ఆటో ఎక్స్‌పో 2018: మహీంద్రా టియువి స్టింగర్ - భారతదేశపు తొలి ఓపెన్ టాప్ ఎస్‌యూవీ

Posted By:
Recommended Video - Watch Now!
Maruti Future S Concept

ఆటో ఎక్స్‌పో 2018: విభిన్న ఎస్‌యూవీ వాహనాలను పరిచయం చేసే సంస్థగా మహీంద్రా అండ్ మహీంద్రా బాగా ప్రాచుర్యం పొందింది. సరిగ్గా రండేళ్ల క్రితం జరిగిన ఆటో ఎక్స్‌పోలో కెయువి100 ఆవిష్కరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన మహీంద్రా ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో భారతదేశపు తొలి కన్వర్టిబుల్ ఎస్‌యూవీని ప్రదర్శించింది.

మహీంద్రా టియువి స్టింగర్ కన్వర్టిబుల్ ఎస్‌యూవీ

నమ్మలేదు కదూ... మీరే కూదా మేము కూడా మొదట్లో ఆశ్చర్యపోయాం. అయితే, మహీంద్రా ఆవిష్కరించింది నిజంగానే ఓపెన్ టాప్ ఎస్‌యూవీనే. టియువి స్టింగర్ పేరుతో ఈ ఎస్‌యూవీ గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

మహీంద్రా టియువి స్టింగర్ కన్వర్టిబుల్ ఎస్‌యూవీ

మహీంద్రా అండ్ మహీంద్రా తమ టియువి ఎస్‌యూవీ ఆధారంతో టియువి స్టింగర్ కన్వర్టిబుల్ కాన్సెప్ట్ ఎస్‌యూవీని అభివృద్ది చేసింది. దీనిని కనుక బడ్జెట్ ధరలో విడుదల చేస్తే దీనికొచ్చే డిమాండ్ అంతా ఇంత కాదు. భారత్‌లోకి తొలి కన్వర్టిబుల్ ఎస్‌యూవీని పరిచయం చేసిన ఘనత కూడా మహీంద్రాకే దక్కుతుంది.

మహీంద్రా టియువి స్టింగర్ కన్వర్టిబుల్ ఎస్‌యూవీ

ఆటో ఎక్స్‌పో 2018లో మహీంద్రా టియువి స్టింగర్ ఆవిష్కరించిన మహీంద్రా ప్రతినిధులు దీని గురించి మాట్లాడుతూ, "ఎస్‌యూవీ తరహా పనితీరును కనబరిచే టియువి కన్వర్టిబుల్‌ను యువ కొనుగోలుదారులను టార్గెట్ చేసుకుని అర్బన్ మార్కెట్ కోసం అభివృద్ది చేసినట్లు వెల్లడించారు."

మహీంద్రా టియువి స్టింగర్ కన్వర్టిబుల్ ఎస్‌యూవీ

మహీంద్రా తమ టియువి స్టింగర్ కన్వర్టిబుల్ ఎస్‌యూవీలో మహీంద్రా వారి ఎమ్‌హాక్ డీజల్ శ్రేణి నుండి సేకరించి శక్తివంతమైన ఇంజన్‌ అందిస్తోంది. టియువి స్టింగర్ బానెట్ క్రింద దాగిన డీజల్ ఇంజన్ గరిష్టంగా 140బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మహీంద్రా టియువి స్టింగర్ కన్వర్టిబుల్ ఎస్‌యూవీ

టియువి స్టింగర్ కన్వర్టిబుల్ ఎస్‌యూవీని మహీంద్రా వారి టియువి300 కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆధారంగా అభివృద్ది చేయడంతో టియువి స్టింగర్ ఫ్రంట్ డిజైన్ టియువి300ను పోలి ఉంటుంది. ఫ్రంట్ డిజైన్‌లో ఉన్న 6-స్లాట్ ఫ్రేమ్ మరియు బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, గ్రిల్‌కు ఇరువైపులా ఎల్ఇడి లైట్ల జోడింపుతో కూడిన హెడ్ ల్యాంప్స్ ఎస్‌యూవీకి చక్కటి రూపాన్ని తీసుకొచ్చాయి.

మహీంద్రా టియువి స్టింగర్ కన్వర్టిబుల్ ఎస్‌యూవీ

ఫ్రంట్ మిర్రర్‌ను సపోర్ట్‌గా పట్టి ఉంచడానికి ఏ-పిల్లర్లు నిటారుగా ఉన్నాయి. దీంతో ఎస్‌యూవీ బాక్స్ ఆకారాన్ని తలపిస్తుంది. టియువి స్టింగర్ రూఫ్ టాప్‌ను తొలగించడంతో ఇంటీరియర్ ఎంతో విశాలంగా ఉంది. కాబట్టి ఇందులో ఇంటీరియర్ క్యాబిన్ స్పేస్ గురించి చింతించాల్సిన అవసరం లేదు.

మహీంద్రా టియువి స్టింగర్ కన్వర్టిబుల్ ఎస్‌యూవీ

భద్రత మరియు నాణ్యత పరంగా నమ్మకాన్ని తెలియజేస్తూ, దీనిని పూర్తిగా యువత కోసం ప్రత్యేకించి సిటీ అవసరాలకు అనుగుణంగా నమ్మకాన్ని, విశ్వాసాన్ని నింపేలా రూపొందించినట్లు మహీంద్రా పేర్కొంది.

మహీంద్రా టియువి స్టింగర్ కన్వర్టిబుల్ ఎస్‌యూవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

విడుదల లేదా ఆవిష్కరణ పరంగా మహీంద్రా వంతు వచ్చిన ప్రతిసారి యావత్ వాహన పరిశ్రమ మహీంద్రా అండ్ మహీంద్రా ప్రవేశపెట్టే మోడళ్లు ఎలా ఉంటాయో అని ఎదురుచూసేలా చేస్తుంది. ఈ ఆటో ఎక్స్‌పో 2018లో ఇప్పటి వరకు ఇండియన్ కస్టమర్లకు చేరువకాని ఓపెన్ టాప్ ఎస్‌యూవీని ఆవిష్కరించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

తాజా ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి...

English summary
Read In Telugu: Auto Expo 2018 - Mahindra TUV Stinger Revealed - Specifications, Images & Details

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark