ప్రభుత్వం ఇచ్చిన ఎలక్ట్రిక్ కార్లను వాడేందుకు ససేమిరా అంటున్న అధికారులు

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) ప్రభుత్వ అధికారులకు టాటా టిగోర్ ఇవి మరియు మహీంద్రా ఇవెరిటో ఎలక్ట్రిక్ కార్లను సరఫరా చేసింది. అయితే, తాజాగా అందిన సమాచారం మేరకు ప్ర

By Anil Kumar

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) ప్రభుత్వ అధికారులకు టాటా టిగోర్ ఇవి మరియు మహీంద్రా ఇవెరిటో ఎలక్ట్రిక్ కార్లను సరఫరా చేసింది. అయితే, తాజాగా అందిన సమాచారం మేరకు ప్రభుత్వ అధికారులు ఈ ఎలక్ట్రిక్ కార్లను వినివియోగించడాన్ని తిరస్కరిస్తున్నారని తెలిసింది.

ప్రభుత్వం ఇచ్చిన ఎలక్ట్రిక్ కార్లను ససేమిరా అంటున్న అధికారులు

ప్రజలు స్వచ్ఛందంగా ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసే దిశగా చైతన్యపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే, కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే అధికారులకు పెట్రోల్ మరియు డీజల్ కార్లకు బదులుగా EESL సహకారంతో ఎలక్ట్రిక్ కార్లను సరఫరా చేసింది.

ప్రభుత్వం ఇచ్చిన ఎలక్ట్రిక్ కార్లను ససేమిరా అంటున్న అధికారులు

అయితే, ఆశించిన పనితీరు కనబరచడం లేదని ప్రభుత్వ అధికారులు ఈ టాటా టిగోర్ ఇవి మరియు మహీంద్రా ఇవెరిటో ఎలక్ట్రిక్ కార్లను వినియోగించేందుకు తిరస్కరిస్తున్నట్లు తెలిసింది.ఎలక్ట్రిక్ వాహనాల నియమ నిభందనలకు సంభందించిన అధికారి ప్రకారం, ఈ కార్లు సింగల్ ఛార్జింగ్ మీద 80-82కిమీల మైలేజ్ కూడా ఇవ్వలేకపోతున్నాయి. అంతే కాకుండా, బ్యాటరీ సామర్థ్యం కూడా చాలా తక్కువగా ఉన్నట్లు తెలిసింది.

ప్రభుత్వం ఇచ్చిన ఎలక్ట్రిక్ కార్లను ససేమిరా అంటున్న అధికారులు

ఎలక్ట్రిక్ కార్ల కోసం EESL టెండర్లకు ఆహ్వానించినపుడు, ఎలక్ట్రిక్ కార్లు - ఏఆర్ఏఐ గుర్తింపు పొందిన, సింగల్ ఛార్జింగ్‌తో 130కిలోమీటర్ల మైలేజ్, గరిష్ట వేగం గంటకు 80కిమీలు అదే విధంగా 0 నుండి 60కిమీల వేగాన్ని 13 సెకండ్లలో అందుకోవాలని పేర్కొంది.

ప్రభుత్వం ఇచ్చిన ఎలక్ట్రిక్ కార్లను ససేమిరా అంటున్న అధికారులు

టాటా టిగోర్ ఇవి మరియు మహీంద్రా ఇవెరిటో రెండు ఎలక్ట్రిక్ కార్లలో కూడా 17kW బ్యాటరీ ఉంది మరియు సింగల్ ఛార్జింగ్‌ మీద దీని డ్రైవింగ్ రేంజ్ 100-120కిలోమీటర్ల వరకు ఉండాలి. అయితే, తక్కువ పర్ఫామెన్స్ మరియు మైలేజ్‌తో ఈ కార్లు ఇబ్బంది పెడుతున్నాయని ప్రభుత్వ అధికారులు కథనం.

ప్రభుత్వం ఇచ్చిన ఎలక్ట్రిక్ కార్లను ససేమిరా అంటున్న అధికారులు

EESLతో జరిగిన ఒప్పందం ప్రకారం, తొలి దశ క్రింద టాటా మోటార్స్ మరియు మహీంద్రా కంపెనీలు వరుసగా 150 మరియు 350 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేశాయి. 2019లో ఇరు సంస్థలు కలిసి ఏకంగా 9,500 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లను సరఫరా చేయనున్నాయి.

ప్రభుత్వం ఇచ్చిన ఎలక్ట్రిక్ కార్లను ససేమిరా అంటున్న అధికారులు

కానీ, తాజాగా ఈ కార్లను ఉపయోగిస్తున్న ప్రభుత్వ అధికారులు మరియు ఉన్నత స్థాయి ఉద్యోగులు లేవనెత్తిన సమస్యల దృష్ట్యా చూస్తే భవిష్యత్తులో టాటా మరియు మహీంద్రా సరఫరా చేయాల్సిన ఎలక్ట్రిక్ కార్ల డెలివరీ పట్ల EESL ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా అనుమానాలు ఎదురవుతున్నాయి.

ప్రభుత్వం ఇచ్చిన ఎలక్ట్రిక్ కార్లను ససేమిరా అంటున్న అధికారులు

ప్రభుత్వ ఉద్యోగులు టాటా టిగోర్ ఇవి మరియు మహీంద్రా ఇవెరిటో ఎలక్ట్రిక్ కార్లను వద్దనడానికి ఛార్జింగ్ స్టేషన్లు కొరతను కూడా లేవనెత్తినట్లు తెలిసింది. ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లు లేకుండా బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్ చేయడం అసంభవం. ఈ కార్లు తక్కువ మైలేజ్ ఇవ్వడానికి ఇదీ ఒక కారణం.

ప్రభుత్వం ఇచ్చిన ఎలక్ట్రిక్ కార్లను ససేమిరా అంటున్న అధికారులు

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు EESL కేంద్ర ప్రభుత్వ అధికారులకు ఎలక్ట్రిక్ కార్లను సరఫరా చేస్తే, వాటి పనితీరు మరియు నిర్వహణ మావల్ల కాదు, ప్రత్యేకించి ఛార్జింగ్ పాయింట్లు లేకుండా ఎలా ఉపయోగించాలి అనే స్థితికి వచ్చారు. కేంద్రం దీనిని సీరియస్‌గా తీసుకుని ఇకనైనా దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పట్ల దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Source: LiveMint

Most Read Articles

English summary
Read In Telugu: Government Officials Refuse To Use Tata Tigor EV And Mahindra eVerito — Here’s Why
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X