భారత సముద్రంలో చైనా ఉనికిని తిప్పికొట్టేందుకే ఈ నిర్ణయం!!

Written By:
Recommended Video - Watch Now!
India Car Stunts Caught On Camera

మేకిన్ ఇండియా చొరవతో ఇండియన్ నేవీకి కావాల్సిన స్కార్పీన్ సబ్‌మెరైన్‌లను మజ్‌గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ తయారు చేస్తోంది. తాజాగా ఐఎన్ఎస్ కరంజ్(INS Karanj) సబ్‌మెరైన్ భారత నావికా దళంలోకి చేర్చింది.

సముద్ర గస్తీలో ఇండియన్ నేవీకి మరింత బలాన్ని చేకూర్చిన స్కార్పీన్ క్లాస్ మొదటి, రెండవ మరియు ఐఎన్ఎస్ కరంజ్ జలాంతర్గామి గురించి ఆసక్తికరమైన విషయాలు నేటి కథనంలో...

ఐఎన్ఎస్ కరంజ్ సబ్‌మెరైన్

గత ఏడాది డిసెంబర్‌లో స్పార్పీన్ శ్రేణికి చెందిన ఐఎన్ఎస్ కల్వరి జలాంతర్గామి భారత నావికా దళంలోకి చేరింది. సరిగ్గా నెల రోజుల్లోపు స్కార్పీన్ శ్రేణికి చెందిన మరో సబ్‌‌మెరైన్ ఐఎన్ఎస్ కరంజ్‌ను ఇండియన్ నేవీలోకి ప్రవేశపెట్టారు.

ఐఎన్ఎస్ కరంజ్ సబ్‌మెరైన్

మేకిన్ ఇండియా చొరవతో మజగావ్ డాక్ లిమిటెడ్ ఇండియన్ నేవీకి కావాల్సిన అధునాతన జలాంతర్గాములను ప్రాజెక్ట్ 75 ప్రోగ్రామ్ క్రింది స్కార్పీన్ శ్రేణికి చెందిన ఆరు అధునాతన సబ్‌మెరైన్‌లను నిర్మించాల్సి ఉంది. అందులో ఐఎన్ఎస్ కరంజ్ సబ్‌మెరైన్ మూడవది.

ఐఎన్ఎస్ కరంజ్ సబ్‌మెరైన్

ఈ స్కార్పీన్ శ్రేణిలో మజగావ్ డాక్ లిమిటెడ్ నిర్మించిన మొదటి సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ కల్వరి. డీజల్-ఎలక్ట్రిక్ పవర్‌తో నడిచే దీనిని గత ఏడాది డిసెంబరు 14 న ప్రధాన మంత్రి మోడీగారు ప్రారంభించారు.

ఐఎన్ఎస్ కరంజ్ సబ్‌మెరైన్

తరువాత ఇదే స్కార్పీన్ తరగతికి చెందిన రెండవ సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ ఖండారి 2018 జనవరి 12 న నేవీలోకి చేరింది. తాజాగా, మూడవ సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ కరంజ్‌ను జనవరి 31 నప్రవేశపెట్టారు. మొత్తం ఆరు సబ్‌మెరైన్‌లలో మూడింటిని వెనువెంటనే ప్రవేశపెట్టారు.

ఐఎన్ఎస్ కరంజ్ సబ్‌మెరైన్

భారత సముద్రంలో చైనా నావికా దళాలు ఉనికిని పెంచుకుంటున్న తరుణంలో ఇండియన్ నేవీ అవసరానికి అనగుణంగా ప్రాథమిక ఆధునీకరణలో భాగంగా ఈ శక్తివంతమైన స్కార్పీన్ క్లాస్ సబ్‌మెరైన్‌లను భారత నౌకాదళంలోకి చేర్చడం జరిగింది.

ఐఎన్ఎస్ కరంజ్ సబ్‌మెరైన్

రహస్యంగా జరిగే దాడులను తిప్పికొట్టే లక్ష్యంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ స్కార్పీన్ క్లాస్ సబ్‌మెరైన్‌లను నిర్మిస్తున్నారు. వీటిలో అడ్వాన్స్‌డ్ అకౌస్టిక్ సైలెన్సింగ్ టెక్నిక్స్, అధిక శబ్దం లోపలికి చేరకుండా, నీటి వలన కలిగే ఘర్షణను అధగమించేలా వీటిని డిజైన్ చేశారు.

ఐఎన్ఎస్ కరంజ్ సబ్‌మెరైన్

స్కార్పీన్ క్లాస్‌లోని మూడవ సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ కరంజ్‌ ఉష్ణమండలాలతో పాటు అన్ని రకాల పరిస్థితుల్లో పనిచేసేలా నిర్మించడం జరిగింది. ఇందులోని విడి భాగాలు పరస్పరం స్పందించి, నౌకా దళంలోని అన్ని పనులను పూర్తి చేస్తాయి.

ఐఎన్ఎస్ కరంజ్ సబ్‌మెరైన్

ఇది శత్రు స్థావరాలను గుర్తించి ఖచ్చితమైన మార్గనిర్దేశిత ఆయుధాలను ఉపయోగించి దాడి చేస్తుంది. స్వయం చోదక ఆయుధాలు మరియు యాంటీ-షిప్ మిస్సైళ్ల ద్వారా సముద్ర గర్భంలోని శత్రు మూకల మీద దాడి చేస్తుంది.

ఐఎన్ఎస్ కరంజ్ సబ్‌మెరైన్

ఆరు స్కార్పీన్ క్లాస్ సబ్‌మెరైన్‌లను నిర్మించడం మరియు ఆరు సబ్‌మెరైన్‌లకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే ఒప్పందం కోసం మజగావ్ డాక్ లిమిటెడ్ ఫ్రెంచ్‌కు చెందిన దిగ్గజ నావల్ గ్రూప్ DCNSతో పరస్పర ఒప్పందం కుదుర్చుకుంది.

ఐఎన్ఎస్ కరంజ్ సబ్‌మెరైన్

సముద్ర గర్భంలో జరిగే దాడుల్లో, యాటీ-సబ్‌మెరైన్ వార్, రహస్య సమాచారాన్ని సేకరించడం, మజగావ్ డాక్ లిమిటెడ్, సముద్ర అంతర్భాగ మరియు ఉపరితల పర్యవేక్షణ వంటి పనులను ఎంతో చాకచక్యంగా పూర్తి చేసే విధంగా వీటిని నిర్మించింది.

ఐఎన్ఎస్ కరంజ్ సబ్‌మెరైన్

ఇండియన్ నేవీకి స్కార్పీన్ శ్రేణి జలాంతర్గాములను సరఫరా చేసే ఒప్పందాన్ని అక్టోబర్ 2005లో జరిగింది. ఒప్పందం మేరకు తొలి సబ్‌మెరైన్‌ను 2012 డెలివరీ ఇవ్వాల్సి ఉండగా, అనివార్య కారణాలరిత్యా కుదరలేదు. అయితే, ఎట్టకేలకు మూడు సబ్‌మెరైన్‌లను సైన్యంలోకి చేర్చింది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: INS Karanj scorpene class submarine joins indian navy
Story first published: Friday, February 2, 2018, 14:32 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark