ఆటో ఎక్స్‌పో 2018: మేడిన్ ఆంధ్రా తొలి కియా కారుకు భారీ ఆదరణ

Written By:
Recommended Video - Watch Now!
New Maruti Swift Launch: Price; Mileage; Specifications; Features; Changes

ఆటో ఎక్స్‌పో 2018: అతి త్వరలో ఇండియన్ మార్కెట్లో కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్దమైన కియా మోటార్స్ తాజాగా ఢిల్లీలో జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదిక మీద కియా ఎస్‌పి కాన్సెప్ట్ ఎస్‌యూవీకి విపరీతమైన ఆదరణ లభించింది.

కియా మోటార్స్ ఆవిష్కరించిన ఎస్‌పి కాన్సెప్ట్ ఎస్‌యూవీ గురించి పూర్తి వివరాలు మరియు ఫోటోల కోసం....

కియా ఎస్‌పి ఎస్‌యూవీ

కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో పెనుకొండకు సమీపంలో నిర్మిస్తున్న ప్రొడక్షన్ ప్లాంటులో తాజాగా ఆవిష్కరించిన కాన్సెప్ట్ ఎస్‌యూవీ ఉత్పత్తిని ప్రారంభించనుంది.

కియా ఎస్‌పి ఎస్‌యూవీ

దక్షిణ కొరియా ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం కియా మోటార్స్ కియా ఎస్‌పి ఎస్‌యూవీతో పాటు 15 రకాల అంతర్జాతీయ మోడళ్లను కూడా ఆటో ఎక్స్‌పో 2018లో ఆవిష్కరించింది.

కియా ఎస్‌పి ఎస్‌యూవీ

కియా మోటార్స్ కియా ఎస్‌పి కాన్సెప్ట్ ఎస్‌యూవీని ప్రత్యేకించి ఇండియన్ రోడ్లకు అనుగుణంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించింది. కియా 2019 మలిసగం నుండి విసృతంగా మార్కెట్లోకి రానుంది.

కియా ఎస్‌పి ఎస్‌యూవీ

కియా తమ డిజైన్ డిఎన్‌ఎ లక్షణాలను మిస్ చేయకుండా, భవిష్యత్ డిజైన్ అంశాలతో కండలు తిరిగి బోల్డ్ బాడీ స్టైల్‌లో ఎస్‌పి కాన్సెప్ట్‌కు ఒక కొత్త రూపాన్ని తీసుకొచ్చారు. విశాలమైన మరియు ఎత్తైన బాడీ కాంబినేషన్స్‌తో ఎస్‌పి ఎస్‌యూవీ స్పోర్టివ్ శైలిలో ఉంది.

కియా ఎస్‌పి ఎస్‌యూవీ

కియా ఎస్‌పి కాన్సెప్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఫ్రంట్ డిజైన్‌లో పులి ముక్కు ఆకారంలో ఉన్న గ్రిల్, గ్రిల్‌కు ఇరువైపులా పగటి పూట వెలిగే ఎల్ఇడి జోడింపుతో ఉన్న పలుచటి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. మరియు రియర్ డిజైన్‌లో పలుచటి ఎల్ఇడి టెయిల్ లైట్లు ఉన్నాయి.

కియా ఎస్‌పి ఎస్‌యూవీ

కియా ఎస్‌పి కాన్సెప్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సైడ్ ప్రొఫైల్‌లో బ్లాక్ కలర్ ఫినిషింగ్‌లో ఉన్న పిల్లర్లు, బాడీకి ఇరువైపులా డోర్ల మీద ఉన్న ప్లాస్టిక్ బ్లాక్ క్లాడింగ్, మరియు ప్రక్కటద్దాలకు పైన క్రింద ఉన్న తెలుపు రంగు పట్టీలు ఆరేంజ్ కలర్ ఎస్‌పి కాంపాక్ట్ ఎస్‌యూవీ మీద ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి.

కియా ఎస్‌పి ఎస్‌యూవీ

కియా ఎస్‌పి కాన్సెప్ట్ ఇంటీరియర్‌లో కూడా ఎక్ట్సీరియర్ తరహా అత్యాధునిక డిజైన్ అందించారు. ఆకర్షణీయమైన డిజైన్ ఎలిమెంట్లు, ఆధునిక మరియు ట్రెండీ క్యాబిన్ డిజైన్ యువ కొనుగోలుదారులను అమితంగా ఆకట్టుకుంటుంది.

కియా ఎస్‌పి ఎస్‌యూవీ

కియా మోటార్స్ 2019 నుండి కియా ఎస్‌పి కాన్సెప్ట్ కాంపాక్ట్ ఎస్‍‌‌యూవీ ఉత్పత్తి చేయనుంది. కొరియా దిగ్గం కియా ఎస్‌పి కాన్సెప్ట్‌తో పాటు కియా అంతర్జాతీయ లైనప్‌లో ఉన్న పికంటో, రియో, స్టోనిక్, సెరాటో, సోల్ ఇవి, సొరెంటో, స్పోర్టేజ్, గ్రాండ్ కార్నివాల్ ఇంకా ఎన్నో మోడళ్లను ఆవిష్కరించింది.

కియా ఎస్‌పి ఎస్‌యూవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కియా మోటార్స్ ఎస్‌పి కాన్సెప్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని భారత వంటి అభివృద్ది చెందుతున్న అంతర్జాతీయ మార్కెట్ల కోసం అభివృద్ది చేసింది. ప్రస్తుతం కాన్సెప్ట్ దశలో ఉన్న కియా ఎస్‌పి కాన్సెప్ట్ 2019 నాటికి పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ వెర్షన్‌లో మార్కెట్లోకి రానుంది.

కియా ఎస్‌పి కాన్సెప్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లోకి విడుదలైతే, విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటాకు గట్టి పోటీనిస్తుంది.

కియా ఎస్‌పి ఎస్‌యూవీ

సరికొత్త అమేజ్ కారును ఆవిష్కరించిన హోండా: డిజైర్ పతనం గ్యారంటీ!!

మారుతి న్యూ స్విఫ్ట్ విడుదల- ధర, వేరియంట్లు, ఇంజన్, ఫీచర్లు, కలర్స్ మరియు ఫోటోలు

టాటా హెచ్5ఎక్స్ ప్రీమియమ్ ఎస్‌యూవీ ఆవిష్కరణ

భారతదేశపు తొలి ఓపెన్ టాప్ ఎస్‌యూవీ

English summary
Read In Telugu: Auto Expo 2018: Kia SP Concept Unveiled — Expected Launch Date And Images

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark