మహీంద్రా హై ఎండ్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ700 టీజర్ రివీల్

Written By:
Recommended Video - Watch Now!
Auto Rickshaw Explodes In Broad Daylight

దేశీయ ఎస్‌యూవీల దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్లో ఉన్న టయోటా ఫార్చ్యూనర్ మరియు ఫోర్డ్ ఎండీవర్ అదే విధంగా జీప్ కంపాస్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనిచ్చే ఖరీదైన ప్రీమియమ్ ఎస్‌యూవీని విడుదలకు సిద్దం చేస్తోంది.

మహీంద్రా హై ఎండ్ లగ్జరీ ఎస్‌యూవీ

మహీంద్రాకు దేశీయంగా అతి ముఖ్యమైన మోడల్‍‌గా నిలవనున్న ఈ ప్రీమియమ్ ఎస్‌యూవీని ఎక్స్‌యూవీ700 పేరుతో లాంచ్ చేసే అవకాశం ఉంది. అధునాతన ఫీచర్లు మరియు 7-సీటింగ్ లేఔట్లో వస్తున్న ఎక్స్‌యూవీ700 టీజర్‌ను తాజాగా రివీల్ చేసింది.

మహీంద్రా హై ఎండ్ లగ్జరీ ఎస్‌యూవీ

మహీంద్రా భాగస్వామ్యపు సంస్థ శాంగ్‌యాంగ్ వారి రెక్ట్సాన్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌నే ఎక్స్‌యూవీ700 అనే పేరుతో తీసుకొస్తున్నారనే వాదన ఉంది. సరికొత్త బ్యాడ్జ్ పేరుతో వస్తున్న శాంగ్‌యాంగ్ రెక్ట్సాన్‌లో ప్రీమియమ్ ఫీల్ కలిగించే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, అత్యాధునిక ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రీమియమ్ లెథర్ అప్‌హోల్‌స్ట్రే, 360-డిగ్రీ కెమెరా, సన్‌రూఫ్ వంటి ఎన్నో టాప్ ఎండ్ ఫీచర్లు రానున్నాయి.

ల్యాడర్ ఫ్రేమ్ మీద 4x4 డ్రైవ్ సిస్టమ్‌తో వస్తున్న మహీంద్రా ఫ్లాగ్‌‌షిప్ ఎస్‌యూవీ ఒక రీజనబుల్ ఆఫ్ రోడ్ ఎస్‌యూవీగా నిలిచిపోనుంది. అంతర్జాతీయ మోడల్‌లో 2.2-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌తో రానుంది. 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఇది 186బిహెచ్‌పి పవర్ మరియు 420ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మహీంద్రా హై ఎండ్ లగ్జరీ ఎస్‌యూవీ

ఇండియన్ వెర్షన్ మహీంద్రా ఎక్స్‌యూవీ700లో మాత్రం ఇండియన్ ఆడియెన్స్‌కు అనుగుణంగా ఎక్ట్సీరియర్‌లో ప్రత్యేకమైన డిజైన్ సొబగులు, ఫ్రంట్ డిజైన్‌లో మహీంద్రా డిజైన్ మార్క్ పడనుంది. ఫిబ్రవరి 7, 2018 నుండి ప్రారంభమయ్యే 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వాహన ప్రదర్శన వేదికలో దీనిని ఆవిష్కరించనుంది.

మహీంద్రా హై ఎండ్ లగ్జరీ ఎస్‌యూవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టయోటా ఫార్చ్యూనర్ మరియు ఫోర్డ్ ఎండీవర్ ప్రీమియమ్ ఎస్‌యూవీల కంటే 3 నుండి 4 లక్షల వరకు తక్కువ ధరలో మహీంద్రా తమ ఎస్‌యూవీని తీసుకొచ్చే అవకాశం ఉంది. నిర్మాణత నాణ్యత, భద్రత పరమైన ఫీచర్లు మరియు అత్యాధునిక ఇంటీరియర్ ఫీచర్లతో పోటీదారులను ఎదుర్కునే లక్ష్యంతో మహీంద్రా తమ ప్రీమియమ్ ఎస్‌యూవీని తీర్చిదిద్దింది.

ఆటో ఎక్స్‍‌‌పోలో ఆవిష్కరణకు వస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ700 గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి.

ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకు సర్వం సిద్దం: తేదీ, అడ్రస్, టికెట్స్, టైమింగ్స్, ఈవెంట్ సమస్త సమాచారం మీకోసం

ఎన్‌టార్క్ 125 స్కూటర్ విడుదలతో హోండాకు గట్టి షాక్ ఇచ్చిన టీవీఎస్

బస్సు క్రింద పడిన వ్యక్తిని 70 కిమీలు ఈడ్చుకెళ్లిన కెఎస్ఆర్‌టిసి బస్సు

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Mahindra XUV700 'High-End' SUV Teased Ahead Of Debut At Auto Expo 2018
Story first published: Tuesday, February 6, 2018, 10:16 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark