మహీంద్రా ఎస్201: మారుతి బ్రిజాకు మరో పోటీ

మహీంద్రా వితారా బ్రిజాకు సరాసరి పోటీనిచ్చే సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని నిర్మించింది. అతి త్వరలో విడుదల కానున్న మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీకి ఇప్పుడు తుది దశ రహదారి పరీక్షలు నిర్వహిస్తుండగా పట్టుబడిం

By Anil Kumar

ఇండియాలో అగ్రగామి ఎస్‌యూవీల తయారీ సంస్థగా పేరుగాంచిన మహీంద్రా అండ్ మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో పోటీ ఎరుగని ఫలితాలు సాధిస్తున్న మారుతి వితారా బ్రిజా ఎస్‌యూవీకి సరైన పోటీని తీసుకురాలేకపోయింది.

మహీంద్రా ఎస్201

మహీంద్రా మాత్రమే కాదు, ఫోర్డ్ ప్రవేశపెట్టిన ఇకోస్పోర్ట్, టాటా మోటార్స్ వారి నెక్సాన్ మరియు మహీంద్రా గతంలో పరిచయం చేసిన టియువి300 వీటిలో ఏ మోడల్‌ కూడా మారుతి బ్రిజాకు పోటీనివ్వలేకపోతున్నాయి.

మహీంద్రా ఎస్201

దీనిని సీరియస్‌గా తీసుకొన్న మహీంద్రా వితారా బ్రిజాకు సరాసరి పోటీనిచ్చే సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని నిర్మించింది. అతి త్వరలో విడుదల కానున్న మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీకి ఇప్పుడు తుది దశ రహదారి పరీక్షలు నిర్వహిస్తుండగా పట్టుబడింది.

మహీంద్రా ఎస్201

మహీంద్రా తమ దక్షిణకొరియా దిగ్గజం శాంగ్‌యాంగ్ మోటార్స్‌కు చెందిన టివోలి ఎస్‌యూవీ ఆధారంగా ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కోసం ఎస్201 కోడ్ పేరుతో సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని నిర్మించింది.

మహీంద్రా ఎస్201

ఈ సబ్-ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని మోనోకోక్యూ ఛాసిస్ మీద ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో రూపొందించారు. 5-సీటింగ్ లేఔట్లో ఉన్న ఎస్201 ఎస్‌యూవీ మహీంద్రా టియువి300 మరియు శాంగ్‌యాంగ్ టివోలి కంటే పొట్టిగా ఉంటుంది.

మహీంద్రా ఎస్201

మహీంద్రా ఇండియా లైనప్‌లోకి ఒక కొత్త మోడల్‌గా పరిచయం అవుతున్న ఎస్201 ఎస్‌యూవీకి అధికారికంగా పేరును ఇంకా ఖరారు చేయలేదు. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి భారీ అంచనాలతో వస్తున్న ఎస్201 ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ పూర్తిగా కొత్తగా ఉంది.

మహీంద్రా ఎస్201

డిజైన్ మరియు ఫీచర్ల పరంగానే కాకుండా ఇంజన్ పరంగా కూడా వితారా బ్రిజాకు గట్టి పోటీనిచ్చే ఆలోచనలో ఉంది. అందులో భాగంగానే 125బిహెచ్‌పిప వర్ ప్రొడ్యూస్ చేసే శక్తివంతమైన 1.2-లీటర్ టుర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ అందిస్తోంది.

మహీంద్రా ఎస్201

అదే విధంగా డీజల్ ప్రియుల కోసం 110బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజల్ ఇంజన్ అందిస్తోంది. పనితీరు విషయంలో పోటీదారులతో పోల్చుకుంటే అదే అత్యంత శక్తివంతమైనది. మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభ్యం కానున్న ఇందులో ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ కూడా పరిచయం చేయాలని భావిస్తోంది.

మహీంద్రా ఎస్201

ప్రొడక్షన్ వెర్శన్ ఎస్201 కాంపాక్ట్ ఎస్‌యూవీని ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి విడుదల చేయడానికి కసరత్తులు ప్రారంభించింది. అంతే కాకుండా, దీనికి సరికొత్త పేరును ఖరారు చేయనుంది.

మహీంద్రా ఎస్201

మహీంద్రా అప్‌కమింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఒక్కసారి విడుదలైతే, విపణిలో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా, టాటా నెక్సాన్ మరియు ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనివ్వనుంది. వీలైనంత వరకు తక్కువ ధరలో ప్రవేశపెట్టేందుకు చాలా వరకు దేశీయంగా తయారైన విడి భాగాలనే ఉపయోగిస్తోంది.

మహీంద్రా ఎస్201

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఈ ఏడాదిలో విడుదలవుతున్న అత్యంత ముఖ్యమైన కార్లలో ఇదీ ఒకటి. కాంపాక్ట్ ఎస్‌యూవీల భవితవ్యం దీని విడుదలతో ఎలా మారుతుందో చూడాలి మరి. మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్‌యూవీలు నిర్మాణ నాణ్యత, ధరకు తగ్గ విలువలు మరియు నమ్మకాన్ని తగ్గ పనితీరును కనబరుస్తాయి. అయితే, మారుతి తరహాలో విసృతమైన డీలర్‌షిప్ నెట్‌వర్క్ లేకపోవడంతో ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోంది.

Source: Anthingonwheels & Vikatan

Most Read Articles

English summary
Read In Telugu: Mahindra S201: New spyshots REVEAL key details about Maruti Brezza rival
Story first published: Wednesday, June 27, 2018, 13:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X