అతి తక్కువ ధరలో లభించే ఆటోమేటిక్ కార్లు

Written By:

ప్రతి ఒక్కరి లైఫ్‌లో కార్లు కామన్ అయిపోయాయి. సౌకర్యం, అవసరం, హోదా, హుందా మరియు లగ్జరీ లైఫ్‌ ఇలా ఎన్నో అంశాలకు అనుగుణంగా కార్లను ఎంచుకునే కస్టమర్లు ఉన్నారు. అయితే కార్లంటే ఇష్టం ఉన్నవారు చాలా సులభంగా డ్రైవ్ చేస్తారు. కానీ అప్పుడప్పుడే డ్రైవింగ్ నేర్చుకున్న వారు మరియు సిటీ లైఫ్‌లో కారు నడపడానికి జంకే వారు గేర్లు వేయడంలోనే తడబడతారు.

Recommended Video - Watch Now!
High Mileage Cars In India - DriveSpark
చీపెస్ట్ ఆటోమేటిక్ కార్లు

ఇది ఏ ఒకరు లేదా ఇద్దరి సమస్య కాదు. రద్దీతో కూడిన నగరాల్లోని ప్రతి ఒక్కరి సమస్య. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చిన ప్రత్యామ్నాయమే ఆటోమేటిక్ గేర్‍‌బాక్స్. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లో వేగాన్ని బట్టి ఆటోమేటిక్‌గా గేర్లు మారిపోతాయి. ఇలాంటి గేర్‌బాక్స్ ఖరీదైన కార్లలో మాత్రమే ఉంటాయని భావిస్తారు. నిజానికి ప్రతి చిన్న కారులో కూడా ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్ అందుబాటులోకి వచ్చింది.

ఇవాళ్టి స్టోరీలో ఇండియన్ మార్కెట్లో ఉన్న అతి తక్కువ ధరలో లభించే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కార్లు, వాటి ఇంజన్ మరియు ధరల వివరాలు తెలుసుకుందాం రండి...

చీపెస్ట్ ఆటోమేటిక్ కార్లు

11. టాటా జెస్ట్

టాటా మోటార్స్ విపణిలోకి ప్రవేశపెట్టిన జెస్ట్ కాంపాక్ట్ సెడాన్ కారులోని డీజల్ ఇంజన్ వెర్షన్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ కలదు. జెస్ట్ సెడాన్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే, డీజిల్‌లోని XMA మరియు XTA వేరియంట్లో మాత్రమే ఏమ్‌టి అందిస్తోంది.

చీపెస్ట్ ఆటోమేటిక్ కార్లు

సాంకేతికంగా జెస్ట్ సెడాన్ 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.25-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌లతో లభ్యమవుతోంది. టాటా జెస్ట్ సెడాన్ ధరల శ్రేణి రూ. 5.29 లక్షల నుండి రూ. 8.7 లక్షల మధ్య ఉంది.

 • టాటా జెస్ట్ డీజల్ ఆటోమేటిక్ మైలేజ్: 20.65కిమీ/లీ
చీపెస్ట్ ఆటోమేటిక్ కార్లు

10. నిస్సాన్ మైక్రా

జపాన్ దిగ్గజం నిస్సాన్ తమ మైక్ర హ్యాచ్‌బ్యాక్ కారును పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌లతో మొత్తం ఐదు విభిన్న వేరియంట్లలో విక్రయిస్తోంది.

చీపెస్ట్ ఆటోమేటిక్ కార్లు

నిస్సాన్ మైక్రాలోని అన్ని పెట్రోల్ ఇంజన్ వేరియంట్లు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తున్నాయి. నిస్సాన్ మైక్రా ప్రారంభ వేరియంట్ ధర రూ. 5.99 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 7.43 లక్షలుగా ఉంది.

 • నిస్సాన్ మైక్రా పెట్రోల్ ఆటోమేటిక్ మైలేజ్: 19.34కిమీ/లీ
చీపెస్ట్ ఆటోమేటిక్ కార్లు

9. హోండా బ్రియో

జపాన్ దిగ్గజం హోండా బ్రియో హ్యాచ్‌బ్యాక్ కారును నాలుగు విభిన్న వేరియంట్లలో కేవలం పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తోంది. ఇందులోని శక్తివంతమైన 1.2-లీటర్ ఐవిటిఇసి పెట్రోల్ ఇంజన్ 87బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

చీపెస్ట్ ఆటోమేటిక్ కార్లు

హోండా సిటి నుండి సేకరించిన 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను బ్రియోలోని టాప్ ఎండ్ వేరియంట్లో అందించారు. టాప్ ఎండ్ వేరియంట్ బ్రియో ధర రూ. 6.9 లక్షలు మరియు ప్రారంభ వేరియంట్ బ్రియో ధర రూ. 4.81 లక్షలుగా ఉంది.

 • హోండా బ్రియో పెట్రోల్ ఆటోమేటిక్ మైలేజ్: 16.5కిమీ/లీ
చీపెస్ట్ ఆటోమేటిక్ కార్లు

8. 2018 మారుతి స్విఫ్ట్

ఈ జాబితాలో అతి ముఖ్యమైన మరియు అత్యధిక ఆదరణ ఉన్న కార్లలో 2018 మారుతి స్విఫ్ట్ ఒకటి. మారుతి సుజుకి ఫిబ్రవరి 8, 2018న ఆటో ఎక్స్‌పోలో సరికొత్త థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను లాంచ్ చేసింది. ఇది పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వెర్షన్‌లతో పాటు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లో లభ్యమవుతోంది.

చీపెస్ట్ ఆటోమేటిక్ కార్లు

2018 మారుతి స్విఫ్ట్ 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లతో లభ్యమవుతోంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభించే స్విఫ్ట్ ధరల శ్రేణి రూ. 4.99 లక్షల నుండి రూ. 8.29 లక్షల మధ్య ఉంది.

 • మారుతి స్విఫ్ట్ పెట్రోల్ ఆటోమేటిక్ మైలేజ్: 22కిమీ/లీ
 • మారుతి స్విఫ్ట్ డీజల్ ఆటోమేటిక్ మైలేజ్: 28.4కిమీ/లీ
చీపెస్ట్ ఆటోమేటిక్ కార్లు

7. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

హ్యుందాయ్ మోటార్స్ గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ కారును విపణిలో పోటీగా నిలిచిన మారుతి మరియు హోండా కార్లను ఎదుర్కునేందుకు 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చింది. అంతే కాకుండా పోటీగా కార్లకు ఏ మాత్రం సాధ్యం కానీ ఎన్నో అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

చీపెస్ట్ ఆటోమేటిక్ కార్లు

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 1.2-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో లభ్యమవుతోంది. అయితే, కేవలం పెట్రోల్ వేరియంట్లో మాత్రమే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కలదు. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ధరల శ్రేణి రూ. 4.72 లక్షల నుండి రూ. 7.49 లక్షల మధ్య ఉంది.

 • హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 పెట్రోల్ ఆటోమేటిక్ మైలేజ్: 17.49కిమీ/లీ
చీపెస్ట్ ఆటోమేటిక్ కార్లు

6. మారుతి సుజుకి సెలెరియో

భారత్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పొందిన మొట్టమొదటి కారు మారుతి సుజుకి సెలెరియో. మారుతి అత్యంత సరసమైన ధరతో ఆటోమేటిక్ వెర్షన్ సెలెరియో కారును ఇండియన్ కస్టమర్లకు పరిచయం చేసింది. మారుతి సెల్లింగ్ కార్లలో సెలెరియో ఒకటి. ఇటీవల మారుతి సెలెరియో ఎక్స్ ఎడిషన్‌ను విపణిలోకి విడుదల చేసింది.

చీపెస్ట్ ఆటోమేటిక్ కార్లు

మారుతి సెలెరియో మరియు సెలెరియో ఎక్స్ ఎడిషన్ రెండింటిలో కూడా అదే 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభ్యమవుతోంది. సెలెరియో ధరల శ్రేణి రూ. 4.32 లక్షల నుండి రూ. 5.51 లక్షల మధ్య మరియు సెలెరియో ఎక్స్ ఎడిషన్ ధరల శ్రేణి రూ. 4.74 లక్షల నుండి రూ. 5.59 లక్షల మధ్య ఉన్నాయి.

 • మారుతి సెలెరియో పెట్రోల్ ఆటోమేటిక్ మైలేజ్: 23.1కిమీ/లీ
చీపెస్ట్ ఆటోమేటిక్ కార్లు

5. టాటా టియాగో

టాటా మోటార్స్ సరిగ్గా రెండేళ్ల క్రితం ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన టియాగో హ్యాచ్‌బ్యాక్‌తో ఊహించని విజయాన్ని అందుకుంది. ఒకానొక దశలో మారుతి సెలెరియో సేల్స్‌నే వెనక్కి నెట్టేసింది. టియాగో హ్యాచ్‌బ్యాక్‌ను పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లతో ధరకు తగ్గ విలువలతో తీసుకొచ్చింది.

చీపెస్ట్ ఆటోమేటిక్ కార్లు

టాటా టియాగో 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.05-లీటర్ డీజల్ ఇంజన్‌లతో లభ్యమవుతోంది. అయితే, టియాగోలోని పెట్రోల్ వెర్షన్ మాత్రమే ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ కలదు. టాటా టియాగో ధరల శ్రేణి రూ. 3.37 లక్షల నుండి రూ. 5.95 లక్షల మధ్య ఉన్నాయి.

