జాగ్వార్ ఎక్స్ఇ మరియు ఎక్స్ఎఫ్ ఇంజీనియం పెట్రోల్ వెర్షన్ విడుదల: ధర రూ. 35.99 లక్షలు

Written By:

జాగ్వార్ విపణిలోకి ఎక్స్ఇ మరియు ఎక్స్ఎఫ్ లగ్జరీ సెడాన్ కార్లను సరికొత్త ఇంజీనియం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో లాంచ్ చేసింది. ఇంజీనియం పెట్రోల్ ఇంజన్ గల జాగ్వార్ ఎక్స్ఇ ధర రూ. 35.99 లక్షలు మరియు జాగ్వార్ ఎక్స్ఎఫ్ ధర రూ. 49.80 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

Recommended Video - Watch Now!
Jaguar 'The Art Of Performance Tour' Bangalore - DriveSpark
జాగ్వార్ ఎక్స్ఇ మరియు ఎక్స్ఎఫ్ ఇంజీనియం పెట్రోల్ వెర్షన్

జాగ్వార్ ఎక్స్ఇ మరియు ఎక్స్ఎఫ్ మోడళ్లను ఇంజీనియం డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో మే 2017లో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. జాగ్వార్ ఇండియా లైనప్‌లో తమ ఉత్పత్తుల సామర్థ్యాన్ని పెంచుకునే లక్ష్యంతో ఎక్స్ఇ మరియు ఎక్స్ఎఫ్ మోడళ్లను ఇంజీనియం పెట్రోల్ ఇంజన్‌లతో ప్రవేశపెట్టింది.

జాగ్వార్ ఎక్స్ఇ మరియు ఎక్స్ఎఫ్ ఇంజీనియం పెట్రోల్ వెర్షన్

ఖరీదైన ప్రీమియమ్ సెడాన్ కార్ల సెగ్మెంట్లో డీజల్ కార్ల కంటే పెట్రోల్ కార్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దీనిని గమనించిన జాగ్వార్ తమ ఎక్స్ఇ మరియు ఎక్స్ఎఫ్ మోడళ్లలో పెట్రోల్ ఇంజన్‌ను పరిచయం చేసింది. జాగ్వార్ ఇంజీనియం పెట్రోల్ ఇంజన్ అంతర్జాతీయ మార్కెట్లో ఇది వరకే అందుబాటులోకి వచ్చింది.

జాగ్వార్ ఎక్స్ఇ మరియు ఎక్స్ఎఫ్ ఇంజీనియం పెట్రోల్ వెర్షన్

సాంప్రదాయ పెట్రోల్ ఇంజన్‌లలో అత్యధికంగా క్యాస్ట్-ఐరన్ బ్లాక్స్ ఉపయోగిస్తారు. కానీ, జాగ్వార్ అభివృద్ది చేసిన ఇంజీనియం ఇంజన్‌లు నిజానికి అల్యూమినియంతో తయారు చేస్తారు. అల్యూమినియం లోహం ఐరన్‌ కంటే తక్కువ బరువైనది. దీంతో ఇది కారు బరువు తగ్గడంలో మెరుగ్గా సహాయపడుతుంది.

జాగ్వార్ ఎక్స్ఇ మరియు ఎక్స్ఎఫ్ ఇంజీనియం పెట్రోల్ వెర్షన్

అదనంగా, ఇంజీనియం ఇంజన్‌ల లోపల సిలిండర్ గోడల మీద ఘర్షణ లక్షణాలు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఇంజన్ లోపల కదిలే విడి భాగాల మీద ఘర్షణ ప్రభావం తక్కువగా ఉండటంతో అత్యుత్తమ మైలేజ్ మరియు పవర్ సాధ్యమవుతుంది.

జాగ్వార్ ఎక్స్ఇ మరియు ఎక్స్ఎఫ్ ఇంజీనియం పెట్రోల్ వెర్షన్

ఇంజీనియం పెట్రోల్ ఇంజన్‌లలో పేటెంట్ పొందిన వేరిబుల్ వాల్వ్ టైమింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇంజీనియం ఇంజన్‌లలో థర్మల్ లక్షణాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి.

జాగ్వార్ ఎక్స్ఇ మరియు ఎక్స్ఎఫ్ ఇంజీనియం పెట్రోల్ వెర్షన్

సాంకేతికంగా ఇందులో ఉన్న 2.0-లీటర్ ఇంజీనియం పెట్రోల్ ఇంజన్ 197బిహెచ్‌పి మరియు 247బిహెచ్‌పి రెండు రకాల పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. జాగ్వార్ సీక్వెన్షియల్ షిఫ్ట్ మరియు ఆల్ సర్ఫేస్ ప్రొగ్రెస్ కంట్రోల్ కోసం ఇంజన్‌కు 8-స్పీడ్ ఎలక్ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం చేయడం జరిగింది. అన్ని రకాల ఇంజన్ వేగం(RPM) వద్ద అత్యుత్తమ టార్క్ ప్రొడ్యూస్ చేయడానికి ఎక్స్ఇ మరియు ఎక్స్ఎఫ్‌లోని ఇంజన్‌లో ట్విన్-స్క్రోల్ ట్యూబులు ఉన్నాయి.

జాగ్వార్ ఎక్స్ఇ మరియు ఎక్స్ఎఫ్ ఇంజీనియం పెట్రోల్ వెర్షన్

జాగ్వార్ ఎక్స్ఇ ప్రెస్టీజ్, ఎక్స్ఇ ప్యూర్ మరియు ఎక్స్ఎఫ్ ప్రెస్టేజ్ వేరియంట్లలో 197బిహెచ్ ఉత్పత్తి చేసే ఇంజన్ అదే విధంగా జాగ్వార్ ఎక్స్ఇ మరియు జాగ్వార్ ఎక్స్ఎఫ్ పోర్ట్‌పోలియో వేరియంట్లలో 247బిహెచ్‌పి ప్రొడ్యూస్ చేసే ఇంజన్ కలదు.

జాగ్వార్ ఎక్స్ఇ మరియు ఎక్స్ఎఫ్ ఇంజీనియం పెట్రోల్ వెర్షన్

జాగ్వార్ ఇండియా లైనప్‌లో ప్రస్తుతం ఐదు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. అవి,

  • ఎక్స్ఇ - ప్రారంభ ధర రూ. 35.99 లక్షలు
  • ఎక్స్ఎఫ్ - ప్రారంభ ధర రూ. 46.60 లక్షలు
  • ఎఫ్-పేస్ - ప్రారంభ ధర రూ. 60.02 లక్షలు
  • ఎక్స్‌జె - ప్రారంభ ధర రూ. 1.01 కోట్లు
  • ఎఫ్-టైప్ - ప్రారంభ ధర రూ. 1.34 కోట్లు
అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.
జాగ్వార్ ఎక్స్ఇ మరియు ఎక్స్ఎఫ్ ఇంజీనియం పెట్రోల్ వెర్షన్

ఫీచర్లు మరియు ఆప్షన్ల పరంగా చూస్తే, ఇంజీనియం వేరియంట్లలో లభించే జాగ్వార్ ఎక్స్ఇ మరియు జాగ్వార్ ఎక్స్ఎఫ్ మోడళ్ల మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదు.

English summary
Read In Telugu: Jaguar XE & XF Ingenium Petrol Launched In India At Rs 35.99 Lakh & Rs 49.80 Lakh, Respectively
Story first published: Friday, March 16, 2018, 18:14 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark