ఇక మీదట ట్రాఫిక్ పోలీసుల చేతికి చిక్కితే పేటిఎమ్ వాలెట్ యూజ్ చేయండి

By Anil Kumar

దేశంలో ఇ-వాలెట్స్ వినియోగం బాగా ప్రాచుర్యం పొందింది. దీంతో నగదు రహిత లావాదేవీలు ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారాయి. తాజాగా, ట్రాఫిక్ పోలీస్ విభాగాం చలానా వసూలు చేసేందుకు ఇ-వాలెట్ టెక్నాలజీని అందిపుచ్చుకుంది.

ఇక మీదట ట్రాఫిక్ పోలీసుల చేతికి చిక్కితే పేటిఎమ్ వాలెట్ యూజ్ చేయండి

అవును, చెన్నై ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు పేటీఎం ద్వారా ఫైన్లు కట్టించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లో నగదు రహిత లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీస్ శాఖ ఆదాయాన్ని పెంచేందుకు ఆ శాఖ అధికారులు పేటిఎమ్ వంటి దిగ్గజ ఇ-వాలెట్‌‌ను ఆశ్రయించారు.

ఇక మీదట ట్రాఫిక్ పోలీసుల చేతికి చిక్కితే పేటిఎమ్ వాలెట్ యూజ్ చేయండి

తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడితే పేటీఎం వాలెట్ యాప్ ద్వారా ట్రాఫిక్ చలానా చెల్లించవచ్చు. గతంలో, దేశీయంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లోని పోలీసులు ఫైన్లను వసూలు చేసేందుకు కార్డ్ పేమెంట్స్ అంగీకరించినట్లు తెలిసింది.

ఇక మీదట ట్రాఫిక్ పోలీసుల చేతికి చిక్కితే పేటిఎమ్ వాలెట్ యూజ్ చేయండి

తాజాగా, చెన్నై ట్రాఫిక్ పోలీసులు ఫైన్ల వసూలు చేసేందుకు మరో ముందడు వేసి, విరివిగా వినియోగంలో ఉన్న మొబైల్ యాప్ ఆధారిత ఇ-వాలెట్ వినియోగాన్ని చేపట్టింది. పేటీఎం పేమెంట్ చేసేందుకు చలానా మీద ఉన్న క్యూఆర్-కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది. ఈ తరహా ఇ-వాలెట్ వినియోగంలోకి వస్తే లంచాలకు ముగింపు పడనుంది.

ఇక మీదట ట్రాఫిక్ పోలీసుల చేతికి చిక్కితే పేటిఎమ్ వాలెట్ యూజ్ చేయండి

నిజానికి ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించే వారి మీద సగటున సుమారుగా రూ. 500 నుండి రూ. 1,000 ల వరకు జరిమానా విధిస్తుంటారు. కానీ, కొంత మంది ప్రజలు ఫిక్ పోలీసులకు ఎంతో కొంత లంచం ఇవ్వజూపి ఈ మొత్తం జరిమానా కట్టకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు.

ఇక మీదట ట్రాఫిక్ పోలీసుల చేతికి చిక్కితే పేటిఎమ్ వాలెట్ యూజ్ చేయండి

కార్డుల ద్వారా జరిమానా వసూలు చేసేందుకు సుమారుగా 300 వరకు కార్డు స్వైపింగ్ మెషీన్లను అందజేశారు. అయితే, చలానా వ్యవస్థను మరింత పారదర్శకంగా మలిచేందుకు ఇప్పుడు నగదు రహిత లావాదేవీలను ఆశ్రయించింది. ఇది లంచ వ్యవస్థను నిర్మూలించడమే కాకుండా, ప్రజలు తమకు సులువైన మార్గాల్లో చలానా చెల్లించేందుకు సహాయపడుతుంది.

ఇక మీదట ట్రాఫిక్ పోలీసుల చేతికి చిక్కితే పేటిఎమ్ వాలెట్ యూజ్ చేయండి

ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వారిని ఇక మీదట ట్రాఫిక్ పోలీసులు అడ్డుకోరు. దీనికి బదులుగా, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వాహనాలను సీసీటీవి కెమెరాలు గుర్తించి, ఆ వాహనాలు రిజిస్టర్ అయిన అడ్రస్‍‌కు చలానా వెళుతుంది. అందుబాటులో ఉన్న వివిధ రకాల నగదు రహిత లావాదేవీల ఆధారంగా జరిమానా చెల్లించవచ్చు.

ఇక మీదట ట్రాఫిక్ పోలీసుల చేతికి చిక్కితే పేటిఎమ్ వాలెట్ యూజ్ చేయండి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ట్రాఫిక్ చలానాలను వసూలు చేసేందుకు ఇ-వాలెట్లను ఉపయోగించేందుకు చెన్నై పోలీసులు తీసుకున్న నిర్ణయం హర్షించదగినది. ట్రాఫిక్ చలానా వసూళ్లలో జరిగే అక్రమాలకు ముగింపు పలకడమే కాకుండా, ప్రతిసారీ రోడ్డు నియమాలను ఉల్లంఘించేవారిలో ఈ నిర్ణయం మార్పును తీసుకొస్తుంది. చెన్నైతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మరిన్ని ఇతర నగరాల్లో కూడా నగదు రహిత జరిమానా చెల్లింపుల కోసం ఇ-వాలెట్ విధానం అందుబాటులోకి వస్తే ఎంతో బాగుంటుంది.

Source: TheHindu

Most Read Articles

English summary
Read In Telugu: Traffic Police To Go Cashless — Now Pay Traffic Challan Through PayTM
Story first published: Saturday, May 12, 2018, 10:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X