ఆటో ఎక్స్‌పో కోసం భారీ పథకం పన్నిన మారుతి సుజుకి

Written By:
Recommended Video - Watch Now!
Tata Nexon Faces Its First Recorded Crash

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న భారతదేశపు అతి వాహన ప్రదర్శన 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదిక మీద సరికొత్త ఫ్యూచర్ ఎస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

మారుతి సుజుకి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్

ఆవిష్కరణకు ముందే మారుతి తమ ప్యూచర్ ఎస్ కాన్సెప్ట్‌కు సంభందించిన పలు టీజర్లను రివీల్ చేసింది. ప్రత్యేక డిజైన్ అంశాలను గుర్తించే కాన్సెప్ట్ మోడల్ ఫ్రంట్ ప్రొఫైల్‌తో కూడిన టీజర్ విడుదల చేసింది.

మారుతి సుజుకి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్

మారుతి అప్ కమింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా చెప్పుకునే ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్ సరికొత్త డిజైన్ లాంగ్వేజ్‌లో రూపుదిద్దుకుంది. అధునాతన డిజైన్ ఫిలాసఫీలో మారుతి ఇండియా డిజైన్ బృందం అభివృద్ది చేసింది. డిజైన్ పరంగా మారుతి సుజుకి మరో ముందడగు వేసిందని చెప్పవచ్చు.

మారుతి సుజుకి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్

ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విపణిలో ఉన్న మారుతి వితారా బ్రిజా స్థానంలో నిలవనుంది. కొలతల పరంగా ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్ పొడవు వితారా బ్రిజా కంటే 200ఎమ్ఎమ్ వరకు తక్కువగానే ఉంటుంది.

మారుతి సుజుకి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్

అయితే, ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్ డిజైన్ మారుతికి ఒక పెద్ద సవాలుగా మారనుంది. విపణిలో ఉన్న ఎన్నో కాంపాక్ట్ ఎస్‌యూవీలతో పోల్చుకుంటే విభిన్న శైలిలో వస్తున్న ఫ్యూచర్ ఎస్ కస్టమర్లను ఏ మేరకు ఆకర్షిస్తుందో వేచి చూడాలి.

మారుతి సుజుకి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్

ప్యూచర్ ఎస్ కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ దశకు చేరుకుంటే నిటారుగా ఉన్న పిల్లర్లు మరియు ఎస్‌‌యూవీ చూడటానికి సాంప్రదాయకరమైన క్లాసిక్ డిజైన్‌లో వచ్చే అవకాశం ఉంది. మారుతి ఇది వరకే అభివృద్ది చేసిన బాలెనో, న్యూ డిజైర్ మరియు అప్ కమింగ్ స్విఫ్ట్ కార్ల కోసం ఉపయోగించిన హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీద ఫ్యూచర్ ఎస్ ను డెవలప్ చేస్తోంది.

మారుతి సుజుకి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ మారుతి పరీక్షించి, ప్రయోగించిన 1.2-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్‌లో రానుంది. అంతే కాకుండా పలు రకాల ఎలక్ట్రిక్ ఆధారిత ఫీచర్లు రానున్నాయి.

మారుతి సుజుకి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్

ఇండియన్ మార్కెట్లోకి కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో మంచి అవకాశాలు ఉండటంతో మారుతి మరో కాంపాక్ట్ ఎస్‌యూవీని 1.5-లీటర్ డీజల్ ఇంజన్‍‌తో తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. ప్రొడక్షన్ వెర్షన్ ఫ్యూచర్ ఎస్ కాంపాక్ట్ ఎస్‌యూవీని 2018 చివరి నాటికి లేదా 2019 ప్రారంభంలో విడుదల చేసే అవకాశం ఉంది.

మారుతి సుజుకి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్

మారుతి సుజుకి ఈ ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్‌ను లాంచ్ చేస్తే, విపణిలో ఉన్న రెనో క్విడ్‍‌కు పోటీగా నిలిచే అవకాశం ఉంది. నిజనానికి రెనో క్విడ్ డిజైన్ ద్వారానే మంచి ఆదరణ లభించింది. క్విడ్ సక్సెస్‌లో ప్రధానంగా నిలిచిన డిజైన్‌ను టార్గెట్ చేస్తూ దీనిని అభివృద్ది చేసే అవకాశం ఉంది.

మారుతి సుజుకి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్

ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్ పేరుతో పాటు, మారుతి సుజుకి ఇ-సర్వైవర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మరియు నెక్ట్స్ జనరేషన్ సుజుకి హైబ్రిడ్ సిస్టమ్‌ను ఆవిష్కరించనుంది. అప్ కమింగ్ ఆటో ఎక్స్‌పోలో ఫ్యూచర్ ఎస్ మరియు సరికొత్త స్విఫ్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

మారుతి సుజుకి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో మారుతి సుజుకి అధిక వాటాను సొంతం చేసుకుంది. ఎంట్రీ లెవల్ కార్ల సెగ్మెంట్లో ఉన్న ఆల్టో, సెలెరియో నుండి ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఉన్న వితారా బ్రిజా మరియు ఎస్-క్రాస్ వరకు దాదాపు అన్ని సెగ్మెంట్లలో భారీ విజయాన్ని అందుకుంది.

అతి త్వరలో ప్రారంభం కానున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో ద్వారా పలు కొత్త మోడళ్లను ఆవిష్కరించి, తిరుగులేని సక్సెస్ అందుకునేందుకు ప్రయత్నిస్తోందని చెప్పవచ్చు.

English summary
Read In Telugu: Maruti Future S Concept Teased — To Debut At Auto Expo 2018
Story first published: Thursday, January 25, 2018, 10:51 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark