16 ఎడిషన్ డెసర్ట్ స్టార్మ్ ర్యాలీ ప్రారంభించిన మారుతి సుజుకి

Written By:

ర్యాలీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారతదేశపు అతి పెద్ద ర్యాలీ మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 నోయిడాలో ఘనంగా ప్రారంభమైంది. ఈ ఏడాది ఎగ్జాన్‌మొబిల్ మరియు మారుతి భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న ఈ మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ ర్యాలీ సుమారుగా 2,500 కిలోమీటర్ల మేర సాగనుంది.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీ

డెసర్ట్ స్టార్మ్ ర్యాలీ మొత్తం 11 దశలను కలిగి ఉంది. ఈ ర్యాలీలో చాలా వరకు రూట్లు అత్యంత వేడితో కూడిన థార్ ఎడారుల గుండా సాగనుంది. చివరి దశ 2018 డెసర్ట్ స్టార్మ్ ర్యాలీ గోల్డెన్ సిటీ ఆఫ్ జైసల్మీర్‌లో ముగియనుంది.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీ

2018 డెసర్ట్ స్టార్మ్ ర్యాలీలో మోటార్ సైకిల్ సెగ్మెంట్‌కు డకార్ ర్యాలీలో పాల్గొన్న మొదటి ఇండియన్ రైడర్ సిఎస్ సంతోష్ నాయకత్వం వహిస్తాడు. ఈ ర్యాలీలో సిఎస్ సంతోష్ హీరో 450 ఆర్ఆర్ బైకును రైడ్ చేస్తాడు.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీ

డెసర్ట్ స్టార్మ్ 2017 విన్నర్ సురేశ్ రాణా తన ఆఫ్ రోడ్ మారుతి సుజుకి గ్రాండ్ వితారా వెహికల్‌తో ఫోర్ వీలర్ సెగ్మెంట్‌ను జెండా ఊపి ప్రారంభించాడు. డెసర్ట్ స్టార్ట్ ప్రారంభ వేడుక నోయిడాలోని గ్రేడ్ ఇండియా ప్యాలెస్ పార్కింగ్ ప్రదేశంలో నిర్వహించారు.

Recommended Video - Watch Now!
Dakar Rally - Everything You Need To Know - DriveSpark
మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీ

డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీలో కార్లు, ఎస్‌యూవీలు, మోటార్ సైకిళ్లు మరియు ఏటివి వాహనాలు కూడా ఉన్నాయి. ఈ 2018 ర్యాలీలో ఏకంగా 140 మంది ఔత్సాహికులు పాల్గొంటున్నారు. వీరిలో విదేశీయులు కూడా ఉన్నాయి.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీ

ర్యాలీ ప్రారంభానికి చివరి నిమిషంలో తమ వాహనాలను సెట్ చేసుకోవడాన్ని గమనించవచ్చు. ర్యాలీలో టైమ్ చాలా ముఖ్యమైనది ఏ మాత్రం ఆలస్యమైన చాలా పెద్ద మార్పులు జరుగుతాయి. కఠినమైన వాతావరణ పరిస్థితులు మరియు దుర్భేధ్యమైన భూబాగాల్లో పోటీదారులు తమ వాహనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ ప్రదేశంలోనైనా వాహనాల్లో సమస్యలు ఎదురైతే పోటీదారులే పరిష్కరించుకోవాలి, ఇందుకు ర్యాలీ నిర్వాహకుల నుండి ఎలాంటి సహాయం లభించదు.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీ

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 విభిన్న రైడర్ల మధ్య పోటీ జరగనుంది. కొంత ఇది వరకే డెసర్ట్ స్టార్మ్ ర్యాలీలో పాల్గొనగా, మరికొంత మొదటి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. స్నేహితులు, భార్యాభర్తలు, తండ్రీకొడుకులు మరియు మహిళా జట్లు కూడా పాల్గొంటున్నాయి. మారుతి సుజుకి మరియు ఎగ్జాన్‌మొబిల్ ప్రతినిధులు ప్రతి ఔత్సాహిక జట్టు ప్రారంభానికి సహకరిస్తున్నారు.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీ

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ర్యాలీ మరియు రేసింగ్ ఔత్సాహికులు తరలివచ్చారు. పోటీదారులతో ర్యాలీ మార్చి 18, 2018 సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైంది.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీ

రానున్న ఐదు రోజుల్లో మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీ కోసం దేశవ్యాప్తంగా ర్యాలీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తారు. మొదటి మూడు దశల ర్యాలీ బికనీర్ పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ఎగ్జాన్‌మొబిల్ భాగస్వామ్యంతో మారుతి సుజుకి నిర్వహిస్తున్న డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీ అప్‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి....

English summary
Read In Telugu: Maruti Suzuki Desert Storm 2018 Powered By ExxonMobil — India’s Ultimate Rally Commences
Story first published: Monday, March 19, 2018, 19:07 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark