మారుతికి చెక్ పెట్టేందుకు హ్యుందాయ్ మాస్టర్ ప్లాన్

భవిష్యత్తులో వ్యక్తిగత ప్యాసింజర్ కార్ల పరిశ్రమ మరింత వృద్దిని పుంజుకోనున్న నేపథ్యంలో వీలైనంత వరకు పోటీని ఎదుర్కొంటూనే, విపణిలో రాణించేందుకు భారీ ప్రణాళికలను సిద్దం చేసుకుంది. ప్రత్యేకించి తయారీ మీద ప

By Anil Kumar

ఇండియన్ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో మారుతి సుజుకి తరువాత హ్యుందాయ్ మోటార్స్ భారతదేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల కంపెనీగా రెండవ స్థానంలో నిలిచింది. ఎన్నో సంవత్సరాల నుండి ఇండో-జపనీస్ దిగ్గజం మారుతి సుజుకి మరియు కొరియా దిగ్గజం హ్యుందాయ్ మధ్య పోటీ విపరీతంగా ఉంది. ప్రస్తుతం హ్యుందాయ్ విపణిలో గట్టి పోటీని ఎదుర్కుంటోంది.

Recommended Video

2018 మారుతి న్యూ స్విఫ్ట్ విడుదల | Maruti Swift 2018 - Full Specifications, Features - DriveSpark
భారత్‌లో హ్యుందాయ్ భారీ పెట్టుబడులు

భవిష్యత్తులో వ్యక్తిగత ప్యాసింజర్ కార్ల పరిశ్రమ మరింత వృద్దిని పుంజుకోనున్న నేపథ్యంలో వీలైనంత వరకు పోటీని ఎదుర్కొంటూనే, విపణిలో రాణించేందుకు భారీ ప్రణాళికలను సిద్దం చేసుకుంది. ప్రత్యేకించి తయారీ మీద పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి హ్యుందాయ్ సిద్దమైంది.

భారత్‌లో హ్యుందాయ్ భారీ పెట్టుబడులు

ప్రస్తుతం ఉన్న వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని మరో 50,000 యూనిట్లకు పెంచడానికి 6,500 కోట్ల రుపాయలు పెట్టుబడి పెడుతోంది. అంతే కాకుండా, రానున్న మూడేళ్లలోపు మరో 9 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడానికి హ్యుందాయ్ సిద్దమవుతోంది.

భారత్‌లో హ్యుందాయ్ భారీ పెట్టుబడులు

నూతన మోడళ్లలో పెట్రోల్ మరియు డీజల్ కార్లతో పాటు కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కూడా జాబితాలో ఉంది. అదే విధంగా, ఎలక్ట్రిక్ కార్ల ఛార్జింగ్ కిట్‌లను కొరియా నుండి దిగుమతి చేసుకోవాలని హ్యుందాయ్ భావిస్తోంది.

భారత్‌లో హ్యుందాయ్ భారీ పెట్టుబడులు

హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ప్రతినిధుల కథనం మేరకు, అధిక సంఖ్యలో విక్రయించే లక్ష్యంతో కాకుండా 2020 నాటికి 10 లక్షల యూనిట్ల సేల్స్ మైలురాయిని చేరుకునే లక్ష్యంతో ఉన్నట్లు తెలిసింది.

భారత్‌లో హ్యుందాయ్ భారీ పెట్టుబడులు

తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి చేయడానికి విడి భాగాల తయారీదారుల నుండి స్పేర్స్ పార్ట్స్ కాకుండా అసెంబుల్ చేసిన భాగాలను కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఇలా చేస్తే ప్రొడక్షన్ వేగం పుంజుకోనుంది.

భారత్‌లో హ్యుందాయ్ భారీ పెట్టుబడులు

హ్యుందాయ్ మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ వైకె కూ మాట్లాడుతూ, "భారత్‌లో హ్యుందాయ్ తయారీ ప్లాంట్లను విస్తరించి ప్రొడక్షన్ సామర్థ్యాన్ని 50,000 యూనిట్లు పెంచనున్నట్లు తెలిపాడు." 2018 నాటికి 7 లక్షల యూనిట్లు మరియు 2019 నాటికి 7.5 లక్షల యూనిట్ల కార్లను విక్రయించే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.

భారత్‌లో హ్యుందాయ్ భారీ పెట్టుబడులు

ఇండియన్ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఎంతో చాకచక్యంగా వివేకవంతమైన ప్రణాళికలను సిద్దం చేసుకుంటోంది. భారత్‌లో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే క్రమంలో భారీ పెట్టుబడులు మరియు సరికొత్త మోడళ్లతో ముందుకు వస్తోంది.

Source: ET Auto

Most Read Articles

English summary
Read In Telugu: Hyundai Motors India To Invest Rs 6,500 Crore — To Increase Production Capacity By 50,000 Units
Story first published: Saturday, March 17, 2018, 13:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X