ప్రమాదానికి గురైన క్యామ్రీ కారును షోరూమ్‌లో ప్రదర్శనకు ఉంచిన టయోటా డీలర్

ముందు మరియు వెనుక వైపున నుజ్జునుజ్జయిన కారును షోరూమ్‌లో అందరికీ కనబడేలా ప్రదర్శనకు ఉంచాడు. ప్రమాదానికి గురైన కార్లను ఉంచడానికి స్థలం లేకపోవడంతో ఇలా చేయలేదు. టయోటా ఇంజనీరింగ్ మరియు సేఫ్టీని వివరించేందు

By Anil Kumar

కార్ల షోరూమ్‌లో డర్టీ కార్లను చూద్దాం అన్నా కనబడవు. షోరూమ్ నిర్వాహకులు అయితే కస్టమర్లను ఆకట్టుకునేందుకు షోరూమ్‌లో ఉన్న కార్లను చాలా శుభ్రంగా తళతళ మెరిసేలా ఉంచుతారు. సేల్స్ పెంచుకోవడానికి ఇంత కంటే మంచి మార్గం ఉంటుందా.....? ఎవ్వరూ ఊహించ సాధ్యం కానీ ఆలోచనలో ముందుకొచ్చాడు ఓ టయోటా డీలర్.

నుజ్జునుజ్జయిన కారును షోరూమ్‌లో ప్రదర్శించిన టయోటా డీలర్

ముందు మరియు వెనుక వైపున నుజ్జునుజ్జయిన కారును షోరూమ్‌లో అందరికీ కనబడేలా ప్రదర్శనకు ఉంచాడు. ప్రమాదానికి గురైన కార్లను ఉంచడానికి స్థలం లేకపోవడంతో ఇలా చేయలేదు. టయోటా ఇంజనీరింగ్ మరియు సేఫ్టీని వివరించేందుకు ఈ ఏర్పాటు చేసాడు.

నుజ్జునుజ్జయిన కారును షోరూమ్‌లో ప్రదర్శించిన టయోటా డీలర్

ఇక్కడున్న 2018 టయోటా క్యామ్రీ అరిజోనాలో ఉన్న పర్ల్ స్కై హార్బర్ ఎయిర్‌పోర్ట్ మార్గంలో ప్రమదానికి గురయ్యింది. ఈ కారును అరిజోనా టయోటా డీలర్ ఉద్యోగి నడుపుతుండగా భారీ రోడ్డు ప్రమాదానికి గురయ్యింది.

నుజ్జునుజ్జయిన కారును షోరూమ్‌లో ప్రదర్శించిన టయోటా డీలర్

క్యామ్రీ కారును వెనుక నుండి ఓ ట్రక్కు వచ్చి ఢీకొట్టడంతో కారుకు ఎదురుగా ఉన్న మరో ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఇరు ట్రక్కుల మధ్య కారు ఇరుక్కుపోవడంతో ముందు మరియు వెనుక భాగాలు నుజ్జునుజ్జయిపోయాయి. అయితే, కారులో ఉన్న డ్రైవర్ మరియు మరో ప్రయాణికుడు సురక్షితంగా బయటపడ్డారు.

నుజ్జునుజ్జయిన కారును షోరూమ్‌లో ప్రదర్శించిన టయోటా డీలర్

ప్రమాదానికి గురైన టయోటా క్యామ్రీ కారును నడిపిన రమోన్ సూరెజ్ మాట్లాడుతూ, కారు అప్పటికే చాలా వేగంతో ఉంది, సడెన్‌గా అదుపు తప్పిన ఓ ట్రక్కు వెనుక నుండి ఢీకొట్టడంతో ఎదురుగా ఉన్న ట్రక్కు ముందుకు కారు దూసుకెళ్లింది. ఈ క్రమంలో కారుకు ముందు మరియు వెనుక వైపున ప్రమాదం తీవ్రంగా అధికంగా ఉంది. ఏదేమైనప్పటికీ, టయెటా నిర్మాణ నాణ్యత మమ్మల్ని ఎలాంటి గాయాలపాలు కాకుండా సురక్షితంగా రక్షించిందని చెప్పుకొచ్చాడు.

నుజ్జునుజ్జయిన కారును షోరూమ్‌లో ప్రదర్శించిన టయోటా డీలర్

క్యామ్రీ కారుకు ముందు మరియు వెనుక ఇరువైపులా ప్రమాద తీవ్రత కారణంగా లోపలికి అతుక్కుపోయింది. అయినప్పటికీ, ప్రమాదం తీవ్రత క్యాబిన్ దరి చేరలేదు. ప్రయాణికులు ఉన్న క్యాబిన్ మీద ప్రమాద లక్షణాలు ఏ మాత్రం లేకపోవడం గమనార్హం.

నుజ్జునుజ్జయిన కారును షోరూమ్‌లో ప్రదర్శించిన టయోటా డీలర్

టయోటా క్యామ్రీ ప్రేమ్ మరియు క్రంపల్ జోన్స్ నిర్మాణం అద్భుతం అని చెప్పాలి. ముందు వైపున కూడా బానెట్ మరియు ఇంజన్ సెక్షన్ వరకు మాత్రమే యాక్సిడెంట్ ఫోర్స్ వచ్చింది. ముందు అద్దం కూడా చెక్కు చెదరలేదు.

నుజ్జునుజ్జయిన కారును షోరూమ్‌లో ప్రదర్శించిన టయోటా డీలర్

త్రీవంగా డ్యామేజ్ అయిన కారు రిపేరీ చేయడానికి కూడా కుదరదు. కాబట్టి, పనికిరాని కారును పక్కన పడేయకుండా... చాలా తెలివిగా తన షోరూమ్‌లోనే ప్రదర్శనకు ఉంచి, టయోటా క్యామ్రీ కారును ఎంచుకునే కస్టమర్లకు క్యామ్రీ సేఫ్టీ గురించి వివరిస్తున్నాడు. పోయింది ఒక్క కారు మాత్రమే, కానీ దీని ద్వారా క్యామ్రీ కార్ల సేల్స్ మాత్రం ఆ షోరూములో బాగా పెరిగినట్లు తెలిసింది.

నుజ్జునుజ్జయిన కారును షోరూమ్‌లో ప్రదర్శించిన టయోటా డీలర్

ఇండియన్ మార్కెట్లో, టయోటా క్యామ్రీ హైబ్రిడ్ అందుబాటులో ఉంది. పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ జోడింపుతో లభ్యమవుతోంది. 2.5-లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 142బిహెచ్‌పి పవర్ మరియు 213ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానంతో దీని పవర్ మరియు టార్క్ 202బిహెచ్‌పి మరియు 270ఎన్ఎమ్ వరకు పెరుగుతుంది. ఈ ఇంజన్‌కు ఇ-సివిటి ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు.

నుజ్జునుజ్జయిన కారును షోరూమ్‌లో ప్రదర్శించిన టయోటా డీలర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఆటోమోటివ్ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు వాణిజ్యపరమైన ప్రకటనలు ఇస్తాయి. చాలా కంపెనీల కార్లను ప్రమోట్ చేసేందుకు సెలబ్రిటీలను వాడుకోవడం లేదా ఫ్యాన్యీ వీడియో అడ్వర్టైజ్‌మెంట్ చేస్తుంటాయి. దీనికి చాలా ఖర్చు మరియు సమయం అవసరం.

నుజ్జునుజ్జయిన కారును షోరూమ్‌లో ప్రదర్శించిన టయోటా డీలర్

ఏదేమైనప్పటికీ, ఈ టయోటా అరిజోనా డీలర్ చాలా విభిన్నంగా ఆలోచించాడు. ఈ డీలర్ చేసిన పనితో చాలా సులువుగా క్యామ్రీ మోడల్‌కు బ్రాండింగ్ లభించింది. రానున్న నెలల్లో ఈ షోరూమ్‌లో క్యామ్రీ సేల్స్ ఖచ్చితంగా ఊపందుకుంటాయని చెప్పవచ్చు.

Most Read Articles

English summary
Read In Telugu: A Toyota Camry Crashed In Arizona, USA — Dealership Displays The Car To Showcase Its Safety
Story first published: Monday, May 28, 2018, 13:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X