 • టాటా టియాగో పెట్రోల్ ఆటోమేటిక్ మైలేజ్: 23.84కిమీ/లీ
చీపెస్ట్ ఆటోమేటిక్ కార్లు

4. డాట్సన్ రెడి-గో

అత్యంత సరసమైన కార్ల తయారీ సంస్థగా పేరుగాంచిన జపాన్ దిగ్గజం డాట్సన్ ఇండియన్ మార్కెట్లో ఉన్న ఆల్టో 800కు పోటీగా రెడి-గో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. దీని మీద వచ్చిన ఆదరణకు క్రమానుగతంగా రెడి-గో కారులో శక్తివంతమైన 1.0-లీటర్ ఇంజన్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పరిచయం చేసింది.

చీపెస్ట్ ఆటోమేటిక్ కార్లు

రెడి-గో లోని 800సీసీ మరియు 1000సీసీ ఇంజన్‌లను మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను రెనో క్విడ్ నుండి సేకరించారు. డాట్సన్ రెడి-గో ధరల శ్రేణి రూ. 2.49 లక్షల నుండి రూ. 3.96 లక్షల మధ్య ఉంది.

 • డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ పెట్రోల్ ఆటోమేటిక్ మైలేజ్: 23కిమీ/లీ
చీపెస్ట్ ఆటోమేటిక్ కార్లు

3. రెనో క్విడ్

ఫ్రెంచ్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం రెనో భారత్‌లోని ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్ల మార్కెట్‌ను శాసించే లక్ష్యంతో సరిగ్గా 2015 చివరిలో క్విడ్ కారును ఆల్టో 800కు పోటీగా లాంచ్ చేసింది. తొలుత 800సీసీ ఇంజన్‌తో వచ్చిన క్విడ్ తరువాత 1.0-లీటర్ పెట్రోల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు పలు స్పెషల్ ఎడిషన్‌లలో లాంచ్ అయ్యింది.

చీపెస్ట్ ఆటోమేటిక్ కార్లు

విడుదలైన అనతి కాలంలోనే క్విడ్ రెనో ఇండియాకు బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. రెనో క్విడ్ ధరల శ్రేణి రూ. 2.78 లక్షల నుండి రూ. 4.7 లక్షల మధ్య ఉంది. రెనో క్విడ్ ఆటోమేటిక్ లభించే వేరియంట్లు - 1.0 RXL AMT, 1.0 RXT AMT Opt మరియు క్లైంబర్ 1.0 AMT.

 • రెనో క్విడ్ పెట్రోల్ 1.0లీ ఆటోమేటిక్ మైలేజ్: 24.04కిమీ/లీ
చీపెస్ట్ ఆటోమేటిక్ కార్లు

2. మారుతి ఆల్టో కె10

భారతదేశపు రెండవ చీపెస్ట్ కారు ఆల్టో కె10. ఆల్టో 800 విజయానికి కొనసాగింపుగా 1.0-లీటర్ ఇంజన్‌తో ఆల్టో కె10 కారును ప్రవేశపెట్టింది. మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి ఆల్టో కారును ప్రవేశపెట్టినప్పటి నుండి 20 లక్షలకు పైగా అమ్ముడయ్యాయి.

చీపెస్ట్ ఆటోమేటిక్ కార్లు

ప్రస్తుతం మారుతి ఆల్టో కె10 పెట్రోల్ మరియు సిఎన్‌జి ఇంజన్ వేరియంట్లలో లభ్యమవుతోంది. అయితే, కేవలం ఆల్టో కె10 టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రమే ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్ ఉంది. ఆల్టో కె10 ధరల శ్రేణి రూ. 3.45 లక్షల నుండి రూ. 4.3 లక్షల మధ్య ఉంది.

 • మారుతి ఆల్టో కె10 ఆటోమేటిక్ మైలేజ్: 24.07కిమీ/లీ
చీపెస్ట్ ఆటోమేటిక్ కార్లు

1. టాటా నానో

కారు కొనాలనుకునే ప్రతి సామాన్యుడి కలను నిజం చేసేందుకు రతన్ టాటా ప్రతిష్టాత్మకంగా నానో కారును విపణిలోకి ప్రవేశపెట్టారు. అతి తక్కువ ఇంజన్ కెపాసిటీతో నలుగురు ప్రయాణించే టాటా నానో కారు ప్రారంభ ధర రూ. 2.37 లక్షలు మాత్రమే.

చీపెస్ట్ ఆటోమేటిక్ కార్లు

624సీసీ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభ్యమవుతోంది. నానో ఆటోమేటిక్ XMA మరియు XTA వేరియంట్లలో లభిస్తోంది. వీటి ధరలు వరుసగా రూ. 311 లక్షలు మరియు రూ. 3.29 లక్షలుగా ఉన్నాయి.

 • టాటా నానో పెట్రోల్ ఆటోమేటిక్ మైలేజ్: 21.9కిమీలు

గమనిక: అన్ని ధరలు ఎక్స్-షోరూమ్‌గా ఇవ్వబడ్డాయి.

English summary
Read In Telugu: Cheapest Automatic Cars in India

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark