రిడ్-టెక్నాలజీని పరిచయం చేసిన మోడళ్లు సాధారణ మోడళ్ల కంటే ఎక్కువ మైలేజ్ ఇవ్వడంతో మారుచి సుజుకి లైనప్‌లో హైబ్రిడ్ టెక్నాలజీతో లభించే మోడళ్లకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్ంలో విపరీతమన ప్రజాదరణ లభిస్తున్న వితారా బ్రిజా ఎస్‌యూవీలో పెట్రోల్ ఇంజన్‌తో పాటు హైబ్రిడ్ టెక్నాలజీ కూడా అందివ్వనుంది.

పెట్రోల్ ప్రియులను టార్గెట్ చేసిన వితారా బ్రితా పెట్రోల్ ఎస్‌యూవీ

2. స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు

భద్రత ఫీచర్లు అధికంగా ఉన్న కాంపాక్ట్ ఎస్‌యూవీలకే కస్టమర్లు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మారుతి తమ బ్రిజా ఎస్‌యూవీలో మూడు కీలకమైన సేఫ్టీ ఫీచర్లను అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా అందిస్తోంది. అవి - యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్లు.

పెట్రోల్ ప్రియులను టార్గెట్ చేసిన వితారా బ్రితా పెట్రోల్ ఎస్‌యూవీ

ఈ మూడు ఫీచర్లు అప్‌కమింగ్ మారుతి వితారా బ్రిజా పెట్రోల్ వెర్షన్‌లో తప్పనిసరిగా రానున్నాయి. త్వరలో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న నూతన భద్రత ప్రమాణాలు కూడా వితారా బ్రిజా పెట్రోల్ వెర్షన్‌ను మరింత సురక్షితమైన ఎస్‌యూవీగా తీర్చిదిద్దనున్నాయి.

పెట్రోల్ ప్రియులను టార్గెట్ చేసిన వితారా బ్రితా పెట్రోల్ ఎస్‌యూవీ

1. టయోటా షోరూమ్‌లో కూడా లభిస్తుంది

సుజుకి మోటార్ కంపెనీ మరియు టయోటా సంస్థలు దేశీయంగా ఉమ్మడి భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాయి. ఇందులో భాగంగా టయోటా కిర్లోస్కర్ మోటార్ వితారా బ్రిజా, బాలెనో మరియు సియాజ్ కార్లను టయోటా డీలర్ల ద్వారా విక్రయించనుంది.

పెట్రోల్ ప్రియులను టార్గెట్ చేసిన వితారా బ్రితా పెట్రోల్ ఎస్‌యూవీ

అదే విధంగా మారుతి సుజుకి కరోలా ఆల్టిస్ సెడాన్ మరియు టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని మారుతి బ్రాండ్ పేరుతో తమ డీలర్ల ద్వారా విక్రయించనుంది. కాబట్టి, వితారా బ్రిజా పెట్రోల్ ఎస్‌యూవీ టయోటా డీలర్ల వద్ద లభించే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇరు సంస్థల ఉమ్మడి భాగస్వామ్యంతో పలుకొత్త మోడళ్లను అభివృద్ది చేయనున్నాయి.

Source: Cartoq

Most Read Articles

English summary
Read In Telugu: 5 things you don’t know about the upcoming Maruti Brezza petrol compact SUV
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X