2018 ఆటో ఎక్స్‌పోలో కియా ఆవిష్కరిస్తున్న తొలి మోడల్

Written By:
Recommended Video - Watch Now!
Ford Freestyle First Look & Walkaround in 360

దక్షిణ కొరియాకు చెందిన ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ అతి త్వరలో ప్రారంభం కానున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో తమ కొత్త కార్లను ఆవిష్కరించడానికి సిద్దమైంది. ఆటో ఎక్స్‌పో వేదిక మీద కియా ప్రదర్శించబోయే తొలి మోడల్‌ను టీజర్ రూపంలో తాజాగా రివీల్ చేసింది.

కియా ఎస్‌పి కాన్సెప్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

భారతదేశపు అతి పెద్ద వాహన ప్రదర్శన వేదికగా కియా మోటార్స్ సుమారుగా 16 కొత్త మోడళ్లను అంతర్జాతీయ ఆవిష్కరణ చేస్తోంది. అందులో ఈ ఏడాది దేశీయ మార్కెట్లోకి కియా విడుదల చేయనున్న కార్లు కూడా ఉన్నాయి.

కియా ఎస్‌పి కాన్సెప్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

కియా ఇండియా తాజాగా ఓ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంభందించిన టీజర్‌ను లాంచ్ చేసింది. విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటా మరియు రెనో డస్టర్‌కు పోటీగా ప్రవేశపెడుతున్న ఈ మోడల్ పేరు కియా ఎస్‌పి కాన్సెప్ట్.

కియా ఎస్‌పి కాన్సెప్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఫిబ్రవరి 7, 2018 న ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో తమ 16 అంతర్జాతీయ మోడళ్లతో పాటు కియా ఎస్‌పి కాన్సెప్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరిస్తోంది.

కియా ఎస్‌పి కాన్సెప్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

కియా మోటర్స్ ఎస్‌పి కాన్సెప్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్కువ చొరవ తీసుకుంటుండటంతో కియా ఇండియా యొక్క తొలి విడుదల కాంపాక్ట్ ఎస్‌యూవీనే కావచ్చని ఇండియన్ ఆటో ఇండస్ట్రీ భావిస్తోంది.

కియా ఎస్‌పి కాన్సెప్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఎస్‌పి కాన్సెప్ట్ ఎస్‌యూవీలో ఆకర్షణీయైమన క్యారెక్టర్ లైన్స్ పదునైన ఫ్రంట్ డిజైన్, సరికొత్త డిజైన్‌లో ఉన్న అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ ఎస్‌యూవీని సైడ్ ప్రొఫైల్ నుండి గమనిస్తే, రేంజ్ రోవర్ ఎవోక్ శైలిలో కనిపిస్తుంది.

కియా ఎస్‌పి కాన్సెప్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

కియా ఎస్‌పి కాన్సెప్ట్ రియర్ డిజైన్‌లో పలుచగా ఉన్న ఎల్ఇడి టెయిల్ లైట్లు, టెయిల్‌గేట్ గుండాపోయే ఆకర్షణీయమైన క్రోమ్ పట్టీ గమనించవచ్చు. కియా మోటార్స్ ఈ ఎస్‌పి కాన్సెప్ట్ ఎస్‌యూవీని పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లలో పరిచయం చేసే అవకాశం ఉంది.

కియా ఎస్‌పి కాన్సెప్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

కియా ఎస్‌పి కాన్సెప్ట్ 2019 ప్రారంభం నాటికి పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో పెనుకొండ సమీపంలో ప్రొడక్షన్ ప్లాంటును నిర్మిస్తోంది.

కియా ఎస్‌పి కాన్సెప్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఈ ప్రొడక్షన్ ప్లాంటు నిర్మాణం పూర్తి చేసుకుని, అందుబాటులోకి వస్తే, కియా దేశీయంగా విక్రయించే అన్ని మోడళ్లతో పాటు విదేశీ మోడళ్లను ఇక్కడి ఉత్పత్తి చేసి, ఎగుమతి చేయనుంది.

కియా ఎస్‌పి కాన్సెప్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

కియా ఇండియా, ఎస్‌పి కాన్సెప్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీతో పాటు, అంతర్జాతీయ విపణిలో ఉన్న పికంటో హ్యాచ్‌బ్యాక్, రియో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్, స్పోర్టేజ్ ఎస్‌యూవీ, సెరాటో సెడాన్, ఆప్టిమా ప్రీమియమ్ సెడాన్, సొరెంటో ఫుల్ సైజ్ ఎస్‌యూవీ మరియు స్పోర్టివ్ స్టింగర్ సెడాన్ వంటి కార్లను ఆవిష్కరించనుంది.

కియా ఎస్‌పి కాన్సెప్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

పైన పేర్కొన్న పలు మోడళ్లతో పాటు, విసృత శ్రేణి ఎలక్ట్రిక్ కార్లను, ప్లగ్-ఇన్-హైబ్రిడ్ కార్లను కియా ఆవిష్కరించే అవకాశం ఉంది. ప్రపంచ ఆటోమోటివ్ పరిశ్రమలో శరవేగంగా వృద్ది చెందుతున్న ఇండియన్ మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కియా మోటార్స్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది.

కియా ఎస్‌పి కాన్సెప్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కియా మోటార్స్ ఎస్‌పి కాన్సెప్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఇండియన్ రోడ్లకు అనుగుణంగా అభివృద్ది చేసింది. దేశీయంగా కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఉన్న పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని, ఈ సెగ్మెంట్లో ఉన్న మోడళ్లకు గట్టి పోటీనిచ్చేలా ఎస్‌పి కాన్సెప్ట్‌ను తీర్చిదిద్దింది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Kia Motors Teases SP Concept SUV — To Debut At Auto Expo 2018
Story first published: Wednesday, January 31, 2018, 19:24 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark