ఆటో ఎక్స్‌పో 2018: బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 పెట్రోల్ వెర్షన్ విడుదల

Written By:
Recommended Video - Watch Now!
Mahindra TUV Stinger Concept First Look; Details; Specs - DriveSpark

ఆటో ఎక్స్‌పో 2018: బిఎమ్‌డబ్ల్యూ ఇండియన్ మార్కెట్లోకి ఎక్స్6 ఎక్స్‌డ్రైవ్ 35ఐ ఎమ్ స్పోర్ట్(BMW X6 xDrive35i M Sport) కారును విడుదల చేసింది. ఎక్స్6 ఎక్స్‌డ్రైవ్35ఐ ఎమ్ స్పోర్ట్ ప్రారంభ ధర రూ. 94.15 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉన్నట్లు బిఎమ్‌డబ్ల్యూ ప్రతినిధులు పేర్కొన్నారు.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ఇండియా లైనప్‌లో ఎక్స్‌డ్రైవ్35ఐ ఎమ్ స్పోర్ట్ నూతన పెట్రోల్ వెర్షన్‌ అని వివరించారు.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 పెట్రోల్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ఎక్స్‌డ్రైవ్35ఐ ఎమ్ స్పోర్ట్ కేవలం 6.4 సెకండ్ల వ్యవధిలో గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుంకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 240కిలోమీటర్లుగా ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 పెట్రోల్

ఎక్స్‌డ్రైవ్35ఐ ఎమ్ స్పోర్ట్ వేరియంట్లో లాంచ్ కంట్రోల్ సిస్టమ్ మరియు గేర్ షిఫ్ట్‌లను నియంత్రించడానికి ఎక్స్6 వేరియంట్లో ప్రత్యేకంగా పెడల్ షిఫ్టర్స్ అందివ్వడం జరిగింది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 పెట్రోల్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ఎక్స్‌డ్రైవ్35ఐ ఎమ్ స్పోర్ట్ డిజైన్ పరంగా చూడటానికి ఎక్స్6 రెగ్యులర్ మోడల్‌నే పోలి ఉంటుంది. అయితే, ఈ ఎమ్ స్పోర్ట్ ప్యాకేజీతో వచ్చిన ఎక్స్6 ఎక్ట్సీరియర్‌లో కొన్ని అదనపు డిజైన్ సొబగులు ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 పెట్రోల్

సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ ఎమ్ స్పోర్ట్ ప్యాకేజి వెర్షన్‌లో అధునాతన అడాప్టివ్ హెడ్‌లైట్లు, 20-అంగుళాల అల్లాయ్ వీల్, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్, ఎక్కువ గాలినే గ్రహించే పెద్ద ఎయిర్ డ్యామ్ మరియు ఇరు ప్రక్కలా అదనపు క్యారెక్టర్ లైన్స్ ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 పెట్రోల్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ఎక్స్‌డ్రైవ్35ఐ ఎమ్ స్పోర్ట్ ఇంటీరియర్‌లో లెథర్ అప్‌‌హోల్‌స్ట్రే, ఎలక్ట్రిక్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ స్పోర్ట్స్ సీట్లు, లెథర్ తొడుగు గల స్టీరింగ్ వీల్, ఇంటీరియర్‌లో అల్యూమినియం ఫినిషింగ్ మరియు ఎమ్ లోగోతో ఫినిషింగ్ చేయబడిన డోర్లు ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 పెట్రోల్

సేఫ్టీ పరంగా బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ఎక్స్‌డ్రైవ్35ఐ ఎమ్ స్పోర్ట్ కారులో ఆరు ఎయిర్ బ్యాగులు, డైనమిక్ స్టెబిలిటి కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, ఆటో హోల్డ్ గల ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ వెహికల్ ఇమ్మొబిలైజర్, క్రాష్ సెన్సార్లు మరియు ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 పెట్రోల్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ఎక్స్‌డ్రైవ్35ఐ ఎమ్ స్పోర్ట్ పెట్రోల్ వేరియంట్ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ఎస్‌యూవీ యొక్క కూపే క్రాసోవర్. ఎక్స్‌డ్రైవ్40జి వేరియంట్ తరహా వెంటనే స్పందించకపోవచ్చు. ధర విషయానికి వస్తే, డీజల్‌తో పోల్చుకుంటే 30 లక్షలు తక్కువగా ఉంది.

English summary
Read In Telugu: Auto Expo 2018: BMW X6 xDrive35i M Sport Launched At Rs 94.15 Lakh
Story first published: Sunday, February 11, 2018, 11:45 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark