ఆటో ఎక్స్‌పో 2018: లగ్జరీ ఎస్‌‍యూవీని ఆవిష్కరించిన మహీంద్రా- ఫోటోలు

Written By:
Recommended Video - Watch Now!
Mahindra TUV Stinger Concept First Look; Details; Specs - DriveSpark

ఆటో ఎక్స్‌పో 2018: మహీంద్రా అండ్ మహీంద్రా భాగస్వామ్యపు సంస్థ శాంగ్‌యాంగ్ అభివృద్ది చేసిన జి4 రెక్ట్సాన్ ఎస్‌యూవీని ప్రదర్శించింది. భారత పరిశ్రమలో మహీంద్రా వారసత్వాన్ని కొనసాగిస్తూ మహీంద్రా బ్యాడ్జ్‌తో ఈ లగ్జరీ ఎస్‌యూవీని ప్రవేశపెట్టారు.

మహీంద్రా వాహన శ్రేణిలోకి వచ్చిన జి4 రెక్ట్సా ప్రీమియమ్ లగ్జరీ ఎస్‌యూవీ గురించి పూర్తి వివరాలు మరియు ఫోటోల కోసం...

శాంగ్‌యాంగ్ జీ4 రెక్ట్సాన్

మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త శాంగ్‌యాంగ్ జీ4 రెక్ట్సాన్‌ ఎస్‌యూవీని నూతన బ్రాండ్ పేరుతో ఇండియన్ మార్కెట్లోకి అతి త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో అత్యాధునిక స్టైలిష్, టెక్నాలజీ మరియు సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

శాంగ్‌యాంగ్ జీ4 రెక్ట్సాన్

సరికొత్త జీ4 రెక్ట్సాన్ ఎస్‌యూవీ శాంగ్‌యాంగ్ యొక్క అతి ముఖ్యమైన మోడల్. అంతర్జాతీయ విపణిలో ఈ శాంగ్‌యాంగ్ జీ4 రెక్ట్సాన్ ప్రీమియమ్ ఎస్‌యూవీ ఎన్నో పథకాలు మరియు ప్రశంసలు పొందింది.

శాంగ్‌యాంగ్ జీ4 రెక్ట్సాన్

ప్రీమియమ్ ఎస్‌యూవీలలో కామన్‌గా డిజైన్ అంశాలను జీ4 రెక్ట్సాన్ ఫ్రంట్ డిజైన్‌లో గమనించవచ్చు. హెచ్ఐడి హెడ్‌ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

శాంగ్‌యాంగ్ జీ4 రెక్ట్సాన్

మహీంద్రా బ్యాడ్జ్‌తో వస్తున్న శాంగ్‌యాంగ్ రెక్ట్సాన్ ప్రీమియమ్ ఎస్‌యూవీలో 178బిహెచ్‌పి పవర్ మరియు 420ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 2.2-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్‌కు మెర్సిడెస్ బెంజ్ నుండి సేకరించిన 7-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

శాంగ్‌యాంగ్ జీ4 రెక్ట్సాన్

జీ4 రెక్ట్సాన్ ఎస్‌యూవీలో టాప్ క్లాస్ క్యాబిన్ క్వాలీటి ఉంది. క్యాబిన్ మొత్తానికి ప్రీమియమ్ ఫీల్ తెప్పించడానికి వీలైనన్ని చోట్ల కాగ్నాక్ బ్రౌన్ లెథర్ మరియు సాఫ్ట్-ఫీల్ ప్లాస్టిక్స్‌ అందించారు. మొత్తానికి శాంగ్‌యాంగ్ జీ4 రెక్ట్సాన్ రిచ్ ఫీల్ కలిగిస్తుంది.

శాంగ్‌యాంగ్ జీ4 రెక్ట్సాన్

సరికొత్త జీ5 రెక్ట్సాన్ ఇంటీరియర్‌లో ఖరీదైన డిజైన్ ఎలిమెంట్లు ఉన్నాయి. 8-అంగుళాల పరిమాణం గల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, జిపిఎస్ న్యావిగేషన్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియుు వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి.

శాంగ్‌యాంగ్ జీ4 రెక్ట్సాన్

భద్రత పరంగా శాంగ్‌యాంగ్ జీ4 రెక్ట్సాన్ ప్రీమియమ్ ఎస్‌యూవీలో భద్రత పరంగా తొమ్మిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా ఎన్నో ఎలక్ట్రిక్ ఆధారిత కంట్రోల్స్ ఉన్నాయి.

శాంగ్‌యాంగ్ జీ4 రెక్ట్సాన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

శాంగ్‌యాంగ్ ఆవిష్కరించిన జీ4 రెక్ట్సాన్ ప్రీమియమ్ ఎస్‌యూవీ మహీంద్రా బ్యాడ్జ్‌తో వచ్చింది. మహీంద్రా ఈ ప్రీమియమ్ ఎస్‌యూవీని సరికొత్త బ్రాండ్ పేరుతో విపణిలోకి విడుదల చేసి, తన బ్యాడ్జి క్రిందనే విక్రయించనుంది. అంటే సేల్స్, సర్వీసింగ్ పరంగా ఇది పూర్తిగా మహీంద్రా వెహికల్ అని చెప్పవచ్చు.

అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో వస్తున్న మహీంద్రా జీ4 రెక్ట్సాన్ ఎస్‌యూవీ దేశీయ మార్కెట్లో ఉన్న టయోటా ఫార్చ్యూనర్ మరియు ఫోర్డ్ ఎండీవర్ వాహనాలకు గట్టి పోటీనివ్వనుంది.

English summary
Read In Telugu: Auto Expo 2018: Mahindra Badged G4 Rexton Showcased - Specifications & Images

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark