హ్యుందాయ్ క్రెటాకు పోటీని సిద్దం చేసిన మహీంద్రా

Written By:

దేశీయ అగ్రగామి ఎస్‌యూవీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్201 కోడ్ పేరుతో సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తోంది. మహీంద్రా ప్రొడక్షన్ దశకు చేరుకున్న కాంపాక్ట్ ఎస్‌యూవీకి తుది పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని శాంగ్‌యాంగ్ టివోలి ఆధారంతో రూపొందించింది.

మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ

వివిధ దశల వారీగా ఎస్201 కోడ్ పేరుతో మహీంద్రా తమ అధునాతన కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ది చేసింది. గతంలో కూడా దీనిని పలుమార్లు రహ్యంగా పరీక్షించింది. 2018లో పూర్తి స్థాయిలో విడుదలకు సిద్దమైన ప్రొడక్షన్ వెర్షన్ మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీని తాజాగా టెస్ట్ చేసింది.

మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఎక్ట్సీరియర్ ఫీచర్లు మరియు డిజైన్ అంశాలు గుర్తించడానికి వీల్లేకుండా నలుపు మరియు తెలుపు రంగు చారలతో పూర్తిగా కప్పేసి పరీక్షించిన మోడల్ మహీంద్రా ఎస్201 ఎస్‌యూవీగా గుర్తించడం జరిగింది. ఇందులో ప్రొడక్షన్ వెర్షన్ బాడీ ప్యానల్స్, అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, రూఫ్ రెయిల్స్ మరియు అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. స్పై ఫోటో ద్వారా ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ మరియు ఎల్ఇడి బ్రేక్ లైట్ల జోడింపుతో ఉన్న రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ వంటివి ఉన్నాయి.

మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఎస్201 కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫ్రంట్ డిజైన్‌లో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న అధునాతన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, నూతన శైలిలో డిజైన్ చేయబడిన కండలు తిరిగిన ఆకారంలో ఉన్న ఫ్రంట్ బంపర్, పెద్ద పరిమాణంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్ వంటివి ఉన్నాయి.

మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ

మహీంద్రా ఎస్201 కాంపాక్ట్ ఎస్‌యూవీ ముందుగా 5-సీటింగ్ కెపాసిటీకో వచ్చి, తరువాత ఆలస్యంగా 7-సీటింగ్ సామర్థ్యంతో రానుంది. అత్యంత విలాసవంతమైన ప్రీమియం క్వాలిటీ ఇంటీరియర్‌ను అందిస్తోంది. ఇంటీరియర్‌లో ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేయగల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు మరియు సన్ రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ

మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌‌యూవీలో 108బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే 1.2-లీటర్ జి80 పెట్రోల్ ఇంజన్ మరియు 98బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌‌లతో లభ్యం కానుంది.

మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ

అంతే కాకుండా, మహీంద్రా మరో రెండు కొత్త ఇంజన్‌లను అభివృద్ది చేస్తోంది. అందులో 1.6-లీటర్ డీజల్ మరియు 1.5-లీటర్ పెట్రోల్. వీటిని కూడా మహీంద్రా ఎస్201లో పరిచయమయ్యే అవకాశం ఉంది. పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్స్‌‌లో లభించే ఎస్201 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభించనుంది.

మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ శాంగ్‌యాంగ్ భాగస్వామ్యంతో శాంగ్‌యాంగ్ టివోలి ఎస్‌యూవీ ఆధారంగా మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని డెవలప్ చేసింది. ఇది పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే, ధర,డిజైన్ మరియు ఇంజన్ ఆప్షన్స్ పరంగా మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా, హ్యుందాయ్ క్రెటా మరియు రెనో డస్టర్ వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

Source: Team-BHP

English summary
Read In Telugu: New Mahindra S201 Compact SUV Spotted Testing — To Rival The Hyundai Creta
Story first published: Tuesday, April 17, 2018, 10:00 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